iDreamPost
android-app
ios-app

షాకింగ్ వీడియో: సెలూన్ లో ఇద్దరి హత్య.. పాయింట్ బ్లాంక్‌ రేంజ్‌లో..

  • Published Feb 09, 2024 | 9:51 PM Updated Updated Feb 09, 2024 | 9:51 PM

దేశంలో నేరాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. పెద్ద పెద్ద నగరాల్లో దుండగులు గన్స్ తో రెచ్చిపోతున్నారు. పబ్లిక్ లోనే పాయింట్ బ్లాక్ లో కాల్చి చంపుతున్నారు.

దేశంలో నేరాల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. పెద్ద పెద్ద నగరాల్లో దుండగులు గన్స్ తో రెచ్చిపోతున్నారు. పబ్లిక్ లోనే పాయింట్ బ్లాక్ లో కాల్చి చంపుతున్నారు.

షాకింగ్ వీడియో: సెలూన్ లో ఇద్దరి హత్య.. పాయింట్ బ్లాంక్‌ రేంజ్‌లో..

ఇటీవల ఈజీ మనీ కోసం కొంతమంది ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించి లగ్జరీ జీవితాలు గడపాలని చూస్తున్నారు. ఇందుకోసం ఎదుటి వారి మోసం చేయడం.. అవసరమైతే ప్రాణాలు సైతం తీస్తున్నారు. మెట్రో నగరాల్లో అక్రమాయుధాల వ్యాపారం బాగా పెరిగిపోయింది. దీంతో గల్లీ రౌడీ నుంచి మాఫీయా డాన్ ల వరకు గన్ తో వీరంగం సృష్టిస్తున్నారు. ఇటీవల దేశంలో పలు ప్రాంతాల్లో దుండగులు గన్ తో వచ్చి కాల్పులు జరుపుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీలో సెలూన్ షాప్ లో ఇద్దరు హత్య తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..

దేశ రాజధాని ఢిల్లీలో ఓ సెలూన్ షాప్ లోకి దుండగులతు ఇద్దరు వ్యక్తులపై పాయింట్ బ్లాక్ రేంజ్ లో కాల్పులు జరిపి హత్య చేసి అక్కడ నుంచి దర్జాగా పారిపోయారు. దీనికి సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఢిల్లీ నజాఫ్‌గఢ్ ప్రాంతంలోని ఒక సెలూన్ లో ఇద్దరు దుండగులు ప్రవేశించారు. అక్కడ క్షవరం చేయించుకుంటున్న వ్యక్తిపై గన్ తో కాల్పులు జరిపాడు.. మరో వ్యక్తి అక్కడే కూర్చున్న వ్యక్తిపై పాయింగ్ బ్లాక్ లో కాల్చి చంపి దర్జాగా నడుచుకుంటూ వెళ్లారు. అక్కడికి ఓ మహిళ వచ్చి భయంతో లోపలికి పరుగెత్తడం సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డు అయ్యింది. హత్య చేసిన తర్వాత షెటర్ ఓపెన్ చేసి దుండగులు పారిపోయారు. కాల్పుల శబ్ధం విని అక్కడ జనాలు భయంతో పరుగులు తీశారు.

స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడి చేరుకొని కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు చనిపోయినట్లు తెలిపారు. సెలూన్ లో రికార్డు అయిన సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు..వీటి ఆధారంగా నింధితులను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో నేరాల సంఖ్య పెరిగిపోతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.