Venkateswarlu
Venkateswarlu
సామాన్య ప్రజల్ని రక్షించాల్సిన కొంతమంది పోలీసులే దారుణానికి తెగబడుతున్నారు. పోలీసులు సాధారణ ప్రజలపై దాడులకు పాల్పడుతున్న సంఘటన నిత్యం దేశ వ్యాప్తంగా చాలానే చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, ఓ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ బాలుడిపై రెచ్చిపోయాడు. బాలుడ్ని కింద పడేసి కాలితో తన్నాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఓ రైల్వే స్టేషన్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో బాల్తారా రోడ్ రైల్వే స్టేషన్ ఉంది.
ఈ రైల్వే స్టేషన్‌లో బలెందర్ సింగ్ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం ఈ బలెందర్ సింగ్ ఓ మైనర్ బాలుడిపై దాడికి పాల్పడ్డాడు. అతడ్ని కిందపడేసి దారుణంగా కొట్టాడు. కాలితో తొక్కుతూ అతి క్రూరంగా ప్రవర్తించాడు. అక్కడున్న వాళ్లు ఎంత బతిమాలినా కూడా అతడు వినలేదు. తన కోపం చల్లారిన తర్వాత అక్కడినుంచి వెళ్లిపోయాడు. సదరు కానిస్టేబుల్.. బాలుడ్ని కొడుతున్న దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు.
ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన ఆ వీడియో అధికారుల దృష్టికి వెళ్లింది. అధికారులు ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. దాడికి పాల్పడ్డ బలెందర్ సింగ్‌ను విధుల నుంచి తొలగించారు. ఇక, వైరల్‌గా మారిన వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘‘ బాల్తారా రోడ్ రైల్వే స్టేషన్‌లో ఇది రెండో ఘటన. ఆ పోలీస్‌లపై చర్యలు తీసుకోవాలి’’..‘‘ పోలీసులు ఈ మధ్య కాలంలో చాలా దారుణంగా తయారు అయ్యారు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Uttar Pradesh: A RPF constable was caught on camera kicking a minor at Belthra Road railway station of Ballia district. pic.twitter.com/UVSiuSGM8Y
— TOI Lucknow News (@TOILucknow) July 16, 2023