iDreamPost
android-app
ios-app

ప్రేమించిన యువతి కోసం ఎంత పనిచేశాడంటే?

  • Published Apr 21, 2024 | 3:26 PM Updated Updated Apr 21, 2024 | 3:41 PM

ఈ మద్య యువత ఎక్కువగా ప్రేమ పెళ్లిళ్ల వైపే మొగ్గు చూపుతున్నారు. తాము ప్రేమించిన వారికోసం దేనికైనా సిద్దపడుతున్నారు.

ఈ మద్య యువత ఎక్కువగా ప్రేమ పెళ్లిళ్ల వైపే మొగ్గు చూపుతున్నారు. తాము ప్రేమించిన వారికోసం దేనికైనా సిద్దపడుతున్నారు.

  • Published Apr 21, 2024 | 3:26 PMUpdated Apr 21, 2024 | 3:41 PM
ప్రేమించిన యువతి కోసం ఎంత పనిచేశాడంటే?

ఇటీవల కొంతమంది చిన్న విషయాలకే మనస్థాపానికిగురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ సమయంలో విచక్షణ కోల్పోయి ఎదుటి వారిపై దాడులు చేయడం, కొన్నిసార్లు హత్యలు చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఇటీవల యువత చాలా వరకు ప్రేమ పెళ్లిళ్లకే జై కొడుతున్నారు. పెద్దలు కుదిర్చిన వివాహాలను కాదని తాము మనస్ఫూర్తిగా ఇష్టపడ్డవారిని పెళ్లి చేసుకోవడానికి దేనికైనా సిద్దపడుతున్నారు. కొన్నిసార్లు ఈ వ్యవహారాల్లో విషాదాలు జరుగుతున్నాయి.  తాజాగా ఓ యువకుడు తాను ప్రేమించిన యువతి కోసం దారుణానికి తెగబడ్డాడు. ఈ ఘటన రాయచూర్ జిల్లాలో చోటు చేసుకుంది.  వివరాల్లోకి వెళితే..

కర్ణాటక.. రాయచూర్ జిల్లా సింధనూరు తాలూకా ఆర్ హెచ్ క్యాంప్ – 3 లో ప్రణవ్ అనే యువకుడు ఓ యువతిని ప్రేమించాడు. తల్లిదండ్రులకు తెలియకుండా ప్రియురాలితో కొంత కాలం చట్టాపట్టాలేసుకొని తిరిగాడు. ఇద్దరూ ఎలాగైనా పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి ప్రేమ వ్యవహారం యువతి ఇంట్లో తెలిసిపోయింది. దీంతో యువతిని మందలించినా ఫలితం లేకపోవడంతో ఆమె తల్లిదండ్రులు దగ్గరి బంధువుల ఇంటికి పంపించి అక్కేడే కొంత కాలం ఉంచారు. తన ప్రేయసి కనిపించకపోవడంతో ప్రణవ్ పిచ్చెక్కిపోయాడు. ఏం జరిగిందన్న విషయంపై వాకబు చేయగా.. తాను ప్రేమించిన అమ్మాయిని బంధువుల ఇంటికి పంపిన విషయం తెలిసింది.

ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన ప్రణవ్ కోపంతో తన ఫ్రెండ్స్ తో కలిసి యువతి తల్లిదండ్రుల ఇంటికి చేరుకున్నారు. యువతి తండ్రి హిరా మోహన్, తల్లి శ్రుతి మండల్, సోదరుడు హిమాంశు వారి బంధువుల పై మారణాయుధాలతో తీవ్రంగా దాడి చేసి గాయపరిచాడు. స్థానికులు గట్టిగా అరవడంతో అక్కడ నుంచి పారిపోయారు. యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కూతురుకి మాయమాటలు చెప్పడి మోసం చేయడానికి ప్రయత్నించాడని.. తప్పని చెప్పినందుకు తమను విచక్షణారహితంగా కొట్టాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు సింధనూరు గ్రామీణ పోలీసులు తెలిపారు.

Jojobet GirişJojobetcasibomjojobetjojobetcasibomcasibomcasibomcasinomilyonşanlıurfa konteynerbetciobetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetJojobetStarzJojobetStarzbetjojobet güncel girişgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetgrandpashabet girişcasibom