iDreamPost

రైతులకు శుభవార్త! అనుకున్న సమయం కంటే ముందుగానే దేశంలోకి..

Southwest Monsoon: వ్యవసాయానికి ప్రధాన ఆధారం నీరు. ఇక వేసవి కాలం కావడంతో  చాలా ప్రాంతాల్లోని చెరువులు, బావులు ఎండిపోయి కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రైతులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది ఐఎండి సంస్థ

Southwest Monsoon: వ్యవసాయానికి ప్రధాన ఆధారం నీరు. ఇక వేసవి కాలం కావడంతో  చాలా ప్రాంతాల్లోని చెరువులు, బావులు ఎండిపోయి కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రైతులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది ఐఎండి సంస్థ

రైతులకు శుభవార్త! అనుకున్న సమయం కంటే ముందుగానే దేశంలోకి..

దేశానికి ఆధారం రైతులు. వారు కష్టపడి పని చేస్తే.. అందరికి కడుపు నిండా అన్నం అందుతుంది. అయితే నేటికాలంలో చాలా మంది రైతులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక సమస్యలతో పాటు, వాతావరణం సహకరించకపోవడంతో..రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. అలానే పంటలు పండించేందుకు వాన దేవుడి కోసం ఎదురు చూస్తుంటారు. కొన్ని సార్లు వానదేవుడు కూడా ముఖం చాటేస్తుంటాడు. అయితే ఈ సారి మాత్రం రైతులకు ఓ గుడ్ న్యూస్ వచ్చిందనే చెప్పాలి. భారత వాతావరణ విభాగం వ్యవసాయదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

వ్యవసాయానికి ప్రధాన ఆధారం నీరు. ఇక వేసవి కాలం కావడంతో చాలా ప్రాంతాల్లోని చెరువులు, బావులు ఎండిపోయి కనిపిస్తున్నాయి. వేసవికాలం తరువాత పంటలు వేసేందుకు రైతులు ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో వానలు పడితేనే రైతులు అనుకున్న పనులు ప్రారంభం అవుతాయి. ఈ సారి కూడా వ్యవసాయదారులు వానల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ రైతులకు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది వర్షాలు సాధారణం కంటే ఎక్కువ కురుస్తాయని తెలిపింది.

Farmer

అంతేకాక ఈసారి నైరుతి రుతుపవనాల రావడం కూడా గతంలో కంటే ముందుగా జరిగిందని తెలిపింది. ఈ క్రమంలోనే ఒక రోజు ముందే కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకాయని ఐఎండీ తెలిపింది. ఇక అక్కడి నుంచి దేశవ్యాప్తంగా ఈ నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయి. ఇదే సమయంలో నైరుతి రుతుపవనాల వ్యాప్తి.. తాము ఊహించిన దానికంటే వేగంగా జరుగుతోందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. దీంతో తాము అనుకున్న దాని కంటే ముందే దేశంలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తాజాగా తెలిపింది.

ఇక పలు విషయాలను ఐఎండీ వెల్లడించింది. గురువారం నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయని ప్రకటించింది. రావాల్సిన సమయం కంటే ముందే దేశంలోని వివిధ ప్రాంతాల్లోకి ఈ నైరుతి రుతుపవనాలు ప్రవేశించే సూచనలు కనిపిస్తున్నాయని పేర్కొంది. ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలైన సిక్కిం, త్రిపుర, మేఘలయతో పాటు పశ్చిమ బెంగాల్  రాష్ట్రాలను ఈ నైరుతి రుతుపవనాలు తాకాయని తెలిపింది. ఈ రాష్ట్రాలతో పాటు  కేరళ, కర్ణాటక, తమిళనాడు సహా  పలు ప్రాంతాల్లోకి ఇవి ముందే ప్రవేశించే పరిస్థితులు కనిపిస్తున్నాయని అధికారులు అంచనా వేశారు. సాధారణంగా అయితే జూన్ 1వ తేదీన కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాగుతాయి.

ఆ తరువాత జూన్ 5వ తేదీ ఈశాన్య రాష్ట్రాల్లోవిస్తరిస్తుంటాయి. అయితే ఈసారి మాత్రం ఈ రుతుపవనాలు అనుకున్న సమయం కంటే ముందుగానే  రాష్ట్రాల్లో విస్తరిస్తుంది. నైరుతి రుతుపవనాల  ప్రవేశించే సమయంలోనే బంగాళాఖాతంలో రెమాల్‌ తుపాను ఏర్పడింది. మన దేశంలో వ్యవసాయం పూర్తిగా నైరుతి రుతుపవనాలపై ఆధారపడి జరుగుతుందనే విషయం తెలిసిందే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కూడా జూన్‌ 5 వ తేదీలోపే రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మొత్తంగా వ్యవసాయానికి సిద్ధమయ్యే రైతులకు ఇది మంచి శుభవార్తే అని చెప్పాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి