iDreamPost
android-app
ios-app

కాలేజ్ కి వెళ్లిన విద్యార్థిని.. కొద్ది సేపట్లోనే..

  • Published Feb 20, 2024 | 4:45 PM Updated Updated Feb 20, 2024 | 4:46 PM

Girl Drowns in Chaliyar River: కష్టపడి చదివి ఉన్నత విద్యనభ్యసించి తల్లిదండ్రుల కల నెరవేర్చాలని భావించిన విద్యార్థిని.. ఆ తల్లిదండ్రులను తీరని దుఖఃంలో ముంచింది

Girl Drowns in Chaliyar River: కష్టపడి చదివి ఉన్నత విద్యనభ్యసించి తల్లిదండ్రుల కల నెరవేర్చాలని భావించిన విద్యార్థిని.. ఆ తల్లిదండ్రులను తీరని దుఖఃంలో ముంచింది

కాలేజ్ కి వెళ్లిన విద్యార్థిని.. కొద్ది సేపట్లోనే..

మృత్యువు ఏ రూపంలో వెంటాడుతుందో ఎవరూ ఊహించలేరు. వాన రాకడ, ప్రాణం పోకడ చెప్పిరావని పెద్దలు అంటారు. ఇటీవల చిన్నా.. పెద్ద వయసు తేడా లేకుండా హార్ట్ ఎటాక్, రోడ్డు ప్రమాదాలు, కరెంట్ షాక్, అగ్ని ప్రమాదాలు ఇలా ఎన్నో రకాలుగా మనిషి మృత్యువడిలోకి చేరుకుంటున్నారు. దీంతో కుటుంబ సభ్యులు తీరని దుఖఃంలో మునిగిపోతున్నారు. గొప్ప చదువు చదివి తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలన్న ఓ విద్యార్థిని ఆశలు ఆవిరయ్యాయి.. అనుకోని సంఘటనతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇంతకీ ఆ విద్యార్థినికి ఏం జరిగింది..? అన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

మలప్పురంలోని ఎడవన్నప్పర వద్ద తీవ్ర విషాదం నెలకొంది. వజక్కడ్ వెట్టత్తూర్ వలచట్టికి చెందిన సిద్దిక్ మాస్టర్ కుమార్తె సనా ఫాతిమా (17) మృతి చెందింది. సోమవారం యదావిధిగా సనా ఫాతిమ కాలేజ్ కి వెళ్లింది. రాత్రి వరకు తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. స్థానికుల సహాయంతో ఊరంతా వెతికారు. ఈ క్రమంలోనే నీటిలో మునిగి చనిపోయినట్లు గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులు స్థానికుల సాయంతో వాయక్కాడ్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రాణాలను కాపాడలేకపోయారు. ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.

మృతదేహాన్ని కొల్హికోడ్ మెడికల్ కాలేజ్ కి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే సనా ఫాతిమా మరణంపై కుటుంబీకులు, స్థానికులు అనుమానాలు వ్యక్తం చేశారు. తమ కూతురు నీటిలో మునిగిపోయి ఎందుకు చనిపోతుందని.. తనకు ఎలాంటి సమస్యలు కానీ, చదువు కి సంబంధించిన ఒత్తిడి కానీ ఏవీలేవని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు సనా ఫాతిమా హత్యా? ఆత్మహత్య లేక ప్రమాదవశాత్తు నీటిలో మునిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తమ కూతురు మంచి చదువులు చదివి గొప్ప పొజీషన్ కి వెళ్తుందని భావిస్తే.. ఊహించని విధంగా మృత్యుపాలైందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.