Keerthi
చాలామంది వాహనదారులకు కారు డ్రైవింగ్ చేస్తునే వీడియో తీసే చెడు అలవాటు ఎక్కువగా ఉంది. దీని వల్ల అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆర్టిఓ కొత్త రూల్స్ ను జారీ చేసింది. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చాలామంది వాహనదారులకు కారు డ్రైవింగ్ చేస్తునే వీడియో తీసే చెడు అలవాటు ఎక్కువగా ఉంది. దీని వల్ల అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆర్టిఓ కొత్త రూల్స్ ను జారీ చేసింది. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Keerthi
ఈ మధ్య కాలంలో చాలామంది సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకునేందుకు రకరకాల విన్యసాలు చేస్తున్నారు. ముఖ్యంగా వాహనదారులు కారులో డ్రైవింగ్ చేస్తునే యూట్యూబ్ , ఇన్ స్టా వంటి సోషల్ మీడియాల ఫ్లాట్ ఫామ్స్ లో రీల్స్ , వీడియోలను చేస్తూ తెగ ఫేమస్ అవతున్నారు. కానీ, ఇలా చేయడం వలన కొంతమంది ప్రమాదాలకు గురై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అలాగే కొందరు ప్రాణాలు పొగొట్టుకునే ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే.. ఇలా డ్రైవింగ్ చేసినప్పుడు చేసినప్పుడు రీల్స్, వీడియోస్ చేయడం చాలా ప్రమాదకరం. ముఖ్యంగా డ్రైవింగ్ మీద ఫోకస్ పోతుంది. కనుక ఇలా డ్రైవింగ్ చేస్తూ వీడియో లు తీయడం నిషిద్ధమని తాజాగా ఆర్టిఓ కొత్త రూల్స్ ను జారీ చేసింది. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
చాలామందికి కారు డ్రైవింగ్ చేస్తునే వీడియో తీసే చెడు అలవాటు ఎక్కువగా ఉంది. కానీ ఇలా చేయడం వలన ఎన్నో ప్రమాదాలు మన కళ్లముందే జరుగుతున్నాయి. కనుక ఇలా వీడియోలు తీస్తూ డ్రైవింగ్ చేసినప్పుడు అందరి దృష్టి రోడ్డు పై ఉండాలి కానీ, ఇతర వస్తువులపై కాదంటూ ఈ తరహా పద్ధతిని తాజాగా ఆర్టీఓ నిషేధించింది. అంతేకాకుండా.. ఇలా డ్రైవింగ్ చేసి వీడియోలు తీస్తే భారీ జరిమానా తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేస్తామని, అలాగే ఇతర చట్టపరమైన చర్యలు తీసుకుంటమని తెలిపింది. ఈ మేరకు తాజాగా కేరళ హైకోర్టు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే కోర్టు ఆదేశాల మేరకు.. క్యాబిన్ లో బ్లాగింగ్, మొబైల్ లో వీడియో రికార్డింగ్ వంటి పనులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా.. వాహనాలను మితిమీరి మోడిఫికేషన్ చేయడంపై వాహన యజమానులకు కోర్టు పేర్కొంది.
అలాగే మోటారు వాహనాల చట్టం ప్రకారం.. కొత్త వాహనం కొనుగోలు చేసిన తర్వాత మార్కెట్‌లో మార్పులు చేయడం చట్టవిరుద్ధమని హైకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. పైగా మీ వాహనాలను సీజ్ చేస్తే జరిమానాలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే సైలెన్సర్‌లను వివిధ మార్గాల్లో ఉపయోగించడం వల్ల శబ్ద కాలుష్యం వస్తుందని, పైగా ఇలా ఎప్పుడైనా కారులో వీడియోలు తీస్తూ పోలీసులకు పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు. కాగా, రానున్నా రోజుల్లో ఈ చట్టం కర్ణాటకలో కూడా అమలులోకి వస్తుందని చెప్పవచ్చు. మరి, సొంత కారు ఉన్న వాహనాదారులకు ఆర్టిఓ పెట్టిన ఈ కొత్త రూల్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.