P Krishna
Spanish Woman Case: భారత దేశాన్ని చూడటానికి వచ్చి ఓ విదేశీయురాలి పై పది మంది అత్యాచారానికి పాల్పపడటం దేశ వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఈ అత్యాచార కేసును జార్ఖండ్ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.
Spanish Woman Case: భారత దేశాన్ని చూడటానికి వచ్చి ఓ విదేశీయురాలి పై పది మంది అత్యాచారానికి పాల్పపడటం దేశ వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఈ అత్యాచార కేసును జార్ఖండ్ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.
P Krishna
భారత దేశంలో ఎన్నో అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి.. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. భారతీయ సంప్రదాయాలు, కట్టుబాట్లు అంటే విదేశీయులు ఎంతగానో ఇష్టపడతారు. నిత్యం భారత్ కి ఎంతో మంది విదేశీ పర్యటకులు వస్తుంటారు. ఇటీవల దేశంలో మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు భారీగా పెరిగిపోయాయి. నిత్యం ఎక్కడో అక్కడ కామాంధులు మహిళలపై అత్యాచారాలకు పాల్పపడుతున్నారు. దేశం వ్యాప్తంగా ఇలాంటి కేసులు పదుల సంఖ్యల్లో నమోదు అవుతున్నాయి. కొంతమంది కామాంధులు విదేశీ మహిళలపై అత్యాచారాలకు పాల్పపడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. అలాంటి ఘటన శుక్రవారం జార్ఖండ్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే..
జార్ఖండ్ లోని దుమ్కా సమీపంలో భర్తతో కలిసి బైక్ రైడింగ్ కి వచ్చిన 45 ఏళ్ల స్పెయిన్ మహిళపై లైంగిక దాడి జరగడం దేశ వ్యాప్తంగా పెను సంచలనం రేపింది. స్పానిష్ మహిళపై 10 మంది వ్యక్తులు అతి దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పపడ్డారు. దీనికి సంబంధించి మహిళ భర్త థ్రెడ్ లో వీడియో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై జార్ఖండ్ హైకోర్ట్ సీరియస్ అయ్యింది. కేసును సుమోటోగా స్వీకరించింది. అంతేకాదు ఈ ఘటనపై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి నేరాలు దేశ ప్రతిష్ట, పర్యాటక ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని నొక్కి చెప్పింది. ప్రస్తుతం ఈ కేసును జస్టిస్ నవనీత్ కుమార్ తో కూడిన డివిజన్ బెంచ్ విచారిస్తుంది. ‘విదేశీయులపై ఏ విధమైన నేరాలు జరిగినా అది దేశ ప్రతిష్ట, ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని.. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను కలిగిస్తాయి. విదేశీ మహిళలపై లైంగిక దాడులు అతి పెద్ద నేరం.. దేశాన్ని అప్రతిష్టపాలు చేసేలా ప్రచారం చేసే అవకాశం ఉంది ’ అని బెంజ్ వ్యాఖ్యానించింది.
స్పానిష్ మహిళపై అత్యాచారం కేసు జార్ఖండ్ హై కోర్టు సుమోటాగా స్వీకరించింది. ఈ కేసులో రాష్ట్ర డీజీపీ, దుమ్కా ఎస్పీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 7 కి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ గ్యాంగ్ రేప్ బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం చెక్కును అందజేసింది. ఈ కార్యక్రమంలో స్పానిష్ జర్నలిస్ట్ కూడా ఉన్నారు. స్పెయిన్ నుంచి బైక్ పై భార్యాభర్తలు యాత్ర చేస్తున్నారు. ఇందులో భాగంగా భారత దేశానికి వచ్చారు. జార్ఖండ్ లోని దుక్కాకు చేరుకున్నారు. అక్కడ నుంచి బీహార్ మీదుగా నేపాల్ వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. శుక్రవారం రాత్రి దుమ్కా చేరుకున్న ఈ జంట గ్రామంలో దగ్గరలోని టెంట్ వేసుకొని పడుకున్నారు. ఆ సమయంలో పదిమంది మద్యం సేవించి గుడారంలోకి దూరి భర్తను కట్టేసి మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పపడ్డారు. తర్వాత ఆమె వద్ద ఉన్న వస్తువులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన తర్వాత భార్యాభర్తలు దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును సీరియస్ గా తీసుకొని సోరేన్ ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్- సిట్ ని ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారిని కూడా పట్టుకుంటామని అధికారులు తెలిపారు.