iDreamPost
android-app
ios-app

వామ్మో..నెల రోజుల్లో ఒకే వ్యక్తిని 5 సార్లు కాటేసిన పాము.. వెంబడించి మరీ..!

  • Published Jul 07, 2024 | 12:21 PM Updated Updated Jul 07, 2024 | 12:21 PM

ఇప్పటి వరకు పాములు పగబట్టడం అనేది సినిమాల్లో చూడటం, వినడం తప్పా రియల్‌ గా ఎక్కడ జరిగింది లేదు. కానీ, తాజాగా ఓ యువకుడుకి నెల వ్యవధిలోనే ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు సార్లు ఓ పాము పగబట్టి మరి కాటేసింది. ఇంతకి ఎక్కడంటే..

ఇప్పటి వరకు పాములు పగబట్టడం అనేది సినిమాల్లో చూడటం, వినడం తప్పా రియల్‌ గా ఎక్కడ జరిగింది లేదు. కానీ, తాజాగా ఓ యువకుడుకి నెల వ్యవధిలోనే ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదు సార్లు ఓ పాము పగబట్టి మరి కాటేసింది. ఇంతకి ఎక్కడంటే..

  • Published Jul 07, 2024 | 12:21 PMUpdated Jul 07, 2024 | 12:21 PM
వామ్మో..నెల రోజుల్లో ఒకే వ్యక్తిని 5 సార్లు కాటేసిన పాము.. వెంబడించి మరీ..!

సాధారణంగా ఇప్పటి వరకు పాములు పగబట్టడం అనేది వినడం తప్పా చూసేది ఎక్కడ లేదు. ముఖ్యంగా ఈ పాముల పగబట్టడం అనేది ఒక సినిమాల్లో చూడటం తప్పా నిజ జివీతంలో జరిగిన దాఖాలు కూడా లేవు. కానీ, ఈ పాములు పగబడితే ఏళ్లు అయినా వదిలిపెట్టవని చాలామంది అంటారు. కానీ, సైన్స్‌ మాత్రం పాములు పగబట్టవు అంటోంది.అయితే కొన్ని సార్లు ఆ సైన్స్‌కు కూడా అంతుచిక్కని సంఘటనలు చోటుచేసుకుంటూ ఉన్నాయి. పాములు మనుషుల్ని పగబట్టినట్లుగా వారిపై దాడులకు తెగబడ్డాయి. ఒకే వ్యక్తిని ఒకే పాము పలు సార్లు కాటు వేసిన సంఘటనలు కూడా ఈ మధ్య చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఉత్తరప్రదేశ్‌ లోని కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తాజాగా  ఓ యువకుడిని నెల రోజుల్లోనే ఐదుసార్లు ఓ పాము కాటు వేసిన వింత ఉదంతం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటన యూపీలోని ఫతేపూర్ జిల్లాలో చోటు చేసుకుంది.  కాగా, ఈ ఘటనలో కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర్ ప్రదేశ్ లోని ఫతేపూర్ జిల్లా మాల్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని సౌరా గ్రామంలో వికాస్ దూబే (24) అనే యువకుడు నివసిస్తున్నాడు. అయితే ఈ యువకుడుకి నెలన్నర వ్యవధిలో ఐదుసార్లు పాము కాటుకు గురైనప్పటికీ, చికిత్స తర్వాత అతను కోలుకున్నాడు. కాగా, ఇప్పటికే అతడు ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎందుకంటే.. గతనెల జూన్ 2వ తేదీ రాత్రి 9 గంటలకు ఆ యువకుడు మంచం దిగుతుండగా తొలిసారి పాము కాటుకు గురయ్యాడు. ఆ తర్వాత కుటుంబసభ్యులు అతడిని ఓ ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌కు తీసుకెళ్లారు.

ఇక అక్కడే రెండు రోజులు చికిత్స తీసుకొని కోలుకుని ఇంటికి వచ్చారు. కాకపోతే నిజానికి ఇది ఒక సాధారణ  ఘటన అని కుటుంబ సభ్యులు భావించారు. అయితే మళ్లీ అదే పాము  జూన్ 10వ తేదీ రాత్రి మళ్లీ ఆ యువకుడుని కాటేసింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈసారి కూడా చికిత్స అనంతరం కోలుకోవడం విశేషం. అయితే పాము చూసి భయపడి జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టాడు.అయితే ఏడు రోజుల తర్వాత (జూన్ 17) ఇంట్లో మరోసారి పాము కాటువేయడంతో పరిస్థితి విషమించింది. దీంతో  కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ఇక నాలుగోసారి కూడా పాము  కాటేసి 7 రోజులు కూడా గడవకముందే.. మరోసారి వికాస్‌ను పాము కాటేసింది.  ఈ క్రమంలోనే భయపడిన కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లగా.. డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయారు.

అయితే ఈసారి కూడా చికిత్స అనంతరం ప్రాణాలతో బయటపడ్డాడు. ఈమేరకు బంధువులు, వైద్యలు వికాస్‌ను కొన్ని రోజులు వేరే చోటికి పంపాలని సూచించారు. సలహాను అనుసరించి, వికాస్ తన అత్త ఇంట్లో (రాధానగర్) నివసించడానికి వెళ్ళాడు. అయితే గత శుక్రవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో మళ్లీ ఇంట్లో పాము కాటు వేసింది. ఆ తర్వాత కుటుంబం అతన్ని అదే ఆసుపత్రిలో చేర‍్పించారు. ప్రస్తుతం అతడు అక్కడ చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. పైగా డాక్టర్లు సైతం  ఆశ్చర్యపోతున్నారు. ఇక  భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయోమోనని కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు. మరి, ఒకేసారి ఓ యువకుడికి 5 సార్లు పాము కాటేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.