తప్పుడు పని చేశాడని వేరే రాష్ట్రం వెళ్లి మరీ కొట్టిన మహిళలు.. ఆ ధైర్యానికి హ్యాట్సాఫ్

Tamil Nadu Women From Different Districts Went To Kerala And Beating Vlogger Who Shared Morphed Photos Of Them: మహిళలు తలచుకుంటే ఏమైనా చేయగలరు అనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఎక్కడో ఉన్న మహిళలు ఏం చేయలేరులే అని అనుకుని.. వారి ఫోటోలను మార్ఫింగ్ చేస్తే చూస్తూ ఊరుకోవాలా? తప్పు చేసిన వాడు ఎక్కడున్నా వెళ్లి మరీ బుద్ధి చెప్తారు.

Tamil Nadu Women From Different Districts Went To Kerala And Beating Vlogger Who Shared Morphed Photos Of Them: మహిళలు తలచుకుంటే ఏమైనా చేయగలరు అనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఎక్కడో ఉన్న మహిళలు ఏం చేయలేరులే అని అనుకుని.. వారి ఫోటోలను మార్ఫింగ్ చేస్తే చూస్తూ ఊరుకోవాలా? తప్పు చేసిన వాడు ఎక్కడున్నా వెళ్లి మరీ బుద్ధి చెప్తారు.

ఎవరైనా తప్పు చేస్తే దగ్గరలో ఉంటే బుద్ధి చెప్తారు. అదే వ్యక్తి ఏ సోషల్ మీడియాలోనే ఉంటే.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఉంటే బుద్ధి చెప్పడానికి ఆలోచిస్తారు. మగాళ్లు అయితే అతని ఉండే ఏరియాకి వెళ్లి మరీ బుద్ధి చెప్పి వస్తారు. ఒకవేళ వేరే రాష్ట్రంలో ఉంటే వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తారు. ఎందుకొచ్చిందిలే అని వదిలేస్తారు. కానీ మహిళలు అయి ఉండి తమ విషయంలో మిస్ బిహేవ్ చేశాడని వేరే రాష్ట్రం వెళ్లి అడ్రస్ తెలుసుకుని మరీ కొట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆ మహిళల ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్తున్నారు.      

సోషల్ మీడియా వచ్చాక టాలెంట్ చూపించుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇంతకు ముందులా ఇళ్లలో మగ్గిపోయి ఉండడం లేదు. చేతిలో స్మార్ట్ ఫోన్ వచ్చింది.. మనల్ని ఎవర్రా ఆపేది అని రెచ్చిపోతున్నారు. స్కిల్స్, టాలెంట్ చూపించి వీడియోలు చేస్తూ క్రియేటర్స్ గా సక్సెస్ అవుతున్నారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఒక వ్లాగర్ కూడా మంచి ఫ్యాన్ బేస్ ని సెట్ చేసుకున్నాడు. ఏవో వీడియోలు చేసి ఫ్యాన్స్ ని ఎంటర్ టైన్ చేస్తున్నాడు. 

కేరళకు చెందిన ముహమ్మద్ అలీ జిన్నా అనే వ్లాగర్ ని తమిళనాడు నుంచి వచ్చి మరీ కొంతమంది మహిళలు చితకబాదారు. ఈ ఘటన కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో చోటు చేసుకుంది. మహిళల అశ్లీల చిత్రాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాడని ఆరోపిస్తూ చితకబాదారు. అతన్ని కట్టేసి నేల మీద పడుకోబెట్టి మరీ చితకబాదారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మార్ఫింగ్ చేసి తమ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ సహా పలు సోషల్ మీడియా సైట్స్ లో సర్క్యులేట్ చేస్తున్నాడని ఆ మహిళలు ఆరోపించారు. ఈ మహిళలు తమిళనాడులోని వేర్వేరు జిల్లాల నుంచి వచ్చారు.

కేరళలో జల్లెడ వేసి పాలక్కాడ్ జిల్లాలోని అగళి పట్టణంలో ఉంటున్నాడని తెలుసుకుని పట్టుకున్నారు. అనంతరం కట్లు కట్టి చితకబాదారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వ్లాగర్ ని మహిళల నుంచి విడిపించారు. అయితే వ్లాగర్ మీద, అలానే మహిళల మీద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మహిళల మీద కేసు ఎందుకు పెట్టారని నెటిజన్స్ మండిపడుతున్నారు. మహిళల ధైర్యాన్ని కొనియాడుతున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించడం కోసం స్టేట్ దాటి రావడం అంటే మామూలు విషయం కాదని చెబుతున్నారు. మరి వేరే రాష్ట్రం వెళ్లి మరీ తప్పు చేశాడని మహిళలు వ్లాగర్ ని కొట్టడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Show comments