SNP
Vijay Thalapathy, Party Flag, Spain, Tamilaga Vetri Kazhagam: దళపతి విజయ్.. ఇప్పటి వరకు సినిమాలే రీమేక్ చేస్తాడని విన్నాం కానీ.. ఇప్పుడు పొలిటికల్ పార్టీ కోసం జెండాను కూడా రీమేక్ చేస్తారనే విమర్శలు వస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
Vijay Thalapathy, Party Flag, Spain, Tamilaga Vetri Kazhagam: దళపతి విజయ్.. ఇప్పటి వరకు సినిమాలే రీమేక్ చేస్తాడని విన్నాం కానీ.. ఇప్పుడు పొలిటికల్ పార్టీ కోసం జెండాను కూడా రీమేక్ చేస్తారనే విమర్శలు వస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ గురువారం తన పార్టీ జెండాను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. పనయూర్లోని పార్టీ కార్యాలయంలో ఆయన ఈ కార్యక్రమం నిర్వహించారు. కొన్ని నెలల క్రితం ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో విజయ్ రాజకీయ పార్టీని స్థాపించి, తాను పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా విజయ్ కార్యాచరణ మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే తాజాగా పార్టీ జెండా, యాంథమ్‌ను రిలీజ్ చేశారు. అయితే.. ఆయన ఆవిష్కరించిన పార్టీ జెండా.. ఓ దేశపు జాతీయ జెండాను కాపీ చేసినట్లు ఉందనే విమర్శలు వస్తున్నాయి.
ఎరుపు, పసుపు రంగుల కలయితో పాటు మధ్యలో ఒక పువ్వు దాని చుట్టూ నక్షత్రాలు, వాటికి ఇరువైపుల రెండు ఏనుగులతో రూపొందించిన జెండాను విజయ్ ఆవిష్కరించారు. అయితే.. ఈ జెండాలో వాడిన రంగుల విషయంలోనే ఇప్పుడు ట్రోలింగ్ జరుగుతోంది. స్పెయిన్ జాతీయ జెండాలానే.. పైనా కింద ఎరుగు రంగు, మధ్యలో పసుపు రంగు ఉండి.. చూసేందుకు రెండు ఒకేలా ఉండటమే అందుకు కారణం. కాకుంటే స్పెయిన్ జాతీయ జెండాలో మధ్యలో ఉండే పసుపు రంగు ఎక్కువగా ఉండి.. పైనా కిందా ఉండే ఎరుపు రంగు తక్కువ సైజ్‌లో ఉంటుంది. విజయ్ పార్టీ జెండాలో మూడు సమాన సైజ్‌లో ఉంటాయి అంతే తేడా.
ఈ రెండు జెండాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. రీమేక్ అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. విజయ్ దళపతి సినిమాలే కాదు.. పార్టీ జెండాను కూడా ఓ దేశపు జాతీయ జెండా చూసి రీమేక్ చేశారంటూ ట్రోల్ చేస్తున్నారు. కొంతమంది పార్టీ జెండా సైతం.. విజయ్ కాపీ కొట్టారంటూ విమర్శిస్తున్నారు. అయితే.. ప్రపంచంలో చాలా జెండాలు ఒకదానికి ఒకటి పోలీ ఉంటాయని, అంత మాత్రాన కాపీ చేసినట్లు కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ విమర్శలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
thalapathy vijay party flag looking like spain national flag#VijayThalapathy #Spain #TamizhagaVetriKazhagam pic.twitter.com/Z4rH4piNYE
— Sayyad Nag Pasha (@nag_pasha) August 23, 2024