Arjun Suravaram
ఆ వివాహిత భర్త విదేశాల్లో ఉంటాడు. పిల్లలు, వృద్ధులైన అత్తమామలతో ఆ మహిళ కలిసి జీవనం సాగిస్తుంది. అయితే ఆమె చేసిన చిన్న తప్పు.. జీవితాన్ని బలి తీసుకుంది. ఏకంగా విదేశాల్లో ఉన్న భర్తకు షాకిచ్చింది.
ఆ వివాహిత భర్త విదేశాల్లో ఉంటాడు. పిల్లలు, వృద్ధులైన అత్తమామలతో ఆ మహిళ కలిసి జీవనం సాగిస్తుంది. అయితే ఆమె చేసిన చిన్న తప్పు.. జీవితాన్ని బలి తీసుకుంది. ఏకంగా విదేశాల్లో ఉన్న భర్తకు షాకిచ్చింది.
Arjun Suravaram
జీవితం ఎంతో అందమైనది, అరుదైనది. దీనిని ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగాలి. అయితే కొందరు మాత్రం అనుకోకుండా చేసే చిన్న తప్పుల కారణంగా ప్రమాదాల్లో చిక్కుకుని, తరువాత దారుణ నిర్ణయాలు తీసుకుంటారు. తాజాగా ఓ మహిళ కూడా విదేశాల్లో ఉన్న తన భర్తకు ఊహించని షాకిచ్చింది. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు ఆమె దారుణ నిర్ణయం తీసుకుంది. ఆరతి ఎంత పని చేశావంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తమిళనాడు రాష్ట్రం ఎర్నాకులం ప్రాంతానికి చెందిన ఆరతి అనే మహిళ(31) తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటుంది. ఆమె భర్త అనీష్ విదేశాల్లో ఉంటాడు. ఎర్నాలకులంకి చెందిన అనీస్ కు, పెరుంబవురూకు చెందిన ఆరతితో కొన్నేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి దేవదత్, దేవ సూర్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆరతి భర్త సౌదీ అరేబియాలో ఉద్యోగం చేస్తున్నాడు. కొద్దినెలల క్రితం ఆరతి ఇంటి అవసరాల కోసం ఓ లోన్ యాప్ లో రుణం తీసుకుంది. కొన్ని రోజులు గడిచిన తరువాత తీసుకున్న రుణం, వడ్డీ చెల్లించాలంటూ లోన్ యాప్ నిర్వహాకులు ఆమెకు ఫోన్లు చేశారు.
అంతేకాక తరచూ ఫోన్లు చేస్తూ..ఆమెను వేధించడం మొదలుపెట్టారు. అయితే తాను తీసుకున్న లోన్ తిరిగి చెల్లించేందుకు కాస్తా సమయం కోరింది ఆరతి. అయినా ఆమె విజ్ఞప్తిని పట్టించుకోని లోన్ యాప్ నిర్వహాకులు గడువు అంగీకరించలేదు. రెండ్రోజుల్లోపు కట్టకపోతే ఫోన్లో ఉన్న నంబర్లకు కాల్ చేస్తామని బెదిరించారు. వాళ్లు అలా చేస్తే.. తన కుటుంబం పరువు పోతుందని ఆరతి భావించింది. ఈ క్రమంలోనే చాలా రోజులు మానసిక వేదనకు గురైంది. చివరకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.ఇక సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఆరతి ఇంటికి వెళ్లారు. తల్లి శవం ముందు కూర్చొని ఇద్దరు పిల్లలను చూసిన గ్రామస్థులకు హృదయం చలించింది.
వృద్ధులైన ఆరతి అత్తమామలను.. ఆమె మృతదేహం చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇక భార్య మృతి గురించి విని భర్త షాకయ్యాడు. అనిష్ స్వదేశానికి వచ్చిన తరువాత ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఈఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ లోన్ యాప్ కారణంగా ఎంతో మంది బలవుతున్నారు. రెండు రోజుల క్రితం నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తి కూడా ఈ లోన్ యాప్ కారణంగా బలయ్యారు. అలానే ఎందరో విద్యార్థులు ఈ లోన్ యాప్ వలలో చిక్కి ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరి.. ఇలాంటి దారుణాలు జరగకుండా నివారణ చర్యలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.