వీడియో: రెస్టారెంట్ లో కుళ్లిపోయిన ఫుడ్ పార్శిల్! కస్టమర్ చేసిన పని సూపర్!

Uttar Pradesh: ఈ మధ్యకాలంలో కొన్ని రెస్టారెంట్లు, హోటళ్లు వినియోగదారులకు షాకిస్తున్నాయి. ఫుడ్ నాణ్యతను మర్చి..ఇష్టమెచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ కస్టమర్ కి కుళ్లిపోయిన ఫుడ్ ను పార్శిల్ చేసి ఇచ్చారు. దీంతో సదరు వ్యక్తి వారికి అదిరిపోయే సమాధానం ఇచ్చాడు.

Uttar Pradesh: ఈ మధ్యకాలంలో కొన్ని రెస్టారెంట్లు, హోటళ్లు వినియోగదారులకు షాకిస్తున్నాయి. ఫుడ్ నాణ్యతను మర్చి..ఇష్టమెచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఓ కస్టమర్ కి కుళ్లిపోయిన ఫుడ్ ను పార్శిల్ చేసి ఇచ్చారు. దీంతో సదరు వ్యక్తి వారికి అదిరిపోయే సమాధానం ఇచ్చాడు.

ఇటీవల కాలంలో బయట ఫుడ్ తిన్నాలంటే ఒకటికి వందసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. నాణ్యమైన ఆహారం సరఫరా చేయడం మానేసి..డబ్బులో పరమావధిగా అన్నట్లు కొందరు వ్యాపారస్తులు ప్రవర్తిస్తున్నారు. ఇటీవల కాలంలో ఆహారంలో నాణ్యత లోపం బయట పడుతూ అనేక ఘటనలు జరిగాయి. ముఖ్యంగా కొన్ని హోటళ్లు, రెస్టారెంట్ల వాళ్లు పాడైనా ఫుడ్ ను  పార్శిల్ ఇవ్వడం, కస్టమర్ కి సప్లయ్ చేయడం చేస్తున్నారు. తాజాగా ఓ రెస్టారెంట్ సిబ్బంది కూడా అలానే దారుణంగా ప్రవర్తించారు. దీంతో కస్టమర్ వారికి షాకిచ్చాడు. ఈఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఈ మధ్యకాలంలో కొన్ని హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాకాలు బయటపడుతున్నాయి. నాణ్యతలేని ఆహారాన్ని వినియోగదారులకు సప్లయ్ చేస్తూ.. వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి హోటళ్లు, రెస్టారెంట్లపై తనిఖీలు చేపట్టింది. నాణ్యత పాటించని వాటికి నోటీసులు జారీ చేసింది. అంతేకాక మరికొన్ని హోటళ్లను, సూపర్ మార్కెట్లను సీజ్ చేసింది. ఇది ఇలాంటే వినియోగదారులు ఆన్ లైన్ లో లేదా నేరుగా ఫుడ్ ఆర్డర్ విషయంలో కూడా దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ లో బొద్దింకలు, పురుగులు వంటివి వస్తున్నాయి. మరికొన్ని సందర్భాల్లో బిర్యానీ ఆర్డర్ చేస్తే..కుళ్లిపోయిన చికెన్ వస్తుంది. దీంతో షాకవ్వడం వినియోగదారుడి వంతుగా మారుతుంది.

ఇలా ఆన్ లైన్ లో అంటే..కస్టమర్ దగ్గర లేడు కదా అలా చేశారని అనుకోవచ్చు. కానీ ఉత్తర్ ప్రదేశ్ లోని వారణాసిలో ఏకంగా కస్టమర్ ఉండగానే కుళ్లిపోయిన ఆహారాన్ని పార్శిల్ గా ఇచ్చే ప్రయత్నం చేశారు. దీంతో వారికి సదరు వినియోగదారు గట్టి షాకిచ్చాడు. పాడైన ఆహారం పార్శిల్ చేసిన రెస్టారెంట్ సిబ్బందిపై కస్టమర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని ఓ రెస్టారెంట్ లో ఘటన చోటుచేసుకుంది. ఇక ఆసిబ్బంది చేసిన తప్పును కవర్ చేసే ప్రయత్నం చేశారు. అయితే అక్కడి నుంచి సెలెంట్ గా వెళ్లిపోయిన కస్టమర్ … ఆ రెస్టారెంట్ పై ఫుడ్ సెఫ్టీ అధికారులుకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలా పుడ్ విషయంలో నాణ్యత పాటించని వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments