iDreamPost
android-app
ios-app

బీజెపీకి షాక్.. 25 ఏళ్ల పాటు చేసిన సేవలకు నటి గౌతమి స్వస్థి

వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండగా.. ప్రస్తుతం పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు షురూ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలను ఆకర్షించేందుకు సినీ స్టార్స్ ను రంగంలోకి దింపుతున్నారు ఆయా పార్టీల నేతలు. ఈ సమయంలో బీజెపీకి బిగ్ షాక్ ఇచ్చింది సీనియర్ నటి.

వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండగా.. ప్రస్తుతం పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు షురూ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలను ఆకర్షించేందుకు సినీ స్టార్స్ ను రంగంలోకి దింపుతున్నారు ఆయా పార్టీల నేతలు. ఈ సమయంలో బీజెపీకి బిగ్ షాక్ ఇచ్చింది సీనియర్ నటి.

బీజెపీకి షాక్.. 25 ఏళ్ల పాటు చేసిన సేవలకు నటి గౌతమి స్వస్థి

ఉత్తరాదితో పాటు దక్షిణాదిలో కూడా పాగా వేయాలని గట్టిగా ప్రయత్నిస్తోంది కేంద్రంలోని అధికారంలో ఉన్న బీజెపీ. తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ అధికారంలోకి వచ్చేందుకు తల మునకలై ఉంది. తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల్లో జరగనున్న శాసన సభ ఎన్నికల్లో విజయ కేతనం ఎగురవేయాలని ప్రయత్నాలు ముమ్మురం చేసింది. ఈ ఎన్నికలు వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్ లాంటివి. ఎన్నికలు జరుగుతున్న ఆయా రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపిక, మ్యానిఫెస్టోల విడుదల చేయడంలో బిజీ బిజీగా మారింది కమల దళం. ఇటువంటి సమయంలో బీజెపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ప్రముఖ నటి కమలం పార్టీకి రాజీనామా చేసింది.

సీనియర్ నటి గౌతమి బీజెపీకి వీడ్కోలు పలికారు. పాతికేళ్లకు పైగా ఆమె పార్టీలో కొనసాగడం గమనార్హం. అయితే పార్టీని వీడేందుకు పలు కారణాలు ఆమె వెల్లడించారు. పార్టీ నుండి తనకు ఎటువంటి సహకారం లభించడం లేదని, ఆర్థిక లావాదేవీల విషయంలో తనను మోసం చేసిన వ్యక్తికి కొంత మంది సీనియర్ నేతలు అండగా నిలిచినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ ఇస్తానని హామీనిచ్చి, చివరి నిమిషంలో మొండి చెయ్యి చూపించినట్లు పేర్కొన్నారు. గతంలో స్థిరాస్తుల విషయంలో అళగప్పన్ అనే వ్యక్తి తనను మోసం చేశారంటూ ఫిర్యాదు చేసిన సంగతి విదితమే.

తాను 17 ఏళ్లకే పరిశ్రమలోకి వచ్చేశానని, 37 ఏళ్ల నా కెరీర్‌లో కష్టపడి సంపాదించి, ఆర్థికంగా బలపడ్డానని, తన కూతురు భవిష్యత్తు కోసం దాచానని, కానీ అళగప్పన్ తమను భయపెట్టాడని అన్నారు.తనను మోసం చేసిన వ్యక్తిపై కేసులు నమోదవ్వగా.. అతడు తప్పించుకు తిరిగేలా పార్టీలోని కొంత మంది సీనియర్ నేతలు సాయం చేస్తున్నారన్నారు. 2021 తమిళనాడు ఎన్నికల్లో రాజపాళయం నుండి అవకాశం ఇస్తామని చెప్పి.. చివరి నిమిషంలో మొండి చేయి చూపించారని, అయినప్పటికీ పార్టీ పట్ల నిబద్ధతతో వ్యవహరించినట్లు తెలిపారు. పాతికేళ్లు పార్టీకి సేవ చేసినా.. తనకు మద్దతు కరువైందని అన్నారు. నిరాశతో పార్టీకి రాజీనామా చేస్తున్నానని, తనకు న్యాయం చేస్తారన్న నమ్మకం తమిళనాడు సీఎం స్టాలిన్, పోలీసు, న్యాయ వ్యవస్థపై ఉందని అన్నారు.