Election Results 2024: ఎన్నికల ఫలితాలు.. కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌! భారీ నష్టాలు

Election Results 2024: ఎన్నికల ఫలితాలు.. కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌! భారీ నష్టాలు

Stock Market, Lok Sabha, Election Results 2024: ఎగ్టిట్‌ పోల్స్‌లో ఎన్డీయే కూటమికి మెజార్టీ వస్తుందని తేలడంతో లాభాల్లో దూసుకెళ్లిన స్టాక్‌ మార్కెట్‌.. వాస్తవ ఫలితాలు భిన్నంగా రావడంతో కుప్పకూలింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Stock Market, Lok Sabha, Election Results 2024: ఎగ్టిట్‌ పోల్స్‌లో ఎన్డీయే కూటమికి మెజార్టీ వస్తుందని తేలడంతో లాభాల్లో దూసుకెళ్లిన స్టాక్‌ మార్కెట్‌.. వాస్తవ ఫలితాలు భిన్నంగా రావడంతో కుప్పకూలింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్‌ భారీ నష్టాలు చవిచూసింది. ఎన్నికల ఫలితాలకు ఒక రోజు ముందు స్టాక్ మార్కెట్ లో దూకుడు కనిపించగా.. మంగళవారం మాత్రం పరిస్థితులు తారుమారయ్యాయి. రిజల్ట్స్ తర్వాత స్టార్‌ మార్కెట్‌లో లాభాలతో భారీ ర్యాలీ చూస్తామని ఆశ పడిన పెట్టుబడి దారులకు తీవ్ర నిరాశే మిగిలింది. మార్కెట్‌లో ఒక్కసారిగా భారీ క్రాష్ కనిపిస్తోంది. ఉదయం 11 గంటల సమయానికి సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాన్ని చవిచూశాయి. సెన్సెక్స్ 4,000 పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ 929.80 పాయింట్ల నష్టాన్ని నమోదు చేసింది.

2 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి..
రెండేళ్ల తర్వాత స్టాక్ మార్కెట్‌లో కనిపించిన అతిపెద్ద క్రాష్ ఇదే కావడం విశేషం. ఫిబ్రవరి 2022 తర్వాత ఈ రేంజ్ పతనం ఇప్పుడే జరిగింది. జూన్‌ 1న వచ్చిన ఎగ్జిట్‌ పోల్స్‌కి ప్రస్తుతం వస్తున్న ఫలితాలకి సంబంధం లేకపోవడంతో మార్కెట్ నష్టాల బాటపట్టింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాల ట్రెండ్‌ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లను నిరాశపరిచాయని, ఊహించిన దానికి భిన్నంగా లోక్‌సభ ఎన్నికల రిజల్ట్స్‌ వస్తుండటం భారత స్టాక్ మార్కెట్‌లో ఈ పతనానికి ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. సెన్సెక్స్ భారీగా పతనం కావడంతో దలాల్ స్ట్రీట్‌లోని ఇన్వెస్టర్లు తొలి 20 నిమిషాల్లోనే రూ.20 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూశారు. అయితే ఈ రోజంతా మార్కెట్ సూచీల్లో తీవ్ర ఒడిదొడుకులు కనిపించే ఛాన్స్ ఉందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

ప్రస్తుతం వస్తున్న ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 295 స్థానాల్లో ముందంజలో ఉంది. అలాగే కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి 230 స్థానాల్లో లీడ్‌లో ఉంది. ఇతరులు 18 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే.. ఎగ్జిట్‌ పోల్స్‌లో మాత్రం ఎన్డీయే కూటమి స్పష్టమైన భారీ మెజార్టీ వస్తుందని తేల్చారు. కానీ, వాస్తవ ఫలితాలు మాత్రం వేరేలా ఉన్నాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకటించగానే లాభాల్లో దూసుకెళ్లిన స్టాక్‌ మార్కెట్‌.. ఫలితాలు కాస్త భిన్నంగా వస్తుండటంతో నష్టాల్లోకి వెళ్లింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయం

Show comments