iDreamPost
android-app
ios-app

రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టులో ఊరట! ఆ కేసులో..

  • Author Soma Sekhar Published - 02:48 PM, Fri - 4 August 23
  • Author Soma Sekhar Published - 02:48 PM, Fri - 4 August 23
రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టులో ఊరట! ఆ కేసులో..

పరువు నష్టం కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మోదీ ఇంటిపేరుపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో.. గుజరాత్ కు చెందిన ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ రాహుల్ పై పరువు నష్టం దావా వేశారు. దీంతో విచారణ చేపట్టిన సూరత్ కోర్ట్ రాహుల్ కు రెండేళ్ల శిక్ష విధించింది. సూరత్ కోర్ట్ తీర్పు ఫలితంగా ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద రాహుల్ పై అనర్హత వేటు పడింది. ఈ కారణంగా ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఈ క్రమంలోనే తన శిక్షపై స్టే విధించాలని గుజరాత్ హైకోర్ట్ లో పిటిషన్ వేశాడు రాహుల్ గాంధీ. ఆ పిటిషన్ ను కొట్టివేయడంతో.. తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు రాహుల్. తాజాగా సుప్రీం కోర్టు తన తీర్పును వెలువరించింది.

మోదీ ఇంటి పేరు కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. దాంతో లోక్ సభలో అనర్హతకు గురైయ్యారు రాహుల్. సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని గుజరాత్ హైకోర్టు లో పిటిషన్ వేశారు రాహుల్ గాంధీ. ఈ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. దాంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీం కోర్టును ఆశ్రయించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. తాను నిర్ధోషినని, తనకు విధించిన రెండేళ్ల శిక్షపై స్టే విధించాలని రాహుల్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. రాహుల్ తరపున వాదనలు వినిపించారు సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ.

ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా వేసిన భాజాపా ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ అసలు ఇంటిపేరు మోదీ కాదని, ఆ పేరును ఆయన తర్వాత పెట్టుకున్నారని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు సింఘ్వీ. ఈ క్రమంలోనే శుక్రవారం విచారణ చేపట్టిన ధర్మాసనం.. రాహుల్ గాంధీకి విధించిన రెండేళ్ల శిక్షపై స్టే విధించింది. దాంతో రాహుల్ గాంధీకి ఊరట లభించింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ సంజయ్ కుమార్ లతో కూడిన ధర్మాసనం తన తీర్పును వెలువరించింది. సుప్రీం కోర్టు తీర్పుపై కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదికూడా చదవండి: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. 42 మంది ప్రయాణీకుల్లో ఆరుగురు భారతీయులు!