iDreamPost
android-app
ios-app

22 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు.. సన్యాసిగా తల్లి ముందుకు..

చిన్నతనంలో తప్పిపోయిన కొడుకు 22 ఏళ్ల తర్వాత తల్లికి కనిపించాడు.. ఆ తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.. కానీ అంతలోనే..

చిన్నతనంలో తప్పిపోయిన కొడుకు 22 ఏళ్ల తర్వాత తల్లికి కనిపించాడు.. ఆ తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.. కానీ అంతలోనే..

22 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు..  సన్యాసిగా తల్లి ముందుకు..

తల్లిదండ్రులు తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో పిల్లలు తప్పిపోవడం, కిడ్నాప్ కి గురి కావడం లాంటివి జరుగుతుంటాయి. ఎంత వెతికానా ఫలితం లేకపోవడంతో తమ పిల్లల జ్ఞాపకాలతో తల్లిదండ్రులు బతికేస్తుంటారు. అలాంటిది చాలా ఏళ్ల తర్వాత తప్పిపోయిన తమ పిల్లలు తమ ముందు ప్రత్యక్షమైతే ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు.  ఇటీవల సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి తప్పిపోయిన పిల్లలను తల్లిదండ్రులు కలిసిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి.  ఓ కొడుకు చాలా సంవత్సరాల తర్వాత తల్లి వద్దకు చేరాడు..ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

2002 లో ఢిల్లీకి చెందిన పింకు చదువు మానేసి నిత్యం గోలీలు ఆడటంపై తండ్రి రతీపాల్ సింగ్, తల్లి భానుమతి మందలించి కొట్టారు. అప్పుడు రింకూ వయసు 11 ఏళ్లు. తల్లిదండ్రులపై అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పోలీసుకు ఫిర్యాదు చేశారు.. బంధుమిత్రుల ఇళ్లన్నీ వెతికారు.. కానీ పిల్లాడు మాత్రం కనిపించలేదు. పింకు జ్ఞాపకాలతో బతుకుతున్నారు తల్లిదండ్రులు. దాదాపు 22 ఏళ్ల తర్వాత ఉత్తర్ ప్రదేశ్ లోని అమేథీలో ఖరౌలీ గ్రామంలో రింకూ కనిపించాడు. అది కూడా సన్యాసి వస్త్రదారణంలో.. అతన్ని చూసి బంధువులు గుర్తు పట్టి ఢిల్లీలో ఉన్న తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వెంటనే రతిపాల్, భానుమతి ఆ గ్రామానికి వచ్చారు. 22 ఏళ్ల తర్వాత కొడుకును ఆ పరిస్తితిలో చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యంతో పాటు ఆవేదన చెందారు. ఆ సన్యాసి పై ఉన్న మచ్చ ఆధారంగా తన కొడుకు పింకునే అని భానుమతి గుర్తించింది.

తల్లి, కొడుకు కలవడంతో అక్కడ ఉన్నవారంతా ఎంతో ఎమోషన్ అయ్యారు. ఆ తల్లి కళ్లలో ఆనందం వెల్లువిరిసింది. కానీ ఆ ఆనందం ఎంతో సేపు లేకుండా పోయింది. సన్యాసిగా మారిన పింకు తనకు ఐహిక సుఖాలు ఏవీ వొద్దని.. తల్లి నుంచి బిక్ష స్వీకరిస్తేనే తన సన్యాస జీవితానికి సార్థకత ఉంటుందని తెలిపాడు. దైవ నిర్ణయం వల్లనే తను కుటుంబానికి దూరమయ్యానని.. తిరిగి కలిసి ఉండేది లేదని చెప్పాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఎంత నచ్చజెప్పినా వినకుండా గ్రామం నుంచి వెళ్లిపోయాడు. ఇదిలా ఉంటే.. తన కుమారుడిని తమకు అప్పగించాలంటే ఓ మఠం వారు పదకొండు లక్షలు డిమాండ్ చేశారని.. అంత డబ్బు తన వద్ద లేదని రింకూ తండ్రి రతిపాల్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి