iDreamPost
android-app
ios-app

వీడియో: రైల్వే ట్రాక్‌పై పడుకొని తండ్రీకొడుకుల ఆత్మహత్య!

నేటికాలంలోచాలా మంది జీవితంలో ఎదురయ్యే ప్రతి చిన్న విషయానికి ఆందోళనకు గురవుతున్నారు. అలానే తీవ్ర మానసికి వేదనకు గురై జీవితాన్ని విరమించేస్తున్నారు. తాజాగా ఓ తండ్రీకొడుకులు చేసిన పని అందరినీ కన్నీరు పెట్టిస్తుంది.

నేటికాలంలోచాలా మంది జీవితంలో ఎదురయ్యే ప్రతి చిన్న విషయానికి ఆందోళనకు గురవుతున్నారు. అలానే తీవ్ర మానసికి వేదనకు గురై జీవితాన్ని విరమించేస్తున్నారు. తాజాగా ఓ తండ్రీకొడుకులు చేసిన పని అందరినీ కన్నీరు పెట్టిస్తుంది.

వీడియో: రైల్వే ట్రాక్‌పై పడుకొని తండ్రీకొడుకుల ఆత్మహత్య!

నేటికాలంలో మనిషిలో సహనం, ఆత్మవిశ్వాసం అనేవి కనుమరుగై పోతున్నాయి. అందుకే జీవితంలో ఎదురయ్యే ప్రతి చిన్న విషయానికి ఆందోళనకు గురవుతున్నారు. అలానే తీవ్ర మానసికి వేదనకు గురై జీవితాన్ని విరమిస్తున్నారు. కొందరు పరీక్షల్లో ఫెయిల్, మరికొందరు ప్రేమ ఫెయిల్, ఇంకొందరు ఆర్థిక సమస్యలు.. ఇలా వివిధ కారణాలతో చాలా మంది నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరం ముగిస్తున్నారు. తాజాగా ఓ తండ్రీకొడులు రైల్వేట్రాక్ పై పడుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మహారాష్ట్రలోని పాల్ఘర్ ప్రాంతలో ఈ ఘటన చోటుచేసుకుంది. భయందర్ అనే రైల్వే స్టేషన్ లో ఈ ఘోర విషాదం జరిగింది. సోమవారం ఉదయం 9.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. పాల్ఘర్ జిల్లాలోని వసాయ్ ప్రాంతంలో 60ఏళ్ల హరీష్ మోహతా, 35ఏళ్ల జైగా అనే కుమారుడు నివాసం ఉంటున్నారు. ఏమైందో ఏమో తెలియదు కానీ.. సోమవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరు ఆత్మహత్య చేసుకున్న ఘటన సమీపంలోని రైల్వే స్టేషన్ లోని సీసీ పుటేజ్ లో రికార్డైంది. ఇక ఆ వీడియోలో చూసినట్లు అయితే.. రైలు రావడం చూసి ఇద్దరూ ఒకరి చేతులు మరొకరు పట్టుకుని స్టేషన్ లో నుంచి ట్రాక్‌ వైపు వెళ్లారు.

ఇక ట్రైన్ సమీపంలోకి రాగానే ట్రాక్ పై పడుకున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపిస్తోంది. దీంతో వారిపై నుంచి క్షణాల్లో ట్రైన్ దూసుకెళ్లింది. దీంతో వారిద్దరు అక్కడిక్కడే మరణించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. తండ్రీకొడుకులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే ఈ తండ్రీకొడుకుల ఆత్మహత్య వెనుక గల కారణం ఏంటనేది ఇంకా తెలియరాలేదు. పోలీసులు ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇలా తరచూ ఏదో ఒక ప్రాంతంలో ఆత్మహత్య ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మరి.. ఇలాంటి ఘటనల నివారణకు చర్యలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి