P Krishna
Karnataka Crime News: వేద మంత్రాల సాక్షిగా పెద్దలు.. బంధుమిత్రుల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంటను నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దీవిస్తుంటారు.
Karnataka Crime News: వేద మంత్రాల సాక్షిగా పెద్దలు.. బంధుమిత్రుల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంటను నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దీవిస్తుంటారు.
P Krishna
పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు. పెద్దల సమక్షంలో రెండు నెలల క్రితం మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంట జీవితం హ్యాపీగా కొనసాగుతుంది. భర్తతో నవ వధువు బంగారం లాంటి జీవితాన్ని ఊహించుకుంది. తానొకటి తలిస్తే.. దేవుడొకటి తలిచాడని జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురవుతుంటాయి. హ్యాపీగా సాగిపోతున్న ఆ వివాహిత జీవితంలో ఊహించని సంఘటన ఎదురు కావడంతో అందరూ షాక్ కి గురయ్యారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం కార్కళ తాలూకా తెల్లారు గ్రామంలోొ చోటు చేసుకుంది. ఇంతకీ ఆ సంఘటన ఏంటీ? ఆ నవ వధువుకి ఏమైందీ? అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..
ఇటీవల దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. అతి వేగం, నిద్ర లేమి, నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం, అనుభవ లేమి ఇలా ఎన్నో కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాల్లో ఎంతోమంది అమాయకులు కన్నుమూస్తున్నారు. పెళ్లైన రెండు నెలలకే నవ వధువు రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది.. ఈ విషాద సంఘటన ఉడుపి జిల్లా కార్కళ తాలూకాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లారు గ్రామానికి చెందిన నీక్ష అనే యువతికి రెండు నెలల క్రితం విశాల్ అనే యువకుడితో పెళ్లైంది.
భర్తతో బంగారం లాంటి భవిష్యత్ ఊహించుకుంది నీక్ష. ఆనందంగా సాగిపోతున్న ఆమె జీవితంలో మృత్యువు కుక్క రూపంలో తరుముకొచ్చింది. దంపతులు బైక్ పై వెళ్తున్న సమయంలో కార్కళ తాలూకా తెల్లారు గ్రామం సమీపంలో హెస్మారు వంతెన వద్ద హఠాత్తుగా కక్క అడ్డం వచ్చింది. దాన్ని తప్పించే క్రమంలో బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కలొ రాళ్లపై పడిపోయారు. ప్రమాదంలో నీక్ష తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. విశాల్ కి స్వల్పంగా గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీంతో ఇరు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పెళ్లై రెండు నెలలే అయ్యింది.. అంతలోనే ఈ విషాదం జరగడంతో ఇరు గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది.