P Krishna
పండుగల సందర్భంగా ఉద్యోగులకు ప్రత్యేక బహుతులు, బోనస్ లు ప్రకటిస్తుంటారు. కొన్ని ప్రైవేట్ కంపెనీ వాళ్లు ఏకంగా ఖరీదైన వాహనాలు, బంగారు కానుకలు కూడా ఇస్తుంటారు.
పండుగల సందర్భంగా ఉద్యోగులకు ప్రత్యేక బహుతులు, బోనస్ లు ప్రకటిస్తుంటారు. కొన్ని ప్రైవేట్ కంపెనీ వాళ్లు ఏకంగా ఖరీదైన వాహనాలు, బంగారు కానుకలు కూడా ఇస్తుంటారు.
P Krishna
సాధారణంగా ప్రతి సంవత్సరం పండుగల సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ప్రత్యేక బహుమతులు, బోనస్ లు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఉద్యోగులను సంతోషపెట్టేందుకు కొన్ని రాష్ట్రాల్లో దసరా, దీపావళి ప్రత్యేక కానుకలు, బోనస్ లు ప్రకటిస్తుంటారు. తాజాగా ఓ రాష్ట్ర సీఎం ఉద్యోగులకు వన్ టైమ్ బోనస్ ప్రకటించారు. ప్రభుత్వం ప్రకటించిన బోన్ గురించి తెలిసిన ఉద్యోగుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇటీవల నిత్యావసర వస్తువులు, బట్టలు, ఇతర సామాగ్రి ధరలు భారీగా పెరిగిపోవడం.. పండుగ సందర్భంగా ఉద్యోగులకు ప్రత్యేక భారం కాకుండా ఈ బోనస్ వారికి కలిసి వస్తుందని అంటున్నారు. వివరాల్లోకి వెళితే..
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉద్యోగులకు శుభవార్త తెలిపారు. గ్రూప్ బీ, గ్రూప్ సీ ప్రభుత్వ ఉద్యోగులకు రూ.7 వేల వరకు వన్ టైమ్ బోనస్ ఇవ్వబోతున్నట్లుగా సోమవారం వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సుమారు 80 వేల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. వన్ టైమ్ బోనస్ తో ప్రభుత్వంపై దాదాపు రూ.56 కోట్ల వరకు భారం పడనున్నట్లు తెలిపారు. ‘ఉద్యోగులు చేస్తున్న కృషి వల్లనే ఢిల్లీ ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇందు కోసం ఎంతో కష్టపడుతున్న గ్రూప్ బీ నాన్ గెజిట్, గ్రూప్ సీ ఉద్యోగులకు ఢిల్లీ ప్రభుత్వం రూ.7 వేల వరకు బోనస్ అందజేస్తున్నాం అని సంతోషంగా తెలుపుతున్నాం… దీని వల్ల 80 వేల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుంది’ అని ఓ వీడియో విడుదల చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకగా బోనస్ ప్రకటించడంతో వారి కుటుంబాల్లో పండుగ ఉత్సాహం నిండుకుంది. ఢిల్లీ ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, ఈ ప్రయత్నాలు భవిష్యత్ లో మరింత గొప్పగా కొనసాగుతాయని అన్నారు. ఉద్యోగులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులందరూ తన కుటుంబం అని, ఈ సారి దీపావళి పండు అందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని.. అందుకే రూ.7 వేల వన్ టైమ్ బోనస్ ప్రకటించినట్లు తెలిపారు ముఖ్యమంత్రి కేజ్రీవాల్. ఇటీవల ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ లో ప్రమాదకర స్థాయిలో కాలుష్యం పెరిగిపోవడం తెలిసిందే. ఈ సమస్యను అరికట్టేందుకు సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ సెక్రటేరియట్ లో పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ తో పాటు పలువురు సీనియర్ అధికారులతో వాయు కాలుష్య సంక్షోభాన్ని నియంత్రించడానికి సమర్థవంతమైన వ్యూహాలను రూపొందించేందుకు సమావేశం నిర్వహించారు. సీఎం దీపావళి కానుక ప్రకటించడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.