iDreamPost

Odisha Assembly: అందతో పాటు రాజకీయాల్లో ఈమె ఓ సంచలనం.. ఎవరో తెలుసా?

ఇటీవల ఒడిశాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓ మహిళ అరుదైన రికార్టును క్రియేట్ చేసింది. అంతేకాక ఆ రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలోనే నిల్చిపోయే ఘనత ఆమె తన ఖాతలో వేసుకుంది. అందంతో పాటు ఆమె రాజకీయాల్లో సంచలనంగా మారింది.

ఇటీవల ఒడిశాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓ మహిళ అరుదైన రికార్టును క్రియేట్ చేసింది. అంతేకాక ఆ రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలోనే నిల్చిపోయే ఘనత ఆమె తన ఖాతలో వేసుకుంది. అందంతో పాటు ఆమె రాజకీయాల్లో సంచలనంగా మారింది.

Odisha Assembly: అందతో పాటు రాజకీయాల్లో ఈమె ఓ సంచలనం.. ఎవరో తెలుసా?

నేటికాలంలో ఎంతో మంది మహిళలు, అమ్మాయిలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నారు. అన్ని రంగాల్లో మగవారికి ధీటుగా పోటీ పడుతున్నారు. అంతేకాక పలు రంగాల్లో తమదైన మార్క్ ను చూపిస్తున్నారు. అలానే రాజకీయ రంగంలో కూడా చాలా మంది యువతులు బాగా రాణిస్తున్నారు. ఇప్పటికే పలువురు మహిళలు పొలిటికల్ సెక్టార్ లో కీలక పాత్ర పోషించారు. అలానే ఇటీవల ఒడిశాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓ మహిళ అరుదైన రికార్టును క్రియేట్ చేసింది. అంతేకాక ఆ రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలోనే నిల్చిపోయే ఘనత ఆమె తన ఖాతలో వేసుకుంది. అందంతో పాటు ఆమె రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇంతకీ ఆ ఆమె ఎవరు.. ఆమె సాధించిన రికార్డులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

ఇటీవల జరిగిన లోక్ సభ సార్వత్రిక ఎన్నికలతో పాటు ఒడిశా రాష్ట్ర అసెంబ్లీ చ‌రిత్ర‌లోనే తొలిసారిగా సోఫియా ఫిర్దౌస్ అనే ముస్లిం మ‌హిళా ఎన్నిక‌య్యారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా క‌ట‌క్ అసెంబ్లీ నుంచి సోఫియా ఫిర్దౌస్ గెలుపొందారు. బీజేపీ అభ్య‌ర్థి పూర్ణ చంద్ర మ‌హాపాత్రపై 8 వేల ఓట్ల మెజార్టీతో ఆమె ఘన విజ‌యం సాధించారు. 32 ఏళ్ల వయస్సు ఉన్న సోఫియా ఫిర్దౌస్ ది రాజకీయ కుటుంబమే. ఆమె తండ్రి మ‌హ్మ‌ద్ మోఖీం.. కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు. అంతేకాక ఒడిశా రాష్ట్ర కాంగ్రెస్ లో కీలక నేత. అయన గత ఎన్నికల వరకు కూడా కటక్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో మహ్మద్ మోఖీం స్థానంలో సోఫియాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. తండ్రి స్థానంలో కూతురు సోఫియాకు కాంగ్రెస్ పార్టీ కటక్ టికెట్ కేటాయించింది.

ఈమె కళింగ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రీయల్ టెక్నాలజీ నుంచి సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అనంతరం బెంగళూరులోని ఐఐఎంబీ నుంచి ఎగ్జిక్యూటీవి జనరల్ మేనేజ్మెంట్ లో ప్రోగ్రామ్ పూర్తి చేశారు. 2022లో ఈ ప్రోగ్రామ్ పూర్తి చేయగా.. 2023లో కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోషియేన్ ఆఫ్ ఇండియా చాప్టర్ కు ప్రెసిడెంట్ గా ఎంపికయ్యారు. క్రెడాయ్ ఉమెన్స్ వింగ్ పశ్చిమ జోన్ కి సమన్వయకర్తగా సోఫియా సేవ‌లందించారు. ఆమె పారిశ్రామికవేత్త షేక్ మెరాజ్ ఉల్ హక్‌ను వివాహం చేసుకుంది. కటక్ నియోజవర్గం నుంచి 1972లో నందిని సత్పాతి విజయం సాధించి..ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారు. ఇప్పుడు తాజాగా ఆమె అడుగు జాడల్లో సోఫియా నడుస్తోంది. మొత్తంగా ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికల తొలి ముస్లిం మహిళగా సోఫియా చరిత్ర సృష్టించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి