iDreamPost
android-app
ios-app

Maharashtra: స్కూల్లో ప్రార్థన వేళ.. భక్తిపారవశ్యంలో టీచర్, విద్యార్థులు డ్యాన్స్

  • Published Jan 20, 2024 | 2:11 PM Updated Updated Jan 20, 2024 | 2:13 PM

అయోధ్య రామ మందిరం అంగరంగ వైభోగంగా ప్రాణప్రతిష్ఠకు సిద్ధమవుతోంది. ఇప్పటికే అయోధ్యలో మహానగరం భక్తులతో కిక్కిరిసిపోతుంది. దీనితో యావత్ భారతీయ భక్తులు ఈ తరుణం కోసం వేచి ఉన్నారు. ఈ క్రమంలో పాఠశాలలో ప్రేయర్ టైంలో కొంతమంది రాముడు పాటకు చేసిన డ్యాన్స్ అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.

అయోధ్య రామ మందిరం అంగరంగ వైభోగంగా ప్రాణప్రతిష్ఠకు సిద్ధమవుతోంది. ఇప్పటికే అయోధ్యలో మహానగరం భక్తులతో కిక్కిరిసిపోతుంది. దీనితో యావత్ భారతీయ భక్తులు ఈ తరుణం కోసం వేచి ఉన్నారు. ఈ క్రమంలో పాఠశాలలో ప్రేయర్ టైంలో కొంతమంది రాముడు పాటకు చేసిన డ్యాన్స్ అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది.

  • Published Jan 20, 2024 | 2:11 PMUpdated Jan 20, 2024 | 2:13 PM
Maharashtra: స్కూల్లో ప్రార్థన వేళ.. భక్తిపారవశ్యంలో టీచర్, విద్యార్థులు డ్యాన్స్

అయోధ్య మహానగరం అంతా అందంగా ముస్తాబైంది. ఆ అయోధ్య రామయ్య పైన ఉన్న భక్తి తరాలు మారినా ఏ మాత్రం తరగకుండా.. నానాటికి విస్తృతంగా దేశమంతటా వ్యాపిస్తునే ఉంది. ఆ వ్యాప్తిచెందిన భక్తి, పోరాటాల ఫలితమే నేడు మందిరంగా రూపుదిద్దుకుంది. రామ మందిర నిర్మాణానికి కూడా ఎంతో మంది ప్రజలు భక్తి శ్రద్దలతో విరాళాలను అందించారు. అలాగే ఇప్పటికి ఎప్పటికి తరగని రాముని మీద ఉండే.. ఆ భక్తి శ్రద్ధలను ఎంతో మంది ప్రజలు తమదైన శైలిలో కనబరుస్తూనే ఉన్నారు. ఈ సందర్భానికి తగినట్టు ఎన్నో భక్తి గీతాలను కూడా ఆలపించారు. ఇక ఇప్పుడు ఈ సమయానికి అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమమే అందరిని కట్టిపడేస్తున్న వార్త. పాఠశాలలోని విద్యార్థులకు సైతం మన చరిత్రపైన అవగాహన కలిపిస్తున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని పాఠశాలలో ప్రేయర్ టైం లో కొంతమంది విద్యార్థులు.. రామ ప్రతిష్ఠాపనను ఉద్దేశించిన గీతాలకు ఎంతో అందంగా డ్యాన్స్ చేశారు.

ప్రస్తుతం చిన్నా పెద్దా అని తేడా లేకుండా యావత్ భారతదేశం.. ఆ అయోధ్య రామయ్య మీద ఉన్న భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు. సాధారణంగా ఏ పాఠశాలలో అయినా ఉదయాన్నే జాతీయ గీతాలతో విద్యార్థుల చేత ప్రేయర్ చేయిస్తూ ఉంటారు. అయితే, మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఓ పాఠశాల విద్యార్థులు మాత్రం.. రాముడి భజన పాటకు డ్యాన్స్ చేశారు. ప్రార్థన సమయంలో లైన్ లో నిలబడి.. టీచర్ తో కలిసి వారు డ్యాన్స్ చేసిన తీరు అందరిని అలరిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సామజిక మాధ్యమాలలో సందడి చేస్తుంది. ఇక ఇప్పటికే అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు ఆలయ ట్రస్టు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. ఈ క్రమంలో 20వ తేదీన సరయూ నది పవిత్ర జలాలతో.. ఆలయ గర్భగుడిని సంప్రోక్షణ చేస్తారు. 21వ తేదీన రామయ్య విగ్రహానికి 125 కలశాలతో దివ్యస్నానం చేయిస్తారు. ఇక జనవరి 22న రాముడి ప్రాణ ప్రతిష్ఠ, ఆ తర్వాత పట్టాభిషేకం కార్యాక్రమాలు జరగనున్నాయి.

ఇక ఆలయ ప్రారంభోత్సవానికి తరలివచ్చే భక్తుల కోసం దాదాపు 5 లక్షల ప్రసాదాల ప్యాకెట్లు సిద్ధం చేశారు. అంతే కాకుండా రామమందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో.. భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టంగా చేయనున్నారు. ఇప్పటికే అయోధ్యకు చేరుకున్న అధికార బృందాలు.. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉన్నాయి. మరోవైపు ఆలయం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి సాంకేతికత సాయంతో పటిష్టంగా నిఘా చర్యలు చేపట్టారు. ఇంకా కొన్ని డ్రోన్స్‌ను కూడా రంగంలోకి దింపారు. అయోధ్య మొత్తం సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసి.. వాటిని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు లింక్ చేశారు. ఇలా అయోధ్య నగరం అంతా భక్త జన సందోహంతో నిండిపోయి ఉంది. మరి, మహారాష్ట్రలో పాఠశాల విద్యార్థులు.. అయోధ్య రాముడికి అంకితం చేస్తూ చేసిన డ్యాన్స్ వీడియోపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.