iDreamPost
android-app
ios-app

భైరవం మూవీని చంపేసిన కథ ఏంటంటే ?

  • Published May 31, 2025 | 5:45 PM Updated Updated May 31, 2025 | 5:45 PM

Bhairavam Movie: ముగ్గురు హీరోలకు సమానమైన స్క్రీన్ ప్రెజన్స్ & స్పేస్ దక్కాయి. అయితే సెంటిమెంట్స్ ను పండించే విషయంలో కాస్త తడబడినా కానీ.. వెట్రిమారన్ కథను తెలుగు నేటివిటీకి మార్చడంలో విజయ్ కనకమేడల దాదాపు సక్సెస్ అయినట్టే. సో ఈ సినిమాకు ఎంత లేదన్న పాజిటివ్ టాక్ వచ్చినట్టే. కానీ ఇంత హైప్ ఉన్నా కూడా శుక్రవారం ఆడియన్స్ కి ఖలేజానే మొదటి ఛాయిస్ అయింది.

Bhairavam Movie: ముగ్గురు హీరోలకు సమానమైన స్క్రీన్ ప్రెజన్స్ & స్పేస్ దక్కాయి. అయితే సెంటిమెంట్స్ ను పండించే విషయంలో కాస్త తడబడినా కానీ.. వెట్రిమారన్ కథను తెలుగు నేటివిటీకి మార్చడంలో విజయ్ కనకమేడల దాదాపు సక్సెస్ అయినట్టే. సో ఈ సినిమాకు ఎంత లేదన్న పాజిటివ్ టాక్ వచ్చినట్టే. కానీ ఇంత హైప్ ఉన్నా కూడా శుక్రవారం ఆడియన్స్ కి ఖలేజానే మొదటి ఛాయిస్ అయింది.

  • Published May 31, 2025 | 5:45 PMUpdated May 31, 2025 | 5:45 PM
భైరవం మూవీని చంపేసిన కథ ఏంటంటే ?

భారీ అంచనాల మధ్యన భైరవం సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయింది. కెరీర్ మొదలు పెట్టి ఆల్ మోస్ట్ 11 ఏళ్ళు అవుతున్నా కూడా.. కమర్షియల్ పరంగా సక్సెస్ అందుకోలేకపోయిన హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నుంచి వచ్చిన కంబ్యాక్ మూవీ ఇది. నిజానికి సినిమా అతనిదే అయినా అధిక శాతం ప్రేక్షకులకు దీని మీద ఆసక్తి కలగడానికి మంచు మనోజ్ , నారా రోహిత్ కూడా కారణం. ముగ్గురు హీరోలు తెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తారు అనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలో కలిగింది.

దాదాపు తొమ్మిది సంవత్సరాల గ్యాప్ తర్వాత ఇప్పుడీ భైరవం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చాడు మనోజ్. భైరవం రీమేక్ అయినా కూడా ఒరిజినల్ వర్షన్ కి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో బెల్లంకొండ శ్రీనివాస్ తన క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం చేసాడని చెప్పొచ్చు. నెగటివ్ టచ్ ఉన్న గజపతి పాత్రలో ,మంచు మనోజ్ ఫ్యాన్స్ కి బాగా నచ్చేశాడు. ఓవరాల్ గా చూసుకుంటే తన క్యారెక్టర్ వరకు బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. ఇక తనదైన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో నారా రోహిత్ అందరికంటే కాస్త ఎక్కువ మార్కులు సంపాదించుకున్నాడు. అతడి భాషలో స్పష్టత, బాడీ లాంగ్వేజ్ లో పెద్దరికం కొట్టొచ్చినట్లు కనబడతాయి. నారా రోహిత్, మంచు మనోజ్ లను తట్టుకొని నిలబడడం అనేది మామూలు విషయం కాదు. ఆ విషయంలో శ్రీనివాస్ ను కచ్చితంగా మెచ్చుకోవాలి.

ఇలా ముగ్గురు హీరోలకు సమానమైన స్క్రీన్ ప్రెజన్స్ & స్పేస్ దక్కాయి. అయితే సెంటిమెంట్స్ ను పండించే విషయంలో కాస్త తడబడినా కానీ.. వెట్రిమారన్ కథను తెలుగు నేటివిటీకి మార్చడంలో విజయ్ కనకమేడల దాదాపు సక్సెస్ అయినట్టే. సో ఈ సినిమాకు ఎంత లేదన్న పాజిటివ్ టాక్ వచ్చినట్టే. కానీ ఇంత హైప్ ఉన్నా కూడా శుక్రవారం ఆడియన్స్ కి ఖలేజానే మొదటి ఛాయిస్ అయింది. వారం ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా కానీ, ఎక్కువ స్క్రీన్స్ కేటాయించడంలో కానీ ఖలేజా క్లియర్ డామినేషన్ చూపించింది.

ఖలేజ సినిమా మొదటి రోజున వరల్డ్ వైడ్ గా 7.5-8 కోట్ల రేంజ్ కి తగ్గని వసూళ్ళని అందుకుంది . దీనితో భైరవం పై ఖలేజ వేటు పడింది. భైరవం మూవీ వరల్డ్ వైడ్ గా అటూ ఇటూగా 2.4-2.6 కోట్ల రేంజ్ లో వసూళ్ళని అందుకుంది. దింతో ఇప్పుడు ఇప్పుడు భైరవం సినిమా కచ్చితంగా మౌత్ టాక్ పరంగా ఎక్స్ లెంట్ టాక్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. టాక్ ఎక్స్ లెంట్ గా ఉంటేనే కామన్ ఆడియన్స్ థియేటర్స్ కి తరలివచ్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా ఖలేజా ప్రస్తుతానికి డే 1 కలెక్షన్స్ పరంగా కొత్త సినిమా భైరవంని వెనక్కు నెట్టేసింది.

ఇక భైరవం సినిమా ఎంతవరకు ఈ రీ రిలీజ్ మాస్ యుఫోరియాని తట్టుకుని.. ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించే ప్రయత్నం చేస్తుందో చూడాలి. భైరవం మూవీకి రూ.15 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది . ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.15.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. టార్గెట్ అయితే చిన్నది కాదు. ఇక భైరవం ఎలా నెగ్గుకువస్తుందో చూడాలి. ఆడియన్స్ ను మెప్పించడానికి ఒక సినిమాకు ఏమిమి కావాలో అన్నీ ఉన్నా కూడా.. భైరవం రిలీజ్ చేసిన టైమింగ్ మాత్రం బాలేదనే టాక్ నడుస్తుంది. మొత్తానికి భైరవం సినిమాను చంపేసిన కథ ఇది .

Jojobet Girişgrandpashabetcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabettarafbetjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabet