nagidream
RBI On 2000 Notes: గత ఏడాది ఆర్బీఐ 2 వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 2 వేల నోట్లను మార్చుకోవాల్సిందిగా ప్రజలకు సూచించింది. కానీ ఇప్పటికీ చాలా మంది తమ దగ్గరే 2 వేల నోట్లను దాచిపెట్టుకున్నారు. తాజాగా ఈ విషయంపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది.
RBI On 2000 Notes: గత ఏడాది ఆర్బీఐ 2 వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 2 వేల నోట్లను మార్చుకోవాల్సిందిగా ప్రజలకు సూచించింది. కానీ ఇప్పటికీ చాలా మంది తమ దగ్గరే 2 వేల నోట్లను దాచిపెట్టుకున్నారు. తాజాగా ఈ విషయంపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది.
nagidream
గతంలో 500, 1000 నోట్లను రద్దు చేసిన ఆర్బీఐ.. ఆ తర్వాత కొత్త 200, 500 నోట్లను తీసుకొచ్చింది. ఆ తర్వాత 2 వేల నోట్లను తీసుకొచ్చింది. కొన్ని రోజులకు 2 వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ప్రకటించి ఏడాది గడిచినా ఇప్పటికీ ఎవరి దగ్గరైనా 2 వేల రూపాయల నోట్లు ఉంటే మార్చుకునేందుకు ఆర్బీఐ అవకాశం కల్పిస్తుంది. ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో 2 వేల నోట్లను మార్చుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ చాలా మంది నోట్లను మార్చుకోవడం లేదు. అసలు ఎక్కడ కూడా 2 వేల రూపాయల నోట్లు కనిపించడం లేదు. కానీ ఇంకా 2 వేల రూపాయల నోట్లు వారి దగ్గరే ఉన్నాయంటూ ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది
ప్రజలు వద్ద ఉన్న 2 వేల రూపాయల నోట్లలో 97.82 శాతం కరెన్సీ తిరిగి రిజర్వ్ బ్యాంక్ కి వచ్చాయని ఆర్బీఐ తెలిపింది. మిగతా శాతం అంతా ప్రజల వద్దే ఉందని వెల్లడించింది. రూ. 7,755 కోట్ల విలువ చేసే 2 వేల రూపాయల నోట్లు ఇంకా ప్రజల వద్దే ఉన్నాయని ఆర్బీఐ పేర్కొంది. 2023 మే 19 నుంచి 2 వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. అప్పటికి మార్కెట్లో ఉన్న 2 వేల రూపాయల నోట్ల విలువ రూ. 3.56 లక్షల కోట్లు ఉండగా.. ప్రస్తుతం ఇంకా 7,755 కోట్ల విలువ చేసే 2 వేల నోట్లు రావాల్సి ఉందని ఆర్బీఐ వెల్లడించింది.
2 వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన తర్వాత బ్యాంకుల్లో ఆ 2 వేల నోట్లను డిపాజిట్ చేసేందుకు, మార్చుకునేందుకు నాలుగు నెలల గడువు ఇచ్చింది. ఆ తర్వాత అదనంగా 10 రోజులు గడువు పెంచింది. అయినప్పటికీ ప్రజల వద్ద ఇంకా 7,755 కోట్ల విలువ చేసే 2 వేల రూపాయల నోట్లు ఉన్నాయి. వీటిని మార్చుకోవాల్సిందిగా ఆర్బీఐ సూచించింది. దేశవ్యాప్తంగా ఉన్న 19 ప్రాంతీయ కార్యాలయాల్లో ఈ 2 వేల రూపాయల నోట్లను మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. చలామణిలో 2 వేల నోట్లు లేకపోయినా గానీ ఇప్పటికీ ఆర్బీఐ కార్యాలయానికి 2 వేల నోట్లు వస్తున్నాయని ఆర్బీఐ ప్రకటించింది.