సరదా గా ప్రాంక్ వీడియో చేస్తున్నారా.. ఇలా కూడా జరగవచ్చు

ఈ మధ్య సోషల్ మీడియాలో రీల్స్ పేరిట కొంతమంది చేస్తున్న విన్యసాలు ప్రాణాల మీదకు తెచ్చిపెడుతున్నాయి. ఇప్పటికే ఈ రీల్స్ పేరిట చాలామంది ప్రాణాలు పొగొట్టుకుంటున్న కనీసం భయం అనేది లేకుండా పోతుంది. అయితే తాజాగా సరదా కోసం ప్రాంక్ వీడియో చేస్తున్న క్రమంలోనే ఓ మహిళ ప్రాణాలు పొగొట్టుకునే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ మధ్య సోషల్ మీడియాలో రీల్స్ పేరిట కొంతమంది చేస్తున్న విన్యసాలు ప్రాణాల మీదకు తెచ్చిపెడుతున్నాయి. ఇప్పటికే ఈ రీల్స్ పేరిట చాలామంది ప్రాణాలు పొగొట్టుకుంటున్న కనీసం భయం అనేది లేకుండా పోతుంది. అయితే తాజాగా సరదా కోసం ప్రాంక్ వీడియో చేస్తున్న క్రమంలోనే ఓ మహిళ ప్రాణాలు పొగొట్టుకునే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం ఈ మధ్య రీల్స్ చేస్తున్న వారి పిచ్చి ఫిక్స్ కు వెళ్తుతుంది. ఈ క్రమంలోనే.. చాలామంది వింత వింత ప్రయాత్నాలు, విన్యసాలే చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకోవడం కొంతమంది ప్రాంక్ వీడియోలు చేస్తూ తమని తాము ప్రమోట్ చేసుకుంటున్నారు. అయితే, ఇలాంటి వీడియోలు చూడటానికి సరాదాగా ఉంటాయి. కానీ, కొన్ని సందర్భాల్లో సరదాగా చేసిన వీడియోలో ప్రాణాల మీదకు తెచ్చి పెడతుంటాయి. ఇప్పటికే ఈ రీల్స్ మోజులో పడి చిన్న పెద్ద తేడా లేకుండా చాలామంది ప్రాణలు పొగొట్టుకున్న ఘటనలు తరుచు చూస్తూ, వింటున్నాం. అయితే తాజాగా ఈ రీల్స్ పేరిట సరదాగా ప్రాంక్ వీడియో చేద్దామని ప్రయత్నించిగా.. అది కాస్త ఓ మహిళ ప్రాణం పోయేందుకు కారణమైంది. ఇంతకి ఏం జరిగిందంటే

తాజాగా రీల్స్ పేరిట సరదాగా ఓ ప్రాంక్ వీడియో చేద్దామని ప్రయత్నిస్తుండగా.. అది కాస్త ఓ మహిళ ప్రాణం పోయేందుకు కారణమైంది. అయితే  ఆ మహిళ పనిచేస్తున్న కార్యలయంలోనే మూడవ అంతస్తు నుంచి పడి చనిపోయిన దృశ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇక  ఈ విషాదకరమైన ఘటన ముంబైలో చోటు చేసుకుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే.. ముంబైకి 30 కిలోమీటర్ల దూరంలోని డోంబివాలిలోని గ్లోబ్ స్టేట్ భవనంలో ఓ మహిళ మూడవ అంతస్తు నుంచి పడి మృతి చెందింది. అయితే ఆమె పనిచేస్తున్న దగ్గర తోటి కొలీగ్స్ ఆమెపై ప్రాంక్ వీడియో తీద్దామని ప్రయత్నిస్తుండగా.. ప్రమాదవశాత్తు ఆ మహిళ మూడవ అంతస్తు నుంచి పడి మృతి చెందింది. వెంటనే స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలి నాగినా దేవి మంజీరామ్ గా గుర్తించారు.

ఇక ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగింద లేదో అనే విషయాలను తెలుసుకునేందుకు పోలీసులు బిల్డింగ్ లోని సీసీటీవీ పుటేజిని పరిశీలించారు. కాగా, అందులో రికార్డయిన వీడియో ఆధారంగా.. ప్రాంక్ చేస్తుండగా జరిగిన ప్రమాదమని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అనంతరం కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ప్రాథమిక విచారణ ప్రకారం.. భవనంలోని మూడవ అంతస్తులో మృతురాలు తన స్నేహితులతో కలిసి ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఆ బిల్లింగ్ లో దేవితో పాటు మరొకరు సైతం కిందపడబోతుండగా.. పక్కనే ఉన్నవారు పట్టుకుని పైకి లాగడంతో ప్రమాదం నుంచి బయటపడినట్లు తేలింది. ఇకపోతే మృతురాలు నాగినా దేవి ఆ భవనంలో సెక్యూరిటీగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ మరణ వార్త తెలియడంతో ఆమె కుటుంబం కన్నీరుమున్నీరుగా రోధించారు. మరి, సరదాగా ప్రాంక్ వీడియో చేసే క్రమంలో మహిళ ప్రాణాలు పోయిన ఈ ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments