iDreamPost
android-app
ios-app

చనిపోయేందుకు గేమింగ్ స్కెచ్.. 14వ అంతస్తు నుంచి దూకిన విద్యార్థి!

Pune News: ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది. కారణం.. అతడు సూసైడ్ చేసుకునే ముందు చావడం కోసం గేమింగ్ కోడ్ తో ఎవరికి అర్థం కాని స్కెచ్ వేశాడు. ఇక ఈ ఘటనకు సంబంధించి విస్తుతపోయే నిజాలు తెలిశాయి.

Pune News: ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది. కారణం.. అతడు సూసైడ్ చేసుకునే ముందు చావడం కోసం గేమింగ్ కోడ్ తో ఎవరికి అర్థం కాని స్కెచ్ వేశాడు. ఇక ఈ ఘటనకు సంబంధించి విస్తుతపోయే నిజాలు తెలిశాయి.

చనిపోయేందుకు గేమింగ్ స్కెచ్.. 14వ అంతస్తు నుంచి దూకిన విద్యార్థి!

నేటికాలంలో పిల్లల ఆలోచన తీరును తల్లిదండ్రులు పరిశీలిస్తుంటాలి. కారణం.. ఎవరిలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో అర్థం కాని పరిస్థితి. ఏమాత్రం నెగిటీవ్ ఆలోచనలు ఉన్నట్లు కనిపించినా..వెంటనే అప్రమత్తంగా కావాలి. కొందరు తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తను అస్సలు పట్టించుకోరు. దీంతో కొన్ని సందర్భాల్లో కొందరు పిల్లలు చావడం, చంపడం వంటి దారుణమైన నిర్ణయాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ పదో తరగతి విద్యార్థి..గేమింగ్ కోడ్ తో స్కెచ్ వేసి మరి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఆ విద్యార్థి వేసిన స్కెచ్ పోలీసులు సైతం తలల పట్టుకున్నారు. ఈ ఘటన పూణెలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

ఈనెల 26 శుక్రవారం మహారాష్ట్ర లోని పుణెలో ని ఓ అపార్టుమెంట్ లో బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 14వ అంతస్తు నుంచి దూకి ఆ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ క్రమంలో ఆ బాలుడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు జరిపిన దర్యాప్తు ఆశ్చర్యం కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాను చనిపోయేందుకు ముందుగానే ఆ బాలుడు స్కెచ్ వేశాడు. దానిని చూసిన పోలీసులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

పదో తరగతి విద్యార్థి ఇంత పెద్ద ఎత్తున్న ప్లాన్ చేయడం చూసి పోలీసులతో పాటు స్థానికులు సైతం షాకయ్యారు. అదే విధంగా ఘటనలో ఈ నివ్వెర పోయే నిజాలు బయటకు వచ్చాయి. ఆ బాలుడి గదిలో ఓ సూసైడ్ నోట్, దానితోపాటు తన చేతితో స్వయంగా సూసైడ్ చేసుకునేందుకు గీసిన లే అవుట్ ను పోలీసులు గుర్తించారు. ఈ మ్యాప్ లో బిల్గిండ్ పై నుంచి ఎలా దూకాలనే విషయంపై గేమింగ్ కోడ్ లో వ్రాసిన పేపర్లు ఉన్నాయి. ఈ స్కెట్ ను చూసిన పోలీసులు, బాలుడి తల్లిదండ్రులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  మృతుడి తండ్రి విదేశాల్లో ఉండగా.. తల్లి ఓ ఇంజనీరు విధులు నిర్వహిస్తుంది. బాలుడు ఆన్ లైన్ గేమింగ్ కు అలవాటు పడ్డాడని,  రోజంతా ఈ ఆటల్లోనే గడిపేవాడని మృతుడి తల్లి పోలీసులు తెలిపింది. చనిపోయే ముందు రోజు కూడా ఆ బాలుడు.. రోజంతా గదిలోనే ఉండిపోయాడని అతడి తల్లి తెలిపింది. మొత్తంగా ఆ బాలుడి ఆత్మహత్య, అందుకు వేసిన స్కెచ్ స్థానికంగా సంచలనంగా మారింది.

ముక్కుపచ్చలారని బాలుడు.. తన చావుకు స్కెచ్ వేసుకున్నాడంటే ఎవరు నమ్మరు. అంతేకాక ప్రీ ప్లాన్డ్ ఎలా చావాలి.. ఎలా అంతస్తు నుంచి దూకితే ఎలా స్పాట్ లో చచ్చిపోవచ్చు.. అని ఎవ్వరికీ అర్థంకాని విధంగా గేమింగ్ కోడ్ లో మ్యాప్ వేసుకున్నాడంటే అందరిని ఆందోళనకి గురి చేస్తుంది. ఇక ఆబాలుడు రాసిన కోడ్ ను అర్థం చేసుకోవడానికి పోలీసులకు సైతం ఓ పెద్ద సవాల్ గా మారిందంటే, ఆ బాలుడి తెలివి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చిని మానసిక నిపుణులు చెబుతున్నారు. పిల్లల ప్రవర్తను నిత్యం పరిశీలిస్తుండాలని తల్లిదండ్రులకు వైద్య నిపుణులు సూచిస్తున్నారు.