Arjun Suravaram
పోలీసులు సమాజంలో జరిగే అన్యాయాలను, మోసాలను, అసాంఘిక కార్యక్రమాలను జరగకుండా చర్యలు తీసుకుంటారు. అలానే ఎంతో నిజాయితీగా పని చేస్తూ మంచి పేరు సంపాదిస్తారు. కానీ కొందరు మాత్రం అక్రమ మార్గాల్లో డబ్బులు సంపాదించేందుకు ప్రయత్నిస్తుంటారు.
పోలీసులు సమాజంలో జరిగే అన్యాయాలను, మోసాలను, అసాంఘిక కార్యక్రమాలను జరగకుండా చర్యలు తీసుకుంటారు. అలానే ఎంతో నిజాయితీగా పని చేస్తూ మంచి పేరు సంపాదిస్తారు. కానీ కొందరు మాత్రం అక్రమ మార్గాల్లో డబ్బులు సంపాదించేందుకు ప్రయత్నిస్తుంటారు.
Arjun Suravaram
సాధారణంగా ఎక్కడైన ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు అధికారులు అంటే..ప్రజలకు వివిధ రకాల సేవలు అందిస్తుంటారు. ముఖ్యంగా సమాజంలో జరిగే అన్యాయాలను, మోసాలను, అసాంఘిక కార్యక్రమాలను జరగకుండా చర్యలు తీసుకుంటారు. అలానే ఎంతో నిజాయితీగా పని చేస్తూ మంచి పేరు సంపాదిస్తారు. కానీ కొందరు మాత్రం అక్రమ మార్గాల్లో డబ్బులు సంపాదించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరు ప్రభుత్వ అధికారులు అయితే నీచమైన పనుల చేయడానికి కూడా సిద్ధ పడుతుంటారు. తాజాగా అలాంటి ఘటన అరుణాచల్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. వ్యభిచారానికి సంబంధించిన ఈ ఘటనలో డీఎస్పీతో సహా ఏకంగా 8 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్ట్ అయ్యారు. పోలీసుల కథనం ప్రకారం..
అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌లో బ్యూటీ పార్లర్‌ను అనియా, జమ్లో తగౌంగ్ అనే ఇద్దరు మహిళలు నిర్వహిస్తోన్నారు. ఈ పార్లర్ కి అసోంలోని ధేమాజీ, ఉదల్‌గురి ప్రాంతాల నుంచి మైనర్ బాలికలను తీసుకొచ్చారు. మే 4న చింపుల ప్రాంతంలో మైనర్ బాలికలతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు సమాచారం రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వ్యభిచారం నిర్వహిస్తున్న్ గృహాలపై దాడులు చేసి.. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అలానే వారి చెరనుంచి ముగ్గురు మైనర్ బాలికను రక్షించారు. ఉద్యోగాలని ఇప్పిస్తామని నమ్మించి…ఇక్కడి వచ్చిన తరువాత బలవంతంగా వ్యభిచారం దింపారని బాధితులు వాపోయారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే మరో ఇద్దరు మైనర్లు కూడా బ్యూటీపార్లర్ నడుపుతోన్న మహిళల వద్ద ఉన్నట్లు విచారణలో తేలింది. ప్రస్తుతం వీరందరినీ రక్షించి వసతి గృహానికి తరలించారు. ఇక ఘటన గురించి లోతుగా విచారణ చేయగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి.
ఈ రాకెట్‌లో స్వయంగా ఓ పోలీస్ ఉన్నతాధికారి, మరి కొందరు ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఉండటాని పోలీసులు గుర్తించారు. దీంతో డీఎస్పీ, 8 మంది ప్రభుత్వ అధికారులతో సహా 21 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టైనవారిలో డీఎస్పీ బులంద్ మారిక్, ఆరోగ్య విభాగం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సెన్లాయ్ రొనియా తదితరులు ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. పది రోజుల పాటు వరుసగా దాడులు నిర్వహించి, నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనలో 11 మంది విటులను అరెస్టు చేశారు. బాధితులను 2020 నుంచి 2023 మధ్య ఉద్యోగం పేరుతో మైనర్ బాలికలను ఈటానగర్ తీసుకోచ్చి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. వీరిలో ఒక బాలికను 8 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తీసుకురాగా.. తప్పించుకుని మళ్లీ రెండేళ్ల తరువాత వారికి చిక్తిందని ఎస్పీ తెలిపారు. బాధితుల వైద్య పరీక్షలు నిర్వహించగా..దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
బాధితుల్లోనే ముగ్గురు మైనర్లలో లై0గిక చర్యల ద్వారా సంక్రమించే వైరస్ ఎక్కువగా ఉందని వెల్లడయ్యింది. ఇక ఈ ఘటనలో నిందితుల్లో కానిస్టేబుల్ తోయ్ బగ్రా, పబ్లిక్, గ్రామీణాభివృద్ధి విశాగం ఏఈ, జేఈలు ఉన్నారు. ప్రస్తుతం ఈ వార్త దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు చెబుతున్నారు.