Success Story: 8వ తరగతి చదువుతో.. రూ.10 వేల కోట్లు సంపాదన! ఈయన కథ తెలుసుకోండి!

ఇప్పుడు ప్రపంచం అంతా వ్యాపారం మీదే నడుస్తుంది. ఈ క్రమంలో ఇప్పటివరకు ఎంతో మంది సక్సెస్ అయిన వ్యాపారస్తులను చూశాము. ఇప్పుడు కేవలం ఎనిమిదవ తరగతి చదువుకుని వ్యాపారంలో కోట్లలో లాభం చూస్తున్న ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం.

ఇప్పుడు ప్రపంచం అంతా వ్యాపారం మీదే నడుస్తుంది. ఈ క్రమంలో ఇప్పటివరకు ఎంతో మంది సక్సెస్ అయిన వ్యాపారస్తులను చూశాము. ఇప్పుడు కేవలం ఎనిమిదవ తరగతి చదువుకుని వ్యాపారంలో కోట్లలో లాభం చూస్తున్న ఒక వ్యక్తి గురించి తెలుసుకుందాం.

ప్రపంచంలో ఎంతో మంది వ్యాపారస్తులు ఉన్నారు. వారిలో కొంతమంది చదువుకున్న వారు ఉన్నారు . మరికొంతమంది చదువు లేని వారు ఉన్నారు. ఓ విధంగా చెప్పాలంటే చదువు సంబంధం లేకుండా జీవితంలో ఎదగాలంటే మాత్రం కేవలం వ్యాపారం ఒక్కటే దారి. వ్యాపారం చేయడానికి కేవలం తెలివితేటలు ఉంటే సరిపోతుందని ఎంతో మంది వ్యాపారస్తుల జీవిత గాధలు ఉదాహరణలుగా నిలిచాయి. కనీస అక్షర జ్ఞానం కూడా లేకుండా.. వ్యాపారంలో ముందంజలో ఉన్న వారు మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఓ వ్యక్తి సక్సెస్ స్టోరీ కూడా ఇటువంటిదే. దేశంలోనే విజయవంతమైన వ్యాపారవేత్తలతో ఒకరు శివ రతన్ అగర్వాల్. ఇప్పుడు 72 ఏళ్ళ వయస్సులో ఈ వ్యక్తి సుమారు రూ. 13,430 కోట్ల విలువైన కంపెనీకి యజమాని. ఇటీవల ఫోర్బ్స్ వరల్డ్ బిలియనీర్ లిస్ట్ 2024 లిస్ట్ లో కూడా ఈ వ్యక్తి పేరు నమోదు అయింది. ఈ వ్యక్తి సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం.

శివ రతన్ అగర్వాల్ .. బికాజీ ఫుడ్స్ ఇంటర్నేషనల్ సంస్థకు వ్యవస్థాపకుడు. అలాగే ఆ సంస్థకు ఇతను ఛైర్మెన్ కూడా. అయితే ఇతను చదువుకున్నది మాత్రం కేవలం 8వ తరగతి వరకే. అయినా సరే అంత పెద్ద కంపెనీకి చైర్మన్ ఎలా అయ్యాడు అనే విషయాల గురించి తెలుసుకుందాం. బికాజీ ఫుడ్స్ ఇంటర్నేషనల్ సంస్థ నేడు చిరు ధాన్యాల మార్కెట్ లో పెప్సీకో, ఫ్రిటో-లే వంటి పెద్ద కంపెనీలతో పోటీ పడుతుంది. నేడు భారతదేశంలో ప్రతి ఇంటికి ఈ కంపెనీ నుండి ఆహార పదార్ధాలు వెళ్తున్నాయి. బికాజీ కథ 80 సంవత్సరాల క్రితం మొదలైంది. 1940 లో.. రాజస్థాన్ లోని బికనీర్ నగరంలో ఒక చిన్న కొలిమిలో.. ఈ ఆలు భుజియాను తయారు చేయడం ప్రారంభించారు. అయితే అతని దుకాణం పేరు.. అంతకముందు.. “హల్దీరామ్ భుజివాలా”.. దానిని గంగ బిస్వాన్ అగర్వాల్ స్థాపించాడు. మొదట్లో ఇది కేవలం ఒక చిన్న దుకాణం మాత్రమే.. అది క్రమంగా పెరుగుతూ.. ఆ నగరం అంతటా ఇది ప్రసిద్ధి చెందింది. క్రమంగా అది అనేక నగరాలకు, రాష్ట్రాలకు విస్తరించింది. ఇక ఈ శివరతన్ అగర్వాల్ హల్దీరామ్ భుజివాలా మనవడు. అతను 8వ తరగతి పాస్ అయిన తర్వాత చదువుపై ఆసక్తి లేక.. ఈ వ్యాపార రంగంలో అడుగుపెట్టాడు.

ఈ క్రమంలో ఆ వ్యాపారం తరాలు మారుతూ వచ్చింది. క్రమంగా హల్దీరామ్ పేరు ఉన్న ఆ బ్రాండ్ నుంచి తప్పుకుని. శివరతన్ అగర్వాల్ 1980లో కొత్త బ్రాండ్ ను ప్రారంభించాడు. దానికి బికాజీ అని పేరు పెట్టాడు. ఈ కంపెనీలో అతను.. భుజియా, నమ్కీన్, క్యాన్డ్ స్వీట్లు, పాపడ్ లాంటి ఎన్నో ఆహార పదార్ధాలను.. క్వాలిటీగా తయారు చేయడం ప్రారంభించాడు. క్రమంగా ఈ కంపెనీ ఎదుగుతూ.. నేడు దేశంలోనే అతి పెద్ద సాంప్రదాయ స్నాక్స్ తయారీ దారి సంస్థగా పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా 1992లో నేషనల్ అవార్డు ఫర్ ఇండస్ట్రియల్ ఎక్సలెన్స్ తో.. ఓ పురస్కారం కూడా అందుకున్నాడు. నేడు ఈ సంస్థ ఉత్పత్తులు దేశవ్యాప్తంగా 8 లక్షల కంటే ఎక్కువ దుకాణాలలో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ సంస్థ నికర విలువ సుమారు రూ.10,830 కోట్లు ఉన్నట్లు సమాచారం. మరి, ఈ సక్సెస్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments