Dharani
సినిమాల్లో వచ్చే కొన్ని సన్నివేశాలపై దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అలాంటి సినిమాలు పెట్టవద్దని సూచించింది. ఆ వివరాలు..
సినిమాల్లో వచ్చే కొన్ని సన్నివేశాలపై దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అలాంటి సినిమాలు పెట్టవద్దని సూచించింది. ఆ వివరాలు..
Dharani
సినిమా.. ఎన్నో ఏళ్లుగా మనిషిని అలరిస్తూ వస్తోన్న ఎంటర్‌టైన్‌మెంట్ సాధనం. మూకీ సినిమాలు మొదలు.. నేడు ప్రపంచ స్థాయి వేదికల మీద నిలిచే చిత్రాల వరకు.. ఇండియా సినీ పరిశ్రమలో అనేక మార్పులు సంభవించాయి. సినిమా మేకింగ్ నుంచి రిలీజ్ వరకు ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు సినిమా అంటే కుటంబ విలువలతో.. సమాజానికి సందేశం ఇచ్చేలా ఉండేవి. మరీ ముఖ్యంగా ఎవరిని కించపరచకుండ.. అసభ్యత, అశ్లీలం అనే వాటికి తావు లేకుండా సినిమాలను తెరకెక్కించే వారు. అయితే మారుతన్న కాలంతో పాటు సినిమాల్లో కూడా అనేక చేంజేస్ వచ్చాయి.
హీరోయిజం, హీరోయిన్ అంటే గ్లామర్ ఆరబోతకే అన్నట్లుగా మార్చారు. అంతటితో ఆగక కొన్ని ప్రాంతాల వారి ఆచారవ్యవహరాలు, భాషను సైతం కించపరిచేలా సినిమాలు తెరకెక్కించడం ప్రారంభించారు. హింస, అశ్లీలం, అసభ్యత గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అన్నట్లుగా ఉంది నేటి సినిమా పరిస్థితి. కుటుంబం అంతా కలిసి చూసే సినిమాలు ఇప్పుడు ఏడాదికి ఒక్కటి కూడా రావడం లేదంటే.. పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో తాజాగా సినిమాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మూవీల్లో అలాంటి సీన్లు పెట్టవద్దని సూచించింది. ఆ వివరాలు..
సినిమాల్లో చూపించే కొన్ని సీన్లపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరీ ముఖ్యంగా దివ్యాంగులను కించపరిచేలా, ఎగతాళి చేసేలా చూపడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. సినిమాల్లో కామెడీ కోసం దివ్యాంగుల ప్రాతలను వాడుకోవడాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్రంగా తప్పు పట్టింది. మూవీస్‌లో దివ్యాంగుల పాత్రలను ఓ మూసపద్ధతిలో చూపించడం మానుకోవాలని స్పష్టం చేసింది. దీని వల్ల సమాజంలో వారిపై వివక్ష, అసమానతలు మరింత పెరుగుతున్నాయని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది.
ఇలాంటి సున్నీతమైన అంశాల పట్ల రచయితలు, దర్శకులు, నిర్మాతలు, నటీనటులకు అవగాహన ఉండాలని.. ఇందుకోసం కార్యక్రమాలు రూపొందించాలని తెలిపింది. బాలీవుడ్ సినిమా ‘ఆంఖ్ మిచోలీ’లో దివ్యాంగులను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని నిపున్ మల్హోత్రా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. సినిమాలో పాత్రలను సృష్టించే సమయంలోనే రూపకర్తలు జాగ్రత్తలు తీసుకోవాలని, దివ్యాంగులపై వినియోగించే భాష విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని.. వికలాంగుడు, మందబుద్ధి లాంటి పదాలు వాడకూడదని పేర్కొంది.
వారి వైద్యపరిస్థితిని వాస్తవాలకు దగ్గరగా చూపించాలని, వక్రీకరించకూడదని మార్గదర్శకాల్లో ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాక సినిమా, యూట్యూబ్ వంటి మాధ్యమాల్లో సమాజంలోని వాస్తవ పరిస్థితులను కళ్లకు కట్టేలా చూపించాలని సూచించింది. సినిమాల్లో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లను మాత్రమే కాక.. వారు సాధించిన విజయాలు, వారిలోని టాలెంట్.. సమాజానికి, దేశానికి వారు చేసిన సేవను చూపించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.