iDreamPost
android-app
ios-app

IPS కుమార్తెకు ఎంత కష్టం.. లాయర్ అవ్వలనుకుంది కానీ, అంతలోనే

  • Published Sep 02, 2024 | 10:17 AM Updated Updated Sep 02, 2024 | 10:17 AM

చిన్నప్పటి నుంచి లాయర్ అవ్వలని కోటి ఆశలతో ఎల్‌ఎల్‌బీ చేరిన ఓ ఐపీఎసప్ కుమార్తెకు తీరని కష్టం వాటిల్లింది. ఎంత కష్టమైనా సరే మంచి ఉన్నత స్థాయిలోకి నిలిచి తన తండ్రి ఆశయాలను నిలబెట్టేలని అనుకునే ఆమె ఆశయం పై విధి చిన్న చూపు చూసింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

చిన్నప్పటి నుంచి లాయర్ అవ్వలని కోటి ఆశలతో ఎల్‌ఎల్‌బీ చేరిన ఓ ఐపీఎసప్ కుమార్తెకు తీరని కష్టం వాటిల్లింది. ఎంత కష్టమైనా సరే మంచి ఉన్నత స్థాయిలోకి నిలిచి తన తండ్రి ఆశయాలను నిలబెట్టేలని అనుకునే ఆమె ఆశయం పై విధి చిన్న చూపు చూసింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

  • Published Sep 02, 2024 | 10:17 AMUpdated Sep 02, 2024 | 10:17 AM
IPS  కుమార్తెకు ఎంత కష్టం.. లాయర్ అవ్వలనుకుంది కానీ, అంతలోనే

ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు ఎక్కువగా హడలెత్తిస్తున్నాయి. అప్పటి వరకు ఎంతో అనందంగా అందరీతో గడిపిన వారు మరో క్షణానికి ఉన్నటుండి కుప్పకూలి తుది శ్వాస విడుస్తునానరు. అయితే ఈ మధ్య కాలంలో ఈ గుండెపోటు మరణాలు అనేవి మరింత ఎక్కువగా పెరిగిపోయాయి. చాలామంది వ్యాయామం చేస్తూ, డ్యాన్సులు చేస్తూ ఉండగానో ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు. అయితే ఇలా గుండెపోటుతో కన్ను మూస్తున్నవారిలో ఎక్కువ శాతం విద్యార్థులు ఉండటం గమన్హారం. చదువులో ఉత్తిడి వలన ఏమో తెలియదు కానీ, ఎంతో బంగారు భవిష్యత్తు కలిగిన విద్యార్థులను ఈ హార్ట్ ఎటాక్ బలి తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఐపీఎస్ ఇంట కూడా ఈ హార్ట్ ఎటాక్ రూపంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

లాయర్ గా బంగార్ భవిష్యత్తు ఉన్న ఓ ఐపీఎస్  కుమార్తె ను  గుండెపోటుతో విధి చిన్న చూపు చూసింది. అయితే ఈ విషాద ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని చోటు చేసుకుంది. మహారాష్ట్ర కేడర్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ రస్తోగి ప్రస్తుతం దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏలో ఐజీగా పనిచేస్తున్నారు. అయితే ఆయన కుమార్తె అనికా యూపిలోని రామ్ మనోహర్ లోహియాలా కాలేజీలో బీఏ ఎల్‌ఎల్‌బీ చదువుతోంది. చిన్నప్పటి నుంచి లాయర్ అవ్వలని కోటి ఆశలతో ఎల్‌ఎల్‌బీ చేరిన అనికా.. తన కన్న కలలను మృత్యు వు కాలరాసింది. అప్పటి వరకు హాస్టల్ లో స్నేహితులతో సరదాగా గడిపిన అనికా ఉన్నట్టుండి.. తన గదిలో అచేతన స్థితిలో కుప్పకూలింది.

ఇక ఈ విషయాన్ని గమనించిన అనికా స్నేహితులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే అనికా గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్దరాంచారు. ఇక ఈ విషయం తెలుసుున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హాస్టల్‌ రూమ్‌లో ఎటువంటి అనుమానాస్పద పరిస్థితులు కనిపించలేదన్నారు. అలాగే బాధిత కుటుంబీకులు కూడా ఫిర్యాదు చేయలేదని.. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. మరీ, లాయర్ కావాలనే తన కల, కలగానే మిగిలిపోయి గుండెపోటుతో చిన్న వయసులోనే తిరిగిరాని లోకనికి వెళ్లిపోయిన ఈ ఘటన అందర్నీ కలిచివేసింది.