iDreamPost
android-app
ios-app

వీడియో: ఇలాంటి మేనమామలుంటే.. ఏ ఆడపిల్ల కన్నీళ్లు పెట్టదు..!

  • Published Jul 13, 2023 | 11:45 AMUpdated Jul 13, 2023 | 11:45 AM
  • Published Jul 13, 2023 | 11:45 AMUpdated Jul 13, 2023 | 11:45 AM
వీడియో: ఇలాంటి మేనమామలుంటే.. ఏ ఆడపిల్ల కన్నీళ్లు పెట్టదు..!

మన సమాజంలో బంధుత్వాలు, బంధాలకు పెద్ద పీట వేస్తారు. ఇక మనకున్న బందువుల్లో.. మేనమామకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. తండ్రి తర్వాత తండ్రిగా అతడిని భావిస్తారు. పుట్టు వెంట్రుకలు తీసేది మొదలు, చేవులు కుట్టించే ఫంక్షన్‌, పెళ్లి వరకు ఆడపిల్ల జీవితంలో జరిగే ప్రతి ఫంక్షన్‌లో మేనమామకు చాలా ప్రధాన్యత ఉంటుంది. ముఖ్యమైన పనులన్ని మేనమామ చేతులు మీదుగానే జరుగుతాయి. అయితే నేటి కాలంలో బంధాలన్ని ఆర్థిక సంబంధాలుగానే మిగిలిపోతున్నాయి. చేతి నిండా డబ్బులుంటే.. వద్దనుకున్నా సరే బంధాలు అన్ని మన దగ్గరకు వస్తాయి. అదే మనం కష్టంలో ఉంటే.. అమ్మో ఇప్పుడు వెళ్తే ఎక్కడ సాయం చేయాల్సి వస్తుందో అని ముఖం చాటేసే వాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి కృత్రిమ బంధాల మధ్య.. అప్పుడప్పుడు కొన్ని నిజమైన ప్రేమలు కనిపించి.. మనకు ధైర్యాన్ని ఇస్తుంటాయి. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.

నేటి కాలంలో ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్‌లు కూడా చాలా గ్రాండ్‌గా చేస్తున్నారు. పిల్లలు పుట్టాక ప్రతి నెల బర్త్‌డే చేస్తున్నవారు కూడా ఉన్నారు. ఇక ఆడపిల్ల జన్మించాక.. తన జీవితంలో జరిగే అతి ముఖ్యమైన శుభకార్యం చెవులు కుట్టించడం. మేనమామ చేతులు మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఓ 15-20 ఏళ్ల క్రితం చేవులు కుట్టించే కార్యక్రమాన్ని చాలా సింపుల్‌గా చేసేవారు. కానీ నేటి కాలంలో దీన్ని కూడా చాలా ఘనంగా చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తమిళనాడులో మేనకోడలి చెవులు కుట్టించే కార్యక్రమానికి మేనమామలు చేసిన హడావుడి.. వారు ఇచ్చిన బహుమతులు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచాయి. ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ వేడుకకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

తమిళనాడులోని పుదుకొట్టై జిల్లా మంగాడు అనే గ్రామానికి చెందిన ఇళయరాజా, నవనీత దంపతులకు రిక్షణ, సుదీక్షణ్‌ అనే ఇద్దరు సంతానం ఉన్నారు. ఇక తాజాగా వారికి చేవులు కుట్టించే కార్యక్రమంతో పాటు ధోతి వేడుక కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల మేనమామలు.. నవీన్‌ సుందర్‌, నవీన్‌ శిలలు ఇచ్చిన బహుమతుల గురించి ఎంత చెప్పినా తక్కువే. బంగారం, వెండి, డబ్బులు ఫలహారాలు ఇలా సుమారు 15 బండ్ల నిండుగా బహుమతులు తీసుకుని వెళ్లి మేనల్లుడు, మేనకోడలికి ఇచ్చి.. తమ ప్రేమను చాటుకున్నారు.

అంతేకాక ఈ ఫంక్షన్‌కి తరలి వచ్చిన బంధువులుకు బ్రహ్మాండమైన విందు కూడా ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఈ వేడుక, చిన్నారుల మేనమామలు ఇచ్చిన బహుమతులు గురించి జనాలు జోరుగా చర్చించుకుంటున్నారు. ఇంతలా ప్రేమను పంచే మేనమామలు ఉన్నందుకు మీరు అదృష్టవంతులు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి