P Venkatesh
తల్లికి ప్రేమను పంచాల్సింది పోయి కర్కశంగా ప్రవర్తించాడు ఓ ప్రబుద్దుడు. కనిపెంచిన తల్లికి నరకం చూపించాడు. కరెంటు స్థంబానికి కట్టేసి కనికరం లేకుండా చావబాదాడు. ఈ హృదయాలను కదిలించే ఈ ఘటన ప్రతి ఒక్కరి కంట కన్నీరు తెప్పిస్తుంది.
తల్లికి ప్రేమను పంచాల్సింది పోయి కర్కశంగా ప్రవర్తించాడు ఓ ప్రబుద్దుడు. కనిపెంచిన తల్లికి నరకం చూపించాడు. కరెంటు స్థంబానికి కట్టేసి కనికరం లేకుండా చావబాదాడు. ఈ హృదయాలను కదిలించే ఈ ఘటన ప్రతి ఒక్కరి కంట కన్నీరు తెప్పిస్తుంది.
P Venkatesh
సృష్టికి దైవం అమ్మ. ఎన్ని జన్మలెత్తిన తల్లి రుణం తీర్చుకోలేనిది. నవ మాసాలు మోసి, పురిటి నొప్పుల బాధను భరించి బిడ్డను కని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. బిడ్డే లోకంగా జీవిస్తుంది. తాను పస్తులుండి కూడా బిడ్డల కడుపు నింపుతుంది. వారికి ఏ చిన్న ఆపద వచ్చినా కూడా విలవిల్లాడిపోతుంది. బిడ్డల భవిష్యత్తుకై ఆరాటపడుతుంది. కాయాకష్టం చేసి పిల్లలను పోషించుకుని వారిని ప్రయోజకులను చేసేంత వరకు అలుపెరుగని పోరాటం చేస్తుంది. అంతటి త్యాగమూర్తి పట్ల కొందరు వ్యక్తులు మూర్ఖంగా అతికిరాతకంగా వ్యవహరిస్తున్నారు. ఇదే రీతిలో ఓ రాష్ట్రంలో కన్న తల్లిని సొంత కొడుకు స్థంబానికి కట్టేసి కొట్టిన ఘటన వెలుగు చూసింది.
వంశోద్దారకుడు కావాలని తల్లిదండ్రులు తిరగని గుడి మొక్కని దేవుడంటూ ఉండడు. కొడుకు పుట్టాలని అంతలా పరితపిస్తుంటారు. ఎందుకంటే అవసాన దశలో తమ ఆలనా పాలనా చూస్తారని భావిస్తారు. అంతేగాక తమను పున్నామ నరకం నుంచి తప్పిస్తారని తల్లిదండ్రుల ప్రగాఢ విశ్వాసం. కానీ ఇక్కడ పున్నామ నరకం దేవుడెరుగు బ్రతికుండగానే కన్న తల్లికి నరకం చూపించాడు ఆమె కొడుకు. వృద్ధాప్యంలో ఉన్న ఆ మాతృమూర్తిని అతి కిరాతకంగా హింసించాడు. సభ్య సమాజం తలదించుకునేలా మానవత్వం మరిచి స్థంబానికి కట్టేసి చిత్ర హింసలు పెడుతూ భౌతిక దాడికి పాల్పడ్డాడు. మనసుల్ని కదిలించే ఈ ఘటన ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్ లో చోటుచేసుకుంది. తల్లి పట్ల కర్కశంగా ప్రవర్తించిన ఆ కసాయి కొడుకుపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భువనేశ్వర్ లోని కియోంఝార్ జిల్లా సరసపాసి గ్రామంలో ఓ 70 ఏండ్ల వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తోంది. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారికి వివాహాలు కాగా వ్యవసాయం చేసుకుంటూ వేర్వేరుగా జీవిస్తున్నారు. కాగా చిన్న కొడుకు కాలీఫ్లవర్ పంటను సాగు చేస్తున్నారు. అయితే కూర వండుకునేందుకు ఆ తల్లి కొడుకు వేసిన ఆ పంట నుంచి ఓ కాలిఫ్లవర్ ను తెంపుకొచ్చింది. ఇది చూసిన కొడుకు తన తన అనుమతి లేకుండా కాలీఫ్లవర్ ఎందుకు తెంపావని దుర్భాషలాడుతూ తల్లిని నిలదీశాడు. అంతటితో ఆగకుండా ఆ వృద్ధురాలిని స్తంభానికి కట్టేసి తీవ్రంగా కొట్టాడు. తల్లే ప్రత్యక్ష దైవంగా భావించాల్సిందిపోయి ప్రత్యక్ష నరకాన్ని చూపించాడు ఆ కసాయి కొడుకు.
కొడుకు పెట్టే చిత్రహింసల నుంచి ఆ కన్నతల్లిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించారు. వారిపై కూడా దాడి చేసేందుకు పూనుకున్నాడు. అతి కష్టం మీద ఆ మూర్ఖపు కొడుకు నుంచి ఆమెను ప్రాణాలతో రక్షించారు. వెంటనే ఆ వృద్ధురాలని బసుదేవ్‌పూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ఆ తర్వాత స్థానిక పోలీస్ లకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే బాధితురాలి చెంతకు చేరుకుని ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. తల్లిపట్ల కర్కశంగా వ్యవహరించిన ఆ కసాయి కొడుకుపై కేసు నమోదు చేశారు. మరి తల్లి పట్ల క్రూరంగా ప్రవర్తించి స్థంబానికి కట్టేసి కొట్టిన కొడుకుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.