చూడ్డానికి సింగం మూవీలో సూర్యలా ఉన్నాడు.. కానీ పిల్లలతో ఇదేం పని

Rowdy Police: చూడ్డానికి సింగం సినిమాలో సూర్యలా సూపర్ పోలీస్ లా కనబడుతున్నాడు. కానీ స్టేషన్ లో మాత్రం పక్కా విలన్ లా ఉంటాడు. పిల్లలతో చేసే పనులు తెలిస్తే ఛీ అంటారు. వెంటనే ఈ పోలీస్ పై చర్యలు తీసుకోవాలని అంటారు.

Rowdy Police: చూడ్డానికి సింగం సినిమాలో సూర్యలా సూపర్ పోలీస్ లా కనబడుతున్నాడు. కానీ స్టేషన్ లో మాత్రం పక్కా విలన్ లా ఉంటాడు. పిల్లలతో చేసే పనులు తెలిస్తే ఛీ అంటారు. వెంటనే ఈ పోలీస్ పై చర్యలు తీసుకోవాలని అంటారు.

పోలీస్ అంటే ఒక గౌరవం ఉంటుంది. ఎందుకంటే పౌరులకు రక్షణ కల్పించడం కోసం రాత్రి పగలు తేడా లేకుండా పని చేస్తుంటారు. నిజాయితీగా ఉండే పోలీసులంటే ప్రజలకు ఎప్పుడూ ఆ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. వాళ్ళు ఎదురుపడితే చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. జీతాలు ఇచ్చేది ప్రజలే అయినా.. పోలీసులు ప్రజా సేవకులుగా ఉన్నా గానీ వాళ్ళ నిజాయితీ వారి మీద గౌరవం పెరిగేలా చేస్తుంది. తీసుకునే జీతానికి సరిగా పని చేయకపోతే ముద్ద దిగదయ్యా అని అనే పోలీసులు ఉంటారు. తీసుకునే జీతానికి న్యాయం చేయాలని అహర్నిశలూ పనిచ్ చేస్తుంటారు. నన్ను నువ్వే రక్షించాలని దేవుడా అంటే.. ఆ దేవుడు కూడా పంపించేది పోలీసోడ్నేలే అనే విధంగా కొందరు ఖాకీలు పని చేస్తున్నారు.

అయితే కొంతమంది పోలీసులు ఉంటారు. మొత్తం పోలీస్ యంత్రాంగానికే మచ్చ తెచ్చేలా ప్రవర్తిస్తారు. అవినీతికి పాల్పడడం, అక్రమాలకు పాల్పడడం, లంచాలు తీసుకోవడం, దౌర్జన్యాలు చేయడం వంటివి చేస్తారు. తాజాగా ఓ పోలీసాయన పోలీస్ స్టేషన్ ని మసాజ్ సెంటర్ గా మార్చేశాడు. సినిమాల్లో రౌడీ పోలీసులు పోలీస్ స్టేషన్ ని పేకాట క్లబ్ గా ఎలా అయితే మారుస్తారో అలా ఈ పోలీస్.. స్టేషన్ ని ఏకంగా మసాజ్ సెంటర్ గా మార్చేశాడు. చిన్న పిల్లలతో మసాజ్ చేయించుకుంటున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది. మీర్జాపూర్ జిల్లాలో భాను ప్రతాప్ సింగ్ అనే హెడ్ కానిస్టేబుల్ ముగ్గురు పిల్లలను తన దగ్గర పనిలో పెట్టుకున్నాడు. వారితో రోజూ మసాజ్ చేయించుకుంటున్నాడు.

ఒక పిల్లాడు తలకి మసాజ్ చేస్తుంటే.. ఇంకో ఇద్దరు పిల్లలు చెరో పక్కన నిలబడి చేతులు నొక్కుతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో నెటిజన్స్ మండిపడుతున్నారు. మైనర్ పిల్లలతో మసాజ్ చేయించుకోవడం ఏంటని తిట్టిపోస్తున్నారు. పిల్లలకు అండగా ఉండాల్సిందిపోయి వారితో ఇలాంటి పనులు చేయించుకుంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి హెడ్ కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని ఏరియా అధికారికి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాగా హెడ్ కానిస్టేబుల్ విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

Show comments