iDreamPost
android-app
ios-app

810 కిలోల బంగారం తీసుకెళ్తున్న వాహనం బోల్తా.. కట్ చేస్తే

నిత్యం ఏదో ఒక చోట రోడ్డుపై ప్రమాాదాలు జరుగుతుంటాయి. ఆ సమయలో లోడ్ తో ఉన్న లారీలు, కంటైనర్లు బోల్తా పడిన ఘటనలు ఉన్నాయి. పట్ట పగలు అయితే.. అందులో నుండి పడిన సామాన్లు కూడా ఎత్తుకెళ్లిపోతుంటారు. మరీ బంగారం వాహనం పడితే ఊరుకుంటారా..?

నిత్యం ఏదో ఒక చోట రోడ్డుపై ప్రమాాదాలు జరుగుతుంటాయి. ఆ సమయలో లోడ్ తో ఉన్న లారీలు, కంటైనర్లు బోల్తా పడిన ఘటనలు ఉన్నాయి. పట్ట పగలు అయితే.. అందులో నుండి పడిన సామాన్లు కూడా ఎత్తుకెళ్లిపోతుంటారు. మరీ బంగారం వాహనం పడితే ఊరుకుంటారా..?

810 కిలోల బంగారం తీసుకెళ్తున్న వాహనం బోల్తా.. కట్ చేస్తే

జిగేల్ జిగేల్ మంటూ మగువ మనస్సులు దోచేస్తూ ఉంటుంది బంగారం. వజ్రం, ప్లాటినం కన్నా గోల్డ్ విలువ తక్కువ అయినప్పటికీ.. ఎవరినైనా కొలవాలంటే బంగారంతో పోల్చుతుంటారు. అలాగే ప్రెస్టెజ్ ఇష్యూగా మారింది పసిడి. ఎంత ఎక్కువ పుత్తడి ఉంటే.. అంత రిచ్ అన్నమాట. అలాగే అక్కరకు, అవసరాలు పనికి వస్తుండటంతో ఇండియాలో ఈ లోహానికి డిమాండ్ పెరిగింది. ఎకనామిక్ సూత్రం ప్రకారం.. డిమాండ్ ఉంది కాబట్టే రేటు కూడా పెరుగుతూ పోతుంది. అయినప్పటికీ.. ఆడవాళ్ల అందాన్ని రెట్టింపు చేసే బంగారాన్ని ఎవరు కాదనగలరు. శ్రీమతి అంటే ప్రేమ ఉన్న భర్తలు.. భార్య కోరితే కొనకుండా ఉంటారా..? . ఇక బంగారం షాపులోకి వెళితే.. చంద్రముఖి కాకుండా ఉండగలరా మహిళలు. అయితే అరకాసు గోల్డ్ పదిసార్లు చూసుకుంటూ ఉంటారు.

అలాంటిది 810 కిలోల బంగారం రోడ్డు మీద కనబడితే.. ఎలా ఉంటుంది. ఇదిగో ఇదే జరిగింది తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్‌లో. 666 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను తరలిస్తున్న ఓ ప్రైవేట్ కంటైనర్.. ఈ రోడ్ సమీపంలోని చిట్టోడు అనే ప్రాంతం వద్ద సోమవారం అర్థరాత్రి బోల్తా పడింది. ఈ ఆభరణాలను ఆ వాహనంలో కోయంబత్తూర్ నుండి సేలం ప్రాంతానికి తరలిస్తున్నారు. ఓ పైవేట్ లాజిస్టిక్ సంస్థకు చెందిన వాహనంలో 810 కిలోల బంగారు ఆభరణాలను డ్రైవర్ శశికుమార్ తీసుకెళుతున్నాడు. సమతువపురం సమీపంలో మూల మలుపు వద్దకు రాగానే డ్రైవర్ వాహనాన్ని కంట్రోల్ చేయలేకపోవడంతో బండి బోల్తా పడిపోయింది. డ్రైవర్ తో పాటు ఆ వాహనానికి సెక్యూరిటీగా ఉన్న బాల్ రాజ్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, వాహనం నుండి ఇద్దర్ని బయటకు తీశారు. వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, వాహనంలో నిల్వ చేసిన బంగారు ఆభరణాలు భద్రంగా ఉన్నాయని పోలీసులు ప్రకటించారు. ఈ ఆభరణాల యజమానికి సమాచారం అందించారు. జన సంచారం లేకపోవడంతో అక్కడ పెద్ద చర్చ జరగలేదు. అదే బంగారం తరలిస్తున్న వాహనం బోల్తా పడిందని తెలిస్తే.. చూస్తుండగానే బంగారం మొత్తం స్వాహా అయిపోయేది. పోలీసులు కూడా ఏం చేయలేకపోయేవారు. అర్థరాత్రి కావడంతో పోలీసులకు పని సులువు అయ్యింది. వెంటనే మరో వాహనాన్ని రప్పించి, ఆ ఆభరణాలను వాహనంలోకి ఎక్కించి.. పంపించారు.