సరదా కోసం స్కూటర్లను దొంగలిస్తున్న కోటీశ్వరుడు! పోలీసులే షాక్!

Millionaire Thief: జూదం, మద్యం, సినిమాలు చూడటం, ధూమపానం చేయడం వంటి అనేక వ్యవసనాలు కలిగి ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వ్యసనం ఉంటుంది. తాజాగా ఓ కోటీశ్వరుడు చేసిన పని గురించి మీకు చెబితే ఆశ్చర్యపడక మానరు.

Millionaire Thief: జూదం, మద్యం, సినిమాలు చూడటం, ధూమపానం చేయడం వంటి అనేక వ్యవసనాలు కలిగి ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వ్యసనం ఉంటుంది. తాజాగా ఓ కోటీశ్వరుడు చేసిన పని గురించి మీకు చెబితే ఆశ్చర్యపడక మానరు.

సమాజంలో మనిషికి ఎన్నో రకాల ఆలోచనలు ఉంటాయి. అలానే కొందరికి వివిధ రకాల వ్యవసనాలు ఉంటాయి. జూదం, మద్యం, సినిమాలు చూడటం, ధూమపానం చేయడం వంటి అనేక వ్యవసనాలు కలిగి ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వ్యసనం ఉంటుంది. ఇక ఇలా కేవలం మాములు వ్యక్తులే కాదు.. ధనవంతులు కూడా కొన్ని రకాల వ్యవసనాలకు బానిసలు అవుతుంటారు. తాజాగా ఓ కోటీశ్వరుడు చేసిన పని గురించి మీకు చెబితే ఆశ్చర్యపడక మానరు. కోట్లాది రూపాయలు ఉన్నా కూడా స్కూటర్ల చోరీ చేస్తున్నాడు. ఇటీవల పోలీసు పట్టుకుని విచారించగా  అతడు చెప్పిన సమాధానం అందరిని షాకి గురి చేసింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో 168 యక్టీవాలను హితేష్ జైన్ అనే కోటీశ్వరుడు దొంగిలించాడు. అయితే చాలా కాలం పాటు పోలీసులకు దొరక్కుండా తిరిగిన అతడు ఇటీవలే పట్టుబడ్డాడు. నిజానికి  హితేష్ జైన్ కు డబ్బులకు లోటు లేదు.  అతడికి కావాల్సిన వస్తువులు, తిండి తన వద్దకే వస్తుంది.  జైన్ కు లగ్జరీ కార్లలో జర్నీ చేయడం అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే ఆ కోరికను తీర్చుకునేందుకు సొంత డబ్బులు కాకుండా దొంగతనాన్ని వృతిగా ఎంచుకున్నాడు. తన కోరికను తీర్చుకునేందుకు హితేష్ జైన్ యాక్టివాలను దొంగిలించడం ప్రారంభించాడు.

రోజూఒక యాక్టివాను చోరీ చేసే వాడు. అయితే అలా తాను చోరీ చేసిన స్కూటర్లను జైన్ ఎవరికీ విక్రయించలేదు. అలా దొంగతనం చేసిన బైకులతో వివిధ ప్రాంతాల్లో  తిరిగేవాడు.  ఆ తరువాత వాటిల్లో పెట్రోల్ అయిపోయాక దానిని పట్టించుకోకుండా వదిలేసేవాడు. ఇదే తరహాలో అహ్మదాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 150కి పైగా యాక్టీవా స్కూటర్లను చోరీ చేశాడు. ఇక నగరంలో యాక్టివా చోరీల సంఖ్య బాగా పెరుగుతుంది. ఈ సమాచారంతో పోలీసులు చోరీలపై సీరియస్ గా ఉన్నారు. క్రైమ్ బ్రాంచ్  అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు.

నిందితుడి కోసం వివిధ ప్రాంతాల్లో  తీవ్రంగా గాలించారు. ఈ నేపథ్యంలోనే నిందుతుడు యాక్టీవాపై ప్రయాణిస్తూ పిరానా అనే ప్రాంతంలో పోలీసులకు పట్టుబడ్డాడు. గత మూడు నెలల్లో దాదాపు 70కి పైగా స్కూటర్లను దొంగిలించాడని పోలీసులు గుర్తించారు. అంతేకాక వాటిలో కొన్ని పిరానా సమీపంలోని  ఓపెన్ గ్రౌండ్ లో ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తెలింది. నిందితుడి నుంచి 20 చోరీ వస్తువులను క్రైం బ్రాంచ్ స్వాధీనం చేసుకుంది. నిందితుడు హితేష్ జైన్ కొన్నేళ్ల నుంచి సాధారణ జీవితం గడుపుతున్నాడు. స్థానికంగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి అహ్మదాబాద్ నగరంలోని షాహీబాగ్‌ ప్రాంతంలో కోట్ల విలువైన రెండు ఫ్లాట్లు కూడా ఉన్నాయి. అంతేకాక అతనికి సొంత కార్లు కూడా ఉన్నాయి.

2016లో హితేష్ జైన్ దంపతుల మధ్య వచ్చిన విభేదాలు అతడి జీవితాన్నే మార్చేశాయి. ఈ నేపథ్యోంలనే కోటీశ్వరుడైన  హితేష్ నేరాలు చేయడం వైపు మొగ్గు చూపాడు. నిందితుడు హితేష్  తొలిరోజుల్లో డబ్బులను చోరీ చేసేవాడు. ఇక దొంగతనం అతనికి వ్యసనంగా మారడంతో.. 2015 నుండి యాక్టివా స్కూటర్లను దొంగిలించడం ప్రారంభించాడు. ఇప్పటివరకు అనేక ఆస్తులను దోచుకుంది. గతంలో జైన్ సూరత్, పోర్‌బందర్, రాజ్‌కోట్‌లలో మూడుసార్లు జైలు శిక్ష అనుభవించాడు. జైన్ మాదిరిగా.. కుటుంబ పరిస్థితుల కారణంగా చెడు మార్గానికి వెళ్లిన వారు అనేక మంది ఉన్నారు. ఇలాంటి ఘటనల నివారణకు చర్యలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments