Supreme Court On Hijab Ban: హిజాబ్‌పై బ్యాన్ విధించిన ముంబై కాలేజ్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

హిజాబ్‌పై బ్యాన్ విధించిన ముంబై కాలేజ్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Supreme Court Reaction After College Bans Hijab: బుర్కా, హిజాబ్ వంటివి ధరించి క్యాంపస్ లో తిరగకూడదని.. క్లాస్ రూమ్స్ రాకూడదని ఓ ప్రైవేట్ కాలేజీ ఆదేశాలు జారీ చేయడంపై సుప్రీంకోర్టు స్పందించింది.

Supreme Court Reaction After College Bans Hijab: బుర్కా, హిజాబ్ వంటివి ధరించి క్యాంపస్ లో తిరగకూడదని.. క్లాస్ రూమ్స్ రాకూడదని ఓ ప్రైవేట్ కాలేజీ ఆదేశాలు జారీ చేయడంపై సుప్రీంకోర్టు స్పందించింది.

ముస్లిం యువతులు హిజాబ్ వేసుకుని కాలేజ్ కి రావొద్దని ముంబైకి చెందిన ఓ ప్రైవేట్ కాలేజీ సర్క్యులర్ జారీ చేసింది. కాలేజ్ క్యాంపస్ లో హిజాబ్, బుర్కా, క్యాప్, నఖాబ్ వంటి వాటిని ధరించి తిరగద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. బాంబే హైకోర్టులో ముస్లిం విద్యార్థులు కొన్ని రోజుల క్రితం పిటిషన్ వేశారు. పిటిషన్ ని విచారించిన బాంబే హైకోర్టు.. కాలేజీ యాజమాన్యాన్ని సమర్ధించింది. కాలేజీ ఆవరణలో ముస్లిం మహిళా విద్యార్థులు బుర్కా, హిజాబ్ వంటివి ధరించి తిరగకూడదన్న కాలేజీ యాజమాన్య నిర్ణయంలో తప్పు లేదని.. అది విద్యార్థుల స్వేచ్ఛ ఉల్లంఘన కిందకు రాదని పేర్కొంది. కాలేజీకి ఒక డ్రెస్ కోడ్ ఉంటుందని.. దాన్ని ఫాలో అవ్వాలని.. అది కాలేజీ ప్రాథమిక హక్కులో భాగమని బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ముస్లిం మహిళా విద్యార్థులు బాంబే హైకోర్టు తీర్పుని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

తాజాగా ఈ పిటిషన్ ని విచారించిన సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బుర్కా, హిజాబ్ వంటివి ఎందుకు ధరించకూడదని.. నచ్చిన దుస్తులు వేసుకునే స్వేచ్ఛ కూడా లేదని ఆవేదన చెందారు. తాజాగా ఈ వివాదంపై సుప్రీంకోర్టు స్పందించింది. ముంబై కాలేజ్ జారీ చేసిన సర్క్యులర్ పై స్టే విధించింది. విద్యార్థులకు నచ్చిన దుస్తులు వేసుకునే స్వేచ్ఛ ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. విద్యార్థులు మత విశ్వాసాలు బహిర్గతం కాకూడదన్నప్పుడు బుర్కాని బ్యాన్ చేసినట్టే తిలకం, బొట్టు వంటివి కూడా నిషేధించాలి కదా.. మరి వాటిని ఎందుకు నిషేధించలేదని కాలేజీ యాజమాన్యాన్ని కోర్టు ప్రశ్నించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు బెంచ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, సంజయ్ కుమార్ లు.. చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషన్ సొసైటీ కాలేజీకి నోటీసులు పంపించారు.

దీనిపై నవంబర్ 18 లోపు వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ధర్మాసనం కోరింది. విద్యార్థుల మీద విద్యాసంస్థల ఛాయిస్ ని బలవంతంగా రుద్దకూడదని కోర్టు వెల్లడించింది. ఏ దుస్తులు ధరించాలో అనేది అమ్మాయిలకి స్వేచ్ఛ ఉంటుంది. ఈ విషయంలో కళాశాల యాజమాన్యం బలవంతం చేయడానికి వీల్లేదు. దేశంలో అనేక మతాలు ఉన్నాయని తెలిసి అకస్మాత్తుగా మేల్కొనడం దురదృష్టకరం అని కోర్టు కాలేజీ యాజమాన్యానికి వెల్లడించింది. బుర్కా ధరించే విద్యార్థులు 400 మంది ఈ కాలేజీకి వెళ్తున్నారు. వీరందరినీ కాలేజీకి రాకూడదని యాజమాన్యం నిషేధించింది. దీంతో విద్యార్థులు బాంబే హైకోర్టులో పిటిషన్ వేస్తే కాలేజీ నిర్ణయం తప్పు కాదని పేర్కొంది. విద్యార్థులు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడంతో కోర్టు.. కాలేజీ తీరుని తప్పుబట్టింది.

Show comments