P Venkatesh
P Venkatesh
ఇటీవల చంద్రయన్-3 సక్సెస్ తో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిన భారత్ మరో ప్రయోగానికి సిద్ధమైంది. చంద్రుడిపై అధ్యయనం చేసేందుకు జూలై 14 ఇస్రో చంద్రయాన్ -3 ని ప్రయోగించిన విషయం తెలిసిందే. అన్ని దశలను విజయవంతంగా దాటుకుని సుదీర్ఘకాలం ప్రయాణించి చంద్రుడి దక్షిణ దృవంపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండ్ అవడంతో భారత్ కొత్త చరిత్రను సృష్టించింది. జాబిల్లి దక్షిణ దృవంపై కాలుమోపిన మొదటి దేశంగా భారత్ రికార్డ్ సృష్టించింది. ఆ సక్సెస్ తో మరింత ఉత్సాహంతో ఉన్న ఇస్రో సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఆదిత్య ఎల్1 మిషన్ ను చేపట్టింది. సౌరవ్యవస్థ పుట్టుక, మానవాళికి కలిగే ప్రయోజనాలపై అధ్యయనం చేయనుంది. తాజాగా ఇస్రో మరో ప్రయోగానికి సిద్దమైంది. సముద్రాన్వేషణ కోసం మానవసహిత మిషన్ ను చేపట్టనుంది.
సముద్ర గర్భాన్ని అన్వేషించేందుకు భారత్ సముద్రయాన్ ను ప్రయోగించనుంది. తొలిసారి మానవసహిత మిషన్ ను ప్రయోగించబోతోంది. సముద్రయాన్ నౌకను చెన్నైలోని నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అభివద్ది చేస్తోంది. ఈ ప్రయోగం ముఖ్య ఉద్దేశ్యం సముద్ర గర్బంలో ఉన్న ఖనిజాలు, లోహాలు అక్కడ ఉన్నటువంటి వనరులపై శోధించనుంది. మానవసహిత సబ్ మెర్సిబుల్ ‘మత్య్స 6000’ సముద్రంలో 6000 మీటర్ల లోతుకు వెళ్లి పరిశోధనలు చేయనుంది. అయితే ప్రయోగం ప్రారంభంలో సముద్ర గర్భంలో 500 మీటర్ల లోతు వరకే ప్రయాణం చేయనుంది. భారతదేశపు మొట్టమొదటి మానవసహిత సముద్రయాన్ నౌకలో ముగ్గురు వ్యక్తులను ఆరు కిలోమీటర్ల నీటి లోతుకు వెళ్లే విధంగా రూపొందిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.