P Venkatesh
సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయులు విచక్షణ కోల్పోయారు. ఆ కారణంతో ఏకంగా క్లాస్ రూంలోనే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. క్షణికావేశంలో పిడిగుద్దులు కురిపించుకున్నారు.
సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయులు విచక్షణ కోల్పోయారు. ఆ కారణంతో ఏకంగా క్లాస్ రూంలోనే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. క్షణికావేశంలో పిడిగుద్దులు కురిపించుకున్నారు.
P Venkatesh
సమాజంలో ఉపాధ్యాయులకు ఎంతో గౌరవ మర్యాదలు ఉంటాయి. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి భావిభారత పౌరులను తీర్చిదిద్దడంలో టీచర్ల పాత్ర మరువలేనిది. విద్యార్థుల భవితకు బాటలు వేసేది ఉపాధ్యాయులే. కానీ నేటి రోజుల్లో కొందరు టీచర్ల ప్రవర్తన సభ్యసమాజం తలదించుకునేలా చేస్తోంది. ఎంతో హుందాగా ఓపికగా మలుచుకోవాల్సిన టీచర్లు క్షణికావేశంతో వారి పట్ల ఉన్న గౌరవాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇదే విధంగా ఓ పాఠశాలలో ఇద్దరు టీచర్లు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఏకంగా క్లాస్ రూంలోనే ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. అసలు ఆ టీచర్లు ఎందుకు కొట్టుకున్నరో తెలిస్తే షాకవ్వకుండా ఉండలేరు.
సాధారణంగా పిల్లలు పాఠశాలకు ఆలస్యంగా వస్తే టీచర్లు పనిష్మెంట్ ఇవ్వడం చూస్తుంటాం. అక్కడ మాత్రం ఉపాధ్యాయులు ఒకరికొకరు శిక్షించుకున్నారు. విద్యార్థులు చూస్తుండగానే వ్యక్తిగతంగా దాడులు చేసుకున్నారు. ఆగ్రాలోని ఓ స్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆగ్రాలోని ఓ ప్రాథమిక పాఠశాలలోకి ఉపాధ్యాయురాలు ఆలస్యంగా వచ్చారు. ఈ సమయంలో ఎందుకు ఆలస్యమైందంటూ ఆ టీచర్ ను ప్రధానోపాధ్యాయురాలు నిలదీశారు. ఈ వ్యవహారం వారిద్దరి మధ్య గొడవకు దారితీసింది. మాటామాటా పెరిగి ఆ ఇద్దరి మధ్య ఫైటింగ్ జరిగింది.
ఆదర్శంగా ఉండాలన్నా సంగతి మరిచి బట్టలు చిరిగేలా వారు కొట్టుకున్న తీరు ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మర్యాదగా నడుచుకోవాలని ఒకరికొకరు బుద్ధులు చెప్పుకుంటూనే ఆ ఇద్దరు టీచర్లు కొట్టుకున్నారు. అక్కడే ఉన్న ఇతర టీచర్లు వచ్చి ఆ గొడవను ఆపేందుకు ఎంతగా ప్రయత్నించినా వారు ఆపలేదు. గొడవ పడ్డ ఆ ఇద్దరు టీచర్లను విడిపించడం అక్కడున్న ఇతర టీచర్లు ఎవరికీ సాధ్యపడలేదు. ఈ దాడిలో ఇద్దరు టీచర్లు స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై స్కూల్ హెచ్ ఎం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
स्कूल में लेट आने पर महिला टीचर और स्कूल प्रिंसिपल में के बीच हुई मारपीट.
वीडियो सोशल मीडिया पर वायरल.
थाना सिकंदरा क्षेत्र के सीगना गांव के पूर्व माध्यमिक स्कूल का मामला. महिला टीचर हुई घायल,प्रधानाध्यापिका ने ही टीचर के खिलाफ दी तहरीर . #Agra @agrapolice pic.twitter.com/egjKgqBnj9— Journalist Harikant sharma (@harikantsharmaG) May 3, 2024