iDreamPost
android-app
ios-app

NEET రిజల్ట్స్ వచ్చేశాయ్.. ఇలా చెక్ చేసుకోండి

  • Published Jun 04, 2024 | 10:00 PM Updated Updated Jun 04, 2024 | 10:00 PM

వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్ పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ నీట్ ఫలితాలను విడుదల చేసింది.

వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్ పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ నీట్ ఫలితాలను విడుదల చేసింది.

NEET రిజల్ట్స్ వచ్చేశాయ్.. ఇలా చెక్ చేసుకోండి

వైద్యో నారాయణ హరి అన్నారు పెద్దలు. వైద్యులను దైవసమానులుగా భావిస్తారు. జబ్బు చేసిన వారికి పునర్జన్మనిచ్చి ప్రాణాలను కాపాడే డాక్టర్లకు సమాజంలో ఎంతో గౌరవం ఉంటుంది. అయితే ఇంతటి ప్రాముఖ్యత కలిగి వైద్య విద్యను అభ్యసించాలని యువత కోరుకుంటుంది. వైద్య విద్యనభ్యసించి పేద వారికి వైద్య సేవలందించాలని తహతహలాడుతుంటారు. ఇందుకోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిర్వహించే ఎంట్రెన్స్ పరీక్షలను రాస్తుంటారు విద్యార్థులు. వైద్య విద్య కోసం దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ పరీక్షను నిర్వహిస్తారు. తాజాగా ఇటీవల జరిగిన నీట్ పరీక్షకు సంబంధించిన ఫలితాలు వెల్లడయ్యాయి.

నీట్ యూజీ పరీక్ష మే 5, 2024న జరిగింది. తాజాగా నీట్ పరీక్ష ఫలితాలను మంగళవారం నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ విడుదల చేసింది. నీట్ అభ్యర్థులు exams.nta.ac.in/NEETలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చూడొచ్చు. అభ్యర్థులు తమ దరఖాస్తు నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ స్కోర్‌కార్డ్‌లో వారి ఫోటో బార్ కోడ్‌ను చెక్ చేసుకోవాలని ఎన్టీఏ సూచించింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ భారతదేశంలోని 14 నగరాలో 557 కేంద్రాల్లో నిర్వహించారు. 24 లక్షలకు పైగా అభ్యర్థులు నీట్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు.

నీట్ స్కోర్‌కార్డ్‌ పొందేందుకు ఈ స్టెప్స్ ఫాలొకండి:

  • అభ్యర్థులు ముందుగా NTA NEET అధికారిక వెబ్‌సైట్ nta.ac.inకి వెళ్లాలి.
  • ఇప్పుడు హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న NEET 2024 ఫలితాల లింక్ exams.nta.ac.in/NEETపై క్లిక్ చేయండి.
  • తర్వాత లాగిన్ వివరాలను ఇక్కడ నమోదు చేసి సమర్పించండి.
  • ఇప్పుడు మీ స్కోర్‌కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  • రిజల్ట్ చెక్ చేసుకుని పేజీని డౌన్ లోడ్ చేసుకోండి.