P Krishna
School Bus Overturned: దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఎన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తున్నా.. డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.
School Bus Overturned: దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఎన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తున్నా.. డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.
P Krishna
ఇటీవల దేశ వ్యాప్తంగా పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంటి నుంచి బయటికి వచ్చన వాళ్లు తిరిగి ఇంటికి క్షేమంగా వెళ్తామా? లేదా? అన్న భయం నెలకొంది. డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం కారణంగా ఎంతోమంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాలు నిండుకుంటున్నాయి. అతి వేగం, నిద్ర మత్తు, అవగాహన లేమి, మద్యం సేవించి వాహనాలు నడపడం ఇలా ఎన్నో కారణాల వల్ల నిత్యం ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని అధికారలు అంటున్నారు. హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు చిన్నారు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే..
హర్యానాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నార్నాల్ జిల్లా మహేంద్రగఢ్ లో పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ విద్యార్థులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థులను తీసుకు వెళ్తున్న స్కూల్ బస్సు మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపు తప్పి బోల్తా పడినట్లు ప్రాథమికంగా తెలిసిందని వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులు 40 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం.
ప్రమాదానికి గురైన బస్సు జీఎల్ పబ్లిక్ స్కూల్ కు చెందినదిగా అధికారులు గుర్తించారు. రంజాన్ పండుగ వేళ సెలవు ఇవ్వకుండా స్కూల్ నిర్వహించడంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఉదయం విద్యార్థులను తీసుకువెళ్తున్న బస్సు స్కూల్ దగ్గరకు చేరుకునే సమయంలో ఉన్హాని గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న స్కూల్ యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడకు చేరుకున్నారు. చనిపోయిన తమ పిల్లలను చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. మరోవైపు గాయ పడ్డ తమ పిల్లల కోసం ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. దీంతో ఆ ప్రాంతం అంతా విషాదఛాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉంటే స్థానికులు సమాచారం మేరకు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు చెబుతున్నారు. ఆరు సంవత్సరాల క్రితం అంటే 2018 లో బస్సు ఫిట్ నెస్ సర్టిఫికెట్ గుడువు ముగిసిందంని అధికారలు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
VIDEO | Several children were injured when a school bus carrying them overturned in Haryana’s #Narnaul earlier today. More details are awaited.
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/mkaLfTAgpd
— Press Trust of India (@PTI_News) April 11, 2024