iDreamPost
android-app
ios-app

దీపావళి వేళ రైతులకు కేంద్రం గుడ్‌ న్యూస్‌.. ఆ డబ్బులు జమ

దీపావళి పండగ వేళ కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ అందించింది. ఈ ప్రకటనతో దేశ వ్యాప్తంగా ఉన్న అర్హత కలిగిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

దీపావళి పండగ వేళ కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ అందించింది. ఈ ప్రకటనతో దేశ వ్యాప్తంగా ఉన్న అర్హత కలిగిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

దీపావళి వేళ రైతులకు కేంద్రం గుడ్‌ న్యూస్‌.. ఆ డబ్బులు జమ

రైతులకు కేంద్ర సర్కార్ మరో గుడ్ న్యూస్ అందించింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా భూములు కలిగిన రైతులకు ప్రయోజనం పొందుతున్న విషయం తెలిసిందే. అయితే, దీపావళి పండగ వేళ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇకపోతే, 15వ ఇన్ స్టాల్ మెంట్ నిధులను అధికారులు ముందుగా ఈ నెల 27న రైతుల ఖాతాలో జమ చేయాలని నిర్ణయించారు. కానీ, అది కాకుండా దీపావళి పండగ వేళ రైతుల ఖాతాలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు జమ చేసేందుకు అధికారులు తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది.

ఈ డబ్బును నేరుగా రైతుల ఖాతాలో జమ చేయనున్నారు అధికారులు. ఈ ప్రకటనతో దేశ వ్యాప్తంగా ఉన్న అర్హత కలిగిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దేశ వ్యాప్తంగా భూములు కలిగి ఉండి అర్హత కలిగిన రైతులకు ప్రతీ ఏటా రూ.6 వేలు నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తుంది. అయితే ఈ రూ.6 వేలను ఏడాదిలో మూడు విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తుండడం విశేషం.