iDreamPost
android-app
ios-app

ఇళ్లు నిర్మించుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్.. 30 లక్షల సాయం! ఎలా అంటే!

Pradhan Mantri Awas Yojana: కేంద్ర ప్రభుత్వం బడుగు, బలహీన, నిరుపేద వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అనేక స్కీమ్స్ ను ప్రవేశ పెట్టింది. ఈ క్రమంలోనే సొంతింటిని నిర్మించుకునే వారి కోసం రూ.30 లక్షలు సాయం అందిస్తుంది.

Pradhan Mantri Awas Yojana: కేంద్ర ప్రభుత్వం బడుగు, బలహీన, నిరుపేద వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అనేక స్కీమ్స్ ను ప్రవేశ పెట్టింది. ఈ క్రమంలోనే సొంతింటిని నిర్మించుకునే వారి కోసం రూ.30 లక్షలు సాయం అందిస్తుంది.

ఇళ్లు నిర్మించుకునే వారికి కేంద్రం గుడ్ న్యూస్.. 30 లక్షల సాయం! ఎలా అంటే!

ప్రతి ఒక్కరి సొంత ఇళ్లు ఉండాలనే కల ఉంటుంది. ముఖ్యంగా పేద కుటుంబాల వాళ్లు, దిగువ మధ్యతరగతి వాళ్లు ఇల్లు కట్టుకోవాలని ఎన్నో కలలు కంటారు. అయితే రేయింబవళ్లు కష్టపడిన కొందరు మాత్రమే సొంత ఇంటి కలను నిరవేర్చుకుంటున్నారు. మరికొందరి కల..కలగానే మిగిలిపోతుంది. ఇలాంటి నేపథ్యంలోనే నిరుపేదలకు సొంత ఇల్లు ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సర్కార్ పీఎం ఆవాస్ యోజనను అమలు చేసింది. ఈ స్కీమ్ కింద ఇళ్లు కట్టుకునే వారికి 30 లక్షలు సాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందించనుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

కేంద్ర ప్రభుత్వం బడుగు, బలహీన, నిరుపేద వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అనేక స్కీమ్స్ ను ప్రవేశ పెట్టింది. ముఖ్యంగా నిరుపేదలు సొంతింటిని కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన్ అనే పథకానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2015లో ప్రారంభమైంది. ఈ పథకం కింద ఇప్పటివరకు మొత్తం 20 మిలియన్ల ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ పథకం 2024 చివరి వరకు పొడిగించబడింది. ఈ స్కీమ్ పేద మరియు మధ్యతరగతి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది.

ఈ స్కీమ్ కింద నూతనగా ఇల్లు కట్టుకునే పేదలకు ఒక్కొక్కరికి రూ.30 లక్షలు అందజేస్తారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రధాని కాగానే ఈ పథకాన్ని  ప్రారంభించారు. స్వయం ఉపాధి, దుకాణదారులు, చిరు వ్యాపారులు సొంతంగా ఇళ్లు నిర్మించుకునేందుకు స్కీమ్ కింద సహాయం అందజేస్తారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద రూ.35 లక్షల ఇంటిపై సబ్సిడీ రుణాన్ని రూ.30 లక్షలకు కేంద్రం పెంచింది. ఈ రుణం సుమారు 20 ఏళ్ల కాలానికి అందుబాటులో ఉంటుంది. అంతేకాక సబ్సిడీ రూపంలో రూ. 2.67 లక్షల వడ్డీని ఆదా చేసుకోవచ్చు.

ఈ స్కీమ్ కేవలం రూరల్ ఏరియాలోనే కాకుండా మెట్రో, నాన్-మెట్రో నగరాల్లో కూడా 35 లక్షల వరకు ఇల్లు కొనుగోలు చేయవచ్చు. అందులో 30 లక్షల రూపాయల ఇంటి రుణం లభిస్తుంది. అయితే ఈ 30 లక్షలు సాయం పొందేందుకు కొన్ని అర్హతలు ఉండాలి. లబ్ధిదారుల ఆదాయం రూ. 18 లక్షల దాటితే, 12 లక్షల రూపాయలను హోమ్ లోన్ పొందవచ్చు. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం పీఎం ఆవాస్‌ పథకాన్ని విస్తరిస్తున్నట్లు ప్రకటించింది.

పీఎం అవాస్ యోజన్ కోసం దరఖాస్తును ఇంట్లో నుంచి సమర్పించవచ్చు. అలానే జనసేవ కేంద్రం, గ్రామ సేవక్ ల ద్వారా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. కానీ 2024లో దరఖాస్తు చేసుకోవడానికి ఆన్‌లైన్ ఫారమ్ ఇంకా ప్రారంభం కాలేదని తెలుస్తోంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కోసం కొన్ని పత్రాలు అవసరం అవుతాయి. ఆధార్ కార్డు, పాస్ పోర్టు, ఫోటో జాబ్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, స్వచ్ఛ భారత్ మిషన్ రిజిస్ట్రేషన్ నంబర్, ఉపయోగంలో ఉన్న ఫోన్ నెంబర్, ఇన్ కమ్ సర్టిఫికేట్ ఉండాలి.  అలానే 18 ఏళ్లు పైబడిన వాళ్లు, తప్పనిసరిగా భారతదేశ నివాసం ఉన్న వాళ్లు ఈ స్కీమ్ కి అర్హులు. దరఖాస్తుదారు వార్షిక ఆదాయం రూ. 300000 నుండి రూ. 6 లక్షల మధ్య ఉండాలి. రేషన్ కార్డు బిపిఎల్ జాబితాలో పేరు ఉండాలి. పై అర్హతలు ఉన్నా వారికి పీఎం ఆవాస్ యోజన ద్వారా కొత్త ఇళ్లకు పీఎం నరేంద్ర మోదీ ప్రభుత్వం నుంచి 30 లక్షల రూపాయలు  పొందవచ్చు. మరి.. ఈ స్కీమ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.