iDreamPost
android-app
ios-app

పెళ్లై ,విడాకులైన యువతితో ప్రేమ.. ఆ కారణతో దారుణం

  • Published Apr 27, 2024 | 1:00 PM Updated Updated Apr 28, 2024 | 11:41 AM

ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసిన అక్రమ సంబంధాలు అనేవి క్రమేపి పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే శారీరక సుఖాలకు ఆలవాటు పడి కట్టుకున్న వారిని కడతేర్చడం, నమ్మిన వారి చేతిలో హత్యకు గురవ్వడం వంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.తాజాగా ఈ అక్రమ సంబంధాల మోజులో పడి ఓ మహిళ దారుణంగా హత్యకు గురయ్యింది. అసలు ఏం జరిగిందంటే..

ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసిన అక్రమ సంబంధాలు అనేవి క్రమేపి పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే శారీరక సుఖాలకు ఆలవాటు పడి కట్టుకున్న వారిని కడతేర్చడం, నమ్మిన వారి చేతిలో హత్యకు గురవ్వడం వంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.తాజాగా ఈ అక్రమ సంబంధాల మోజులో పడి ఓ మహిళ దారుణంగా హత్యకు గురయ్యింది. అసలు ఏం జరిగిందంటే..

  • Published Apr 27, 2024 | 1:00 PMUpdated Apr 28, 2024 | 11:41 AM
పెళ్లై ,విడాకులైన యువతితో ప్రేమ.. ఆ కారణతో దారుణం

ప్రతిఒక్కరికి వివాహం అనేది ఒక సంబంధం కాదు, ఒక తియ్యని భావోద్వేగం. కానీ, ప్రస్తుతం కాలంలో ఇద్దరి మధ్య ఉండవలసిన ఆ భావోద్వేగాలు అనేవి నలుగురితో పంచుకుంటున్నారు. ఈమధ్య కాలంలో కొంతమందిని ప్రేమించి, పెళ్లి చేసుకొని.. ఆ తర్వాత ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసిన ఎక్కువగా ఇలాంటి నకిలీ బంధాలే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే శారీరక సుఖాలకు ఆలవాటు పడి కట్టుకున్న వారిని కడతేర్చడం, నమ్మిన వారి చేతిలో హత్యకు గురవ్వడం వంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి.తాజాగా ఈ అక్రమ సంబంధాల మోజులో పడి ఓ మహిళ దారుణంగా హత్యకు గురయ్యింది. అసలు ఏం జరిగిందంటే..

తాజాగా ప్రియుడి కోసం ఓ మహిళ చెన్నై నుంచి గుడియాత్తం వచ్చింది. కాగా, అక్కడ ఆ మహిళ దారుణంగా హత్యకు గురైంది. ఆ వివరాళ్లోకి వెళ్తే.. చెన్నై పులియంతోపు సమీపంలోని కస్తూరి బాయ్‌కాలనీకి చెందిన వేలుస్వామికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అందులో రెండో కుమార్తె అయిన దీప (33)కు 2014లో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. అయితే పెళ్లైన రెండేళ్లకే దీప తన భర్తతో విడాకులు తీసుకుంది. అనంతరం తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. ఈ క్రమంలోనే 2022వ సంవత్సరంలో దీప చెన్నైలోని ఓ సెల్ ఫోన్ దుకాణంలో పనిలో చేరింది. కాగా, ఆ సమయంలో వేలూరు జిల్లా  గుడియాత్తం సమీపంలోని ఆలత్తూరు గ్రామానికి చెందిన హేమంత్‌రాజ్‌(26)తో పరిచయం ఏర్పడింది. ఇక ఆ పరిచయంలోనే  ఇద్దరు తరుచు ఫోన్లో మాట్లాడుకొనే వారు. ఈ క్రమంలోనే వారిద్దరూ ప్రేమించుకున్నారు. దీంతో దీప తనను వివాహం చేసుకోవాలని హేమంత్‌రాజ్‌ను తరచూ కోరుతుండేది.

అయితే దీప తనకంటే.. ఎనిమిది సంవత్సరాలు పెద్దది కావడంతో అతడు వివాహానికి నిరాకరించాడు. అయినప్పటికీ ఇద్దరూ ప్రేమించుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 14వ తేదీన దీపను గుడియాత్తం రావాలని హేమంత్‌రాజ్‌ కోరాడు. ఇక ప్రియుడి మాటాలు నమ్మిన దీప చెన్నై నుంచి రైలులో గుడియాత్తం పట్టణానికి చేరుకుంది. ఇక రైల్వే స్టేషన్ లో వేచి ఉన్న హేమంత్‌రాజ్‌ బైకులో గుడియాత్తం సమీపంలోని ఒక కొండ ప్రాంతానికి దీపను తీసుకెళ్లాడు. కాగా, అక్కడ దీపకు మాయ మాటలు చెప్పి, ఇద్దరూ సరదగా గడిపారు. ఇక ఆ సమయంలో దీప తనను వివాహం చేసుకోవాలని మరోసారి హేమంత్ రాజ్ ను కోరింది. దీంతో ఇద్దరి మధ్య పెద్ద వాగ్వాదమే జరిగింది. ఈ క్రమంలోనే ఆగ్రహానికి గురైన హేమంత్ రాజ్ తన వద్ద దాచుకున్న కత్తితో దీప గొంతు కోసి, కొండపై నుంచి మృతదేహాన్ని కింద తోసివేసి కత్తిని కూడా అక్కడే వదిలి, ఏమీ తెలియనట్టూ ఇంటికి తిరిగి వచ్చాడు.

ఇక కుమార్తె కనిపించడంలేదని దీప తల్లిదండ్రులు చెన్నై పులియంతోపు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, పోలీసులు దీప సెల్ ఫోన్ నంబర్ ను పరిశీలించి అనంతరం విచారణ చేపట్టారు.  ఈ క్రమంలోనే పోలీసులు హేమంత్ రాజ్ ను చెన్నైకి తీసుకెళ్లి విచారణ జరపగా.. దీపను కొండకు తీసుకెళ్లి హత్య చేసినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు కొండ ప్రాంతానికి వెళ్లి కుళ్లిపోయిన దీప మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించారు విచారణ జరుపుతున్నారు.