iDreamPost
android-app
ios-app

ఒకరిని పెళ్లాడింది.. ఇద్దరిని ముగ్గులోకి దింపింది.. చివరికి!

  • Published Feb 09, 2024 | 5:10 PM Updated Updated Feb 09, 2024 | 5:10 PM

Bengaluru Crime News: ఈ మధ్య ప్రేమ పేరుతో యువతీ యువకులు ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు. అసలు విషయం బయటపడి దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Bengaluru Crime News: ఈ మధ్య ప్రేమ పేరుతో యువతీ యువకులు ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు. అసలు విషయం బయటపడి దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు.

ఒకరిని పెళ్లాడింది.. ఇద్దరిని ముగ్గులోకి దింపింది.. చివరికి!

ఇటీవల ప్రతి చిన్న విషయానికి చాలా మంది డిప్రేషన్ లోకి వెళ్లిపోతున్నారు. మనోధైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రేమ వ్యవహారాలు, అక్రమ సంబంధాలు, ఆర్థిక ఇబ్బందులు, పని ఒత్తిడి, అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో కారణాల వల్ల మనస్థాపానికి గురై బలవన్మరణాలకు పాల్పపడుతున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు ధైర్యం చెప్పినా ఫలితం లేకుండా పోయి.. కన్నవారికి తీరని దుఖాఃన్ని మిగుల్చుతున్నారు. ఓ యువతి చేసిన మోసాన్ని తట్టుకోలేక.. ఆ విషయం ఎవరికీ చెప్పుకోలేక యువకుడు దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు.. ఈ ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఇటీవల ప్రేమ పేరుతో జరుగుతున్న మోసాలకు ఎంతోమంది యువతీ యువకులు బలవుతున్నారు. మనస్థాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. బెంగుళూరు అనేకల్ కి చెందిన ఓ యువతి ఇద్దరితో నడిపిన ప్రేమాయణం.. ఒక యువకుడి ప్రాణాలు తీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దివ్య అనే యువతికి పెళ్లైన కొంతకాలానికే విడాకులు తీసుకుంది. తర్వాత అన్బరసన్ అనే యువకుడితో ప్రేమలో పడింది. భార్యాభర్తలమని చెప్పుకుని అద్దె గదిని తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సమయంలోనే సంతోష్ అనే యువకుడి లవ్ లో పడింది దివ్య. అతనితో రోమాన్స్ చేస్తున్న విషయం అన్బరసన్ తెలియడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.

ఈ మధ్యనే సంతోష్, దివ్య అద్దె ఇంట్లో రొమాన్స్ చేస్తున్న సమయంలో అన్బరసన్ కి అడ్డంగా బుక్కయ్యారు. ఈ విషయంపై దివ్యను నిలదీయడంతో తన ఇష్టం వచ్చినట్లు చేసుకుంటా అని చెప్పింది. ఈ విషయం అన్బరసన్.. దివ్య తల్లిదండ్రులకు చెప్పడంతో వారు సైతం ఆమెను ఇది పద్దతి కాదు అని నిలదీశారు. కానీ దివ్య మాత్రం తనకు నచ్చినట్లు ఉంటాను.. ఎవరూ తన సంతోషానికి అడ్డు రావొద్దని తేల్చి చెప్పింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన అన్బరసన్ ఆత్మహత్య చేసుకున్నాడని అతని తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించి తల్లిదండ్రులు గతంలో యూడీఆర్ కేసు పెట్టారు. తర్వాత స్నేహితుడితో అన్బరసన్, విద్య మాట్లాడిన కాల్ రికార్డ్ లభ్యమైంది. దాని ఆధారంగా తల్లిదండ్రులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కేసు నమోదు చేశారు. దీని ప్రకారం సంతోష్, విద్యపై పరప్ప అగ్రహార పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.