iDreamPost
android-app
ios-app

HDFCకి షాకిచ్చిన RBI.. ఆ పనికి చేయడానికి నిరాకరణ!

HDFC, RBI: దేశంలోని అతిపెద్ద బ్యాంకుల్లో హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు ఒకటి. అనేక రకాల సేవలతో వినియోదారులను ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు కి ఓ విషయంలో ఆర్భీఐ షాకిచ్చినట్లు తెలుస్తుంది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

HDFC, RBI: దేశంలోని అతిపెద్ద బ్యాంకుల్లో హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు ఒకటి. అనేక రకాల సేవలతో వినియోదారులను ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు కి ఓ విషయంలో ఆర్భీఐ షాకిచ్చినట్లు తెలుస్తుంది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

HDFCకి షాకిచ్చిన RBI.. ఆ పనికి చేయడానికి నిరాకరణ!

ప్రస్తుతం బ్యాంకింగ్ సేవల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనేక రకాల బ్యాంకలు ఎన్నో రకాల సేవలు అందిస్తున్నాయి. ఇవ్వన్ని రిజర్వర్ బ్యాంకు ఆఫ్ ఇండియా రూల్స్ అనుగుణంగా పని చేస్తుంటాయి. అలాంటి వాటిల్లో హెచ్ డీఎఫ్సీ బ్యాంకు ఒకటి.  కస్టమర్లను ఆకట్టుకునేందుక ఎన్నో రకాల ఆఫర్లను, సేవలను అందిస్తుంది. అయితే తాజాగా హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ కు ఆర్బీఐ నుంచి ఎదురు దెబ్బ తగిలింది. ఆ బ్యాంకు అడిగిన ఓ రిక్వెస్ట్ ను  ఆర్బీఐ నిరాకరించింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

దేశంలోనే అతిపెద్ద బ్యాంకుల్లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ ఒకటి. అయితే ఇప్పటికే అనేక రకాల సేవలను తన వినియోదారులకు అందిస్తోంది.  ఇదే సమయంలో ఆర్‌బీఐ నుంచి హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ కు ఎదురుదెబ్బ తగిలింది. లక్ష కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన సెక్యూరిటీలకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్ హోదా ఇవ్వమని హెచ్ డీఎఫ్.. రిజర్వ్ బ్యాంక్  కి అభ్యర్థించింది. అయితే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అభ్యర్థనను ఆర్బీఐ నిరాకరించింది. ఈటీ నివేదిక ప్రకారం.. ఇటీవల హెచ్‌ డి ఎఫ్‌ సి, హెచ్‌ డి ఎఫ్‌సి బ్యాంకుల విలీనాన్ని ఉటంకిస్తూ బాండ్ల వర్గీకరణ అభ్యర్థనను ఆర్బీఐ తిరస్కరించింది. ఈ బాండ్లను హెచ్ డీ ఎఫ్ సీ లిమిటెడ్ జారీ చేసిందని తెలిపింది. ఆ లిమిటెడ్ ఇప్పుడు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో కలిసిపోయిందని ఆర్బీఐ చెబుతోంది. ఈ కారణంగా బాండ్ల వర్గీకరణకు సాధ్యం కాదు. అందుకే బాండ్ల వర్గీకరణకు సంబంధించి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చేసిన అభ్యర్థనను నెరవేర్చడం సాధ్యం కాదని ఆర్బీఐ తెలిపింది.

నిజానికి హెచ్ డీ ఎఫ్ సీ  బ్యాంకు లోని నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అనే విషయం తెలిసిందే. అయితే ఇది హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకుతో విలీనం జరిగింది. ఈ విలీనం వల్ల హెచ్ డీ ఎఫ్ సీ అనేక రంగాల్లో లాభపడింది. అయితే బాండ్ల విషయంలో మాత్రం ఈ బ్యాంకుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెండు సంస్థల విలీనం తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ దేశంలో అతిపెద్ద బ్యాంక్ గా అవతరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ బ్యాంకు విలువ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు ఎస్‌బీఐ కంటే ఎక్కువగా మారింది.  అయితే అదే విలీనం బాండ్ల విషయంలో మైనస్ గా మారిందని ఆర్థిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

విలీనం కారణంగా హెచ్ డీ ఎఫ్ సీ అభ్యర్థనను ఆర్బీఐ నిరాకరించింది. తాము హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు అభ్యర్థనను తిరస్కరించిన విషయాన్ని ఆర్బీఐ.. సదరు  బ్యాంక్‌కి తెలియజేసిందని ఈటీ నివేదిక పేర్కొంది. ఈ అంశానికి సంబంధించిన మూలాన్ని ఉటంకిస్తూ, నివేదిక పేర్కొంది. ఎన్‌బీఎఫ్‌సీలు, బ్యాంకుల విషయంలో రూల్స్ భిన్నంగా ఉన్నాయని ఆర్బీఐ చెప్పింది. అటువంటి పరిస్థితిలో బాండ్‌ను ఇకపై ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్‌గా వర్గీకరించలేరని ఆర్బీఐ పేర్కొన్నట్లు ఈటీ నివేదిక తెలిపింది.