తాళి కడుతుండగా పెళ్లిపీటల మీద వధువు మృతి.. ఎక్కడంటే?

Jalalabad Crime News: వివాహబంధంలోకి అడుగు పెట్టి అందమైన జీవితాన్ని గడపాలని అనుకున్న ఓ వధులు ఆశలు ఆవిరైపోయాయి.. ఈ విషాద ఘటన ఎక్కడ జరిగిందంటే..

Jalalabad Crime News: వివాహబంధంలోకి అడుగు పెట్టి అందమైన జీవితాన్ని గడపాలని అనుకున్న ఓ వధులు ఆశలు ఆవిరైపోయాయి.. ఈ విషాద ఘటన ఎక్కడ జరిగిందంటే..

పెళ్లంటే నూరేళ్ళ పంట అంటారు పెద్దలు. వేద మంత్రాల సాక్షిగా.. పచ్చని పందిరిలో.. వాయిద్యాల మధ్య ఎక్కడో పుట్టి.. ఏక్కడో పెరిగి పెళ్లి బంధంతో ఒక్కటైన వధూవరులను నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని పెద్దలు ఆశీర్వదిస్తారు. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారని అంటారు.  ఈ మధ్య కాలంలో చాలా వరకు వివాహ వేడుకలు చాలా గ్రాండ్ గా జరుగుతున్నాయి. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు తమ స్థాయికి తగ్గట్టుగా వెరైటీ పద్దతుల్లో వివాహ వేడుకలు నిర్వహిస్తున్నారు.  ఇటీవల కాలంలో వివాహవేడుకల్లో కొన్ని అపశృతులు జరుగుతున్నాయి. అలాంటి ఘటనే ఒకటి పంజాబ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఎంతో సంబరంగా పెళ్లి బాజాలు మోగాల్సి ఉన్న ఇంట.. చావు డబ్బులు మోగాయి. చిరునవ్వులతో పెళ్లి పీటలెక్కిన పెళ్లి కూతురు అంతలోనే పాడెక్కింది. పెళ్లి పందిరిలో తాళి కట్టే సమయంలోనే హఠాత్తుగా కుప్పకూలి నవ వధువు కన్నుమూయడంతో పెళ్లి కొడుకు, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. దీంతో ఆ పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. ఈ విషాద ఘటన పంజాబ్‌ రాష్ట్రం ఫజిల్కా జిల్లాలోని  సవాహ్వాలా  గ్రామంలో చోటు చేసుకుంది. భర్తను పెళ్లాడి అత్తవారింటికి వెళ్లాల్సిన నూతన వధువు పెళ్లి సమయంలోనే చనిపోవడంతో అప్పటి వరకు ఎంతో ఆనందోత్సాహాలతో ఉన్న ఆ ఇంట ఒక్కసారిగా  విషాద ఛాయలు నెలకొన్నాయి.

ఫజిల్కా జిల్లాలోని జలాలాబాద్ కి చెందిన గుర్ ప్రీత్ సింగ్ తో సవాహ్వాలా గ్రామానికి చెందిన నీలం అనే యువతితో పెళ్లి కుదిరింది. ఫిబ్రవరి 26న వధువు ఇంటి వద్ద గ్రాండ్ గా పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాలు నిశ్చయించాయి. పెళ్లికి ముందు ఇరుకుటంబాల సంప్రదాయాలు పాటిస్తూ పెళ్లి తంతు మొదలు పెట్టారు. హల్తీ, సంగీత్ కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహించారు. ఇక పచ్చని పందిరిలో వధూవరులు కూర్చుని ఉన్నారు. బంధుమిత్రుల కోలాహలం మొదలైంది. పెళ్లి కట్టే సమయానికి నీలం ఒక్కసారిగా కుప్పకూలి పోయింది. కళ్లు తిరిగి ఉంటాయని భావించి ఆమెపై నీళ్లు చల్లారు.. కానీ చలనం లేకపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నీలం ప్రాణం పోయిందని వైద్యులు నిర్దారించారు. ఆ మాట విన్న పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఒక్కసారే కన్నీరు మున్నీరయ్యారు. అయితే పెళ్లికి ముందు జరిపే కార్యక్రమాల్లో పాల్గొన్న నీలం అప్పటికే అలసిపోయి ఉండటం.. హూమం నుంచి వచ్చిన పొగవల్ల ఉక్కిరి బిక్కిరి అయి బీపీ డౌన్ కావడం వల్ల ప్రాణాలు కోల్పోయి ఉంటుందని వైధ్యులు భావిస్తున్నారు. ఈ ఘటన సవాహ్వాలా గ్రామంలో తీవ్ర విషాదం నింపింది.

Show comments