Payments to Farmers Accounts: రైతులకు అదిరిపోయే శుభవార్త.. ఖాతాల్లో డబ్బులు.. అధికారులు మీ వద్దకే వచ్చి..

రైతులకు అదిరిపోయే శుభవార్త.. ఖాతాల్లో డబ్బులు.. అధికారులు మీ వద్దకే వచ్చి..

Payments to Farmers Accounts: రైతులకు పీఎం కిసాన్ పథకం కింద నాలుగు నెలల‌కు రెండు వేల చొప్పున సంవత్సరం మొత్తం ఆరు వేల వరకు ప్రతి సంవత్సరం మూడు వాయిదాల్లో అందిస్తుంది కేంద్రం.

Payments to Farmers Accounts: రైతులకు పీఎం కిసాన్ పథకం కింద నాలుగు నెలల‌కు రెండు వేల చొప్పున సంవత్సరం మొత్తం ఆరు వేల వరకు ప్రతి సంవత్సరం మూడు వాయిదాల్లో అందిస్తుంది కేంద్రం.

దేశంలో రైతులకు అదిరిపోయే శుభవార్త. పీఎం కిసాన్ యోజన విషయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన్ కింద పట్టదారు కుటుంబానికి ప్రభుత్వం ఏడాదికి రూ.6000 వేలు ఆదాయం మద్దతుగా అందిస్తుంది. ఇటీవల పీఎం మోదీ కిసాన్ 16 వ విడత నిధులు రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 28న అర్హులైన రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బు జమ అయ్యింది. పీఎం కిసాన్ యోజన పథకం కింద 16వ విడతలో 9 కోట్ల మందికి పైగా రైతులకు రూ.21,000 కోట్లకు పైగా రిలీజ్ చేశారు. 15వ విడత 2023 నవంబర్ 15న రిలీజ్ చేశారు. ఈ క్రమంలోనే కేంద్రం రైతులకు గుడ్ న్యూస్ చెపింది. వివరాల్లోకి వెళితే..

పీఎం కిసాన్ యోజన పథకం కింద రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 16 విడతలుగా రైతుల ఖాతల్లో డబ్బులు జమచేశారు. ఇప్పుడు రైతులంగా 17వ విడత నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే పీఎం కిసాన్ యోజన డబ్బులు ఖాతాలల్లో జమ కావాలంటే రైతులు ఖచ్చితంగా చేయాల్సిన పని ఈ-కేవైసీ. ఇది పూర్తి చేసిన వారికే పీఎం కిసాన్ డబ్బులు అకౌంట్ లో జమ అవుతాయని సమాచారం. ఆన్‌లైన్ విధానంలో మీ ఈ-కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది.. దీనికి మీ బ్యాంక్ ఖాతా ఆధార్ తో లింక్ చేసి ఉండాలి. ఈ రెండు పనులు చేయకపోతే 17వ విడత డబ్బు జమ కాదని అధికారులు అంటున్నారు.

ఇప్పటి వరకు కొంతమంది రైతులు ఈ – కేవైసీ పూర్తి చేయలేకపోయారు.. ఈ క్రమంలోనే ప్రభుత్వం మరో ముందడుగేసింది. రైతులు ఈ – కేవైసీ పూర్తి చేయడం కోసం స్పెషల్ సాచురేషన్ డ్రైవ్ ఏర్పాటు చేసింది. జూన్ 5 నుంచి జూన్ 15 వరక ఈ డ్రైవ్ కొనసాగనుంది. ఇప్పటి వరకు ఈ-కేవైసీ చేయించన వారు వెంటనే చేయించుకోవాలని అధికారులు కోరారు. నేరుగా అధికారల చేత మీ యొక్క ఈ-కేవైసీ ని పూర్తి చేయించుకోవచ్చు. తద్వారా పీఎం కిసాన్ యోజన డబ్బులు మీ ఖాతాలో జమ అవుతాయి. ఈ-కేవైసీ చేసుకోవాలంటే పీఎం కిసాన్ అధికార పోర్టల్ pmkisan.gov.in అక్కడ సమాచారంతో పూర్తి చేయవొచ్చు. లేదా హెల్ప్ లైన్ 155261, 011-24300606 నబర్ కి కాల్ చేస్తే మీకు కావాల్సిన సమాచరం.. సందేహాలు అధికారులు నివృతి చేస్తారు. ఇది దృష్టిలో పెట్టుకొని రైతులు అలర్ట్ అయి త్వరగా ఈ-కేవైసీ పూర్తి చేయాల్సింది కోరారు అధికారులు.  17వ విడత జూన్ రెండో వారంలో పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

Show comments