iDreamPost
android-app
ios-app

ఆ కోట్ల రూపాయల డబ్బంతా పేదలకే పంచుతాం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

  • Published May 17, 2024 | 8:05 PM Updated Updated May 17, 2024 | 8:05 PM

భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పేదల కోసం ఆలోచించి కీలక నిర్ణయం తీసుకున్నామని అన్నారు. వందల, వేల కోట్ల రూపాయల సొమ్ముని పేద ప్రజలకే పంచుతామని అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పేదల కోసం ఆలోచించి కీలక నిర్ణయం తీసుకున్నామని అన్నారు. వందల, వేల కోట్ల రూపాయల సొమ్ముని పేద ప్రజలకే పంచుతామని అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆ కోట్ల రూపాయల డబ్బంతా పేదలకే పంచుతాం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొందరు, పన్నులు చెల్లించకుండా బ్లాక్ మనీని పోగుజేసుకునేవారు  కొందరు.. ఇలా దేశంలో చాలా మంది చట్టం కళ్ళు గప్పి వందల, వేల కోట్లు దోచేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో వంద కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలతో పలువురు రాజకీయ నేతలను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి అవినీతి కేసుల్లో పట్టుబడ్డ అవినీతి సొమ్ముని ఏం చేస్తారు? స్వాధీనం చేసుకున్న వందల కోట్ల డబ్బుని దేని కోసం ఖర్చు పెడతారు? ఈడీ, సీబీఐ సోదాల్లో దొరికిన డబ్బుని ఏం చేస్తారు? అనే ప్రశ్నలకు ప్రధాని నరేంద్ర మోదీ సమాధానమిచ్చారు.  

గత కొంతకాలంగా ఈడీ పేరు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. దేశంలో పెద్ద పార్టీల నేతల ఇళ్ళలో, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించి గుట్టలు గుట్టలుగా పడున్న వందల కోట్ల రూపాయలను ఈడీ స్వాధీనం చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఈడీని అడ్డుకుపెట్టుకుని తమపై మీద ప్రతీకారం తీర్చుకుంటుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈడీ సోదాల్లో దొరికిన కోట్ల రూపాయల డబ్బుని ఏం చేస్తారన్న ప్రశ్నకు ప్రధాని మోదీ జవాబిచ్చారు. ఇటీవల జాతీయ మీడియాకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈడీ సోదాలకు సంబంధించి వస్తున్న విమర్శలపై స్పందించారు. కేవలం ప్రతిపక్ష నేతలను మాత్రమే టార్గెట్ చేస్తున్నారని.. కేంద్ర ప్రభుత్వం ఈడీని దుర్వినియోగం చేస్తుందని ఆరోపణలు చేస్తున్నారు.

అయితే దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు. 2014కి ముందు కేంద్ర దర్యాప్తు సంస్థలు సరిగా పని చేసేవి కాదని.. యూజ్ లెస్ గా ఉండేవని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలకు స్వేచ్ఛ, స్వాతంత్య్రం వచ్చాయని అన్నారు. 2014 తర్వాత నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థలు పూర్తిగా స్వేచ్ఛగా, సమర్థవంతంగా పని చేస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. మరి ఈడీ, సీబీఐ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్న డబ్బుని ఏం చేస్తారు అన్న ప్రశ్నకు కూడా మోదీ స్పందించారు.

అధికారాన్ని అడ్డు పెట్టుకుని కొందరు నేతలు అక్రమంగా దోచుకున్న డబ్బుని కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేసి సీజ్ చేస్తాయని మోదీ అన్నారు. అయితే ఈ అక్రమ సొమ్ముని దేశంలో పేద ప్రజలకు చేర్చాలన్న ఆలోచనలో ఉన్నట్లు ప్రధాని వెల్లడించారు. దీని కోసం ప్రణాళికలు రచిస్తున్నామని.. ఈ ప్రక్రియ కోసం న్యాయ సలహా కోరామని అన్నారు. వారు ఇచ్చిన సలహాలు, సూచనల మేరకు పేదలకు డబ్బుని ఎలా చేర్చాలో అన్న నిర్ణయం తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.