iDreamPost
android-app
ios-app

రాహుల్ గాంధీ పెళ్లిపై స్పందించిన సోనియా గాంధీ! ఏమన్నారంటే?

  • Author Soma Sekhar Published - 05:05 PM, Sat - 29 July 23
  • Author Soma Sekhar Published - 05:05 PM, Sat - 29 July 23
రాహుల్ గాంధీ పెళ్లిపై స్పందించిన సోనియా గాంధీ! ఏమన్నారంటే?

ఇండియాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే? కొందరి సెలబ్రిటీల పేర్లు బయటకి వస్తాయి. అందులో ముందువరుసలో ఉంటారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, టాలీవుడ్ హీరో ప్రభాస్. అయితే హీరోల విషయం పక్కనపెడితే.. రాహుల్ గాంధీ పెళ్లి విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దానికి కారణం హర్యానా మహిళా రైతులు రాహుల్ పెళ్లెప్పుడు అని సోనియా గాంధీని ప్రశ్నించడమే. ఇటీవల రాహుల్ ఆహ్వానం మేరకు హర్యానా మహిళా రైతులు సోనియా నివాసానికి వెళ్లారు. ఈ క్రమంలోనే ఆమెను రాహుల్ పెళ్లి గురించి అడిగారు. ఈ ప్రశ్నకు స్పందించిన సోనియా గాంధీ.. వారికి సమాధానం ఇచ్చారు. మరి రాహుల్ పెళ్లిపై సోనియా గాంధీ ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. గతేడాది రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఎంతో ప్రజలు, నాయకులు, మీడియా రాహుల్ ను పెళ్లెప్పుడు చేసుకుంటావ్ అని అడిగిన విషయం తెలిసిందే. వారితోపాటుగా ప్రతిపక్షాలు జరిపిన సమావేశంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సైతం రాహుల్ పెళ్లిపై ప్రశ్నించారు. తాజాగా మరోసారి రాహుల్ పెళ్లి హాట్ టాపిక్ గా మారింది. దానికి కారణం ఈసారి రాహుల్ పెళ్లిపై స్వయంగా సోనియా గాంధీ స్పందించడమే.

ఇటీవలే రాహుల్ ఆహ్వానం మేరకు హర్యానా సోనిపట్ జిల్లా మదీనా గ్రామానికి చెందిన రైతులు సోనియా గాంధీ నివాసానికి వెళ్లారు. ఈ క్రమంలోనే సోనియా గాంధీ ఆ మహిళా రైతులతో డ్యాన్స్ వేయడంతో పాటుగా భోజనం కూడా చేశారు. ఈ సందర్భంగా ఆ మహిళా రైతులు సోనియా గాంధీ చెవిలో రాహుల్ గాంధీకి పెళ్లి చేద్దామా అని అడిగారు. దానికి సోనియా సమాధానం ఇచ్చారు. మీరే ఓ మంచి అమ్మాయిని చూడండి రాహుల్ కు ఇచ్చి పెళ్లి చేద్దాం అంటూ బదులిచ్చారు. అక్కడే ఉన్న ఉన్న రాహుల్ ఇది విని చిరునవ్వులు చిందిస్తూ.. త్వరలోనే పెళ్లి చేసుకుంటాను అంటూ బదులిచ్చారు.

ఇక హర్యానా రైతులు సోనియా నివాసానికి వెళ్లిన పూర్తి వీడియోను రాహుల్ గాంధీ తాజాగా పంచుకున్నారు. ఈ సందర్భంగా సోనియా గాంధీని భర్త రాజీవ్ గాంధీ మరణం గురించి మహిళలు ప్రశ్నించగా.. ఆమె కొంత భావోద్వేగానికి గురైయ్యారు. తమ తండ్రి మరణించినప్పుడు సోనియా గాంధీ కొన్ని రోజులు అన్నం, నీళ్లు ముట్టకుండా కుంగుబాటుకు గురైయ్యారని ప్రియాంక గాంధీ చెప్పుకొచ్చారు. దాంతో కన్నీరు కార్చారు సోనియా. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇదికూడా చదవండి: మాజీ మంత్రి నారాయణపై తమ్ముడి భార్య షాకింగ్ ఆరోపణలు!