ఉద్యోగులంటే ఎంత ప్రేమో.. దీపావళి సందర్భంగా కార్లు, బైక్స్ పంచిన సంస్థ

దీపావళి పెస్టివల్ వచ్చిందంటే.. కంపెనీ ఉద్యోగులకు ఆయా సంస్థలు స్వీట్స్ పంచడంతో పాటు బహుమతులు అందిస్తుంటాయి. కానీ అవి విలువైనవి, యాజమాన్య ప్రేమకు వెలకట్టలేనివి అయితే.. ఇదే జరిగింది.. ఈ ఉద్యోగుల విషయంలో.

దీపావళి పెస్టివల్ వచ్చిందంటే.. కంపెనీ ఉద్యోగులకు ఆయా సంస్థలు స్వీట్స్ పంచడంతో పాటు బహుమతులు అందిస్తుంటాయి. కానీ అవి విలువైనవి, యాజమాన్య ప్రేమకు వెలకట్టలేనివి అయితే.. ఇదే జరిగింది.. ఈ ఉద్యోగుల విషయంలో.

ఓ కంపెనీని అభివృద్ధి పథంలో నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తుంటారు ఉద్యోగులు. అలాగే ఉద్యోగాల కల్పన చేపట్టి, ఉద్యోగులకు ఆర్థిక భరోసానిచ్చేది కంపెనీ యజమానులు. ఈ ఇద్దరు బిజినెస్ అనే రంగానికి రథ చక్రాల్లాంటి వారు. వీటిలో ఏదీ సవ్యంగా నడవకపోయినా.. కంపెనీ దివాలా తీయాల్సిందే. కానీ కొన్ని సంస్థలు.. ఉద్యోగులతో పని చేయించుకున్నామా, తాము లాభం పొందామా అన్నట్లుగా మారిపోయాయి. ఈ కమర్షియల్ ప్రపంచంలో ఉద్యోగులకు జీతం ఇవ్వడంలో కూడా జాప్యం చేస్తున్నాయి. ఇక హైక్స్, బోనస్ సంగతి మర్చిపోవాల్సిందే. అదేమంటే.. ఉద్యోగం చేస్తే చేయండి.. లేదంటే మానేయండి అని ఖరాఖండిగా చెబుతున్నాయి. అలాగే బయట రెసిషన్ పీరియడ్ నడుస్తుండటంతో కిక్కురుమనకుండా చేస్తున్నారు ఎంప్లాయిస్. కానీ కొన్ని సంస్థలు ఉద్యోగులను శ్రామికులుగా కాకుండా.. కుటుంబ సభ్యుల్లా చూస్తుంటాయి. వారి లాభాల్లో కొంత భాగాన్ని ఏదో ఒక సమయంలో వారి కోసం కేటాయిస్తుంటాయి. వారికి ఏదో ఒక రూపంలో బహుమతులు అందిస్తుంటాయి.

ఇదిగో చెన్నైకి చెందిన కంపెనీ కూడా తమ ఉద్యోగులకు దీపావళికి విలువైన బహుమతులు అందించి.. సర్ ప్రైజ్ చేసింది. దీంతో ఒక్కసారిగా ఎంప్లాయిస్ ముఖాల్లో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని నింపింది. ఇంతకు ఆ కంపెనీ ఏంటంటే..? టీమ్ డిటైలింగ్ సొల్యూషన్స్. 2005లో ఈ సంస్థ ప్రారంభమైంది. ఒడిదుడుకులు ఎదుర్కొన్ని నిలబడింది. దీని వెనుక ఉద్యోగుల కష్టం, శ్రమ ఉందని భావించింది. వారికి ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో దీపావళి పండగను పురస్కరించుకుని ఉద్యోగులకు కార్లు, బైకులు అందించింది. 28 కార్లు, 29 బైక్‌లను బహుమతిగా ఇచ్చింది. ఇందులో మెర్సిడెజ్ జెండ్, మారుతి సుజుకి, హ్యుండాయ్ వంటి లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. దీపావళికి ముందే వారి ఇంట్లో వెలుగులు నింపింది కంపెనీ. ఆ వాహనాలను చూసుకుని ఎంతో మురిసిపోతున్నారు ఉద్యోగులు

ఇందులో కంపెనీ స్వార్థం కూడా ఉంది. ఇలా బహుమతులు ఇవ్వడం వల్ల.. ఉద్యోగులను ఎంకరేజ్ చేస్తున్నట్లు అవుతుందని అంటోంది ఆ సంస్థ యాజమాన్యం. ఎంప్లాయిస్‌లో మనోధైర్యం పెరిగి, స్ఫూర్తిగా తీసుకుని మరింత కష్టపడేందుకు తోడ్పాటునిస్తుందని చెబుతుంది. కంపెనీ ఉద్యోగులు సంస్థ అభివృద్ధికి సహకరించారని, నిబద్ధత, అంకిత భావంతో వర్క్ చేశారని చెబుతున్నారు టీమ్ డిటైలింగ్ సొల్యూషన్స్ ఎండీ శ్రీధర్ కణ్ణన్. గతంలో కూడా ఉద్యోగులకు ద్విచక్ర వాహనాలను అందించినట్లు  పేర్కొన్నారు. అలా వాహనాల సంఖ్య ఏటా పెరుగతూ.. ఈ సంవత్సరం 28 కార్లు, 29 బైకులను అందించినట్లు వెల్లడించారు. ఇక పోతే కేవలం దీపావళికి వాహనాలను ఇవ్వడంతో పాటు మరో కీలక ప్రకటన కూడా చేసింది. గతంలో తమ ఉద్యోగులకు వివాహ సమయంలో 50 వేల రూపాయలను అందిస్తుండగా.. ఇప్పుడు లక్ష రూపాయలకు పెంచింది. కంపెనీలో మంచి వర్కింగ్ ఎట్మాస్పియర్, వర్క్ కల్చర్ పెంపొందించేందుకు ఈ ప్రయత్నాలు చేస్తుంది. చూస్తుంటే.. ఆ కంపెనీలో ఉద్యోగం వస్తే బాగుణ్ణు అనిపిస్తుంది కదూ. ఏమంటారు.. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments