రామేశ్వరం కేఫ్ పేలుడు.. కీలక విషయాలు వెల్లడించిన యజమాని

Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ లో జరిగిన పేలుడులో ఉగ్రకోణం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.. ఈ ఘటనపై కేఫ్ యజమానురాలు కీలక వ్యాఖ్యలు చేశారు.

Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ లో జరిగిన పేలుడులో ఉగ్రకోణం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.. ఈ ఘటనపై కేఫ్ యజమానురాలు కీలక వ్యాఖ్యలు చేశారు.

బెంగుళూరులో శుక్రవారం రామేశ్వరం కేఫ్ లో పేలుడు సంభవించింది.. ఈ ఘటనతో ప్రజలు, అధికారులు ఉలిక్కి పడ్డారు. మొదల ఈ పేలుడు షార్ట్ సర్క్యూట్ లేదా గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల జరిగిందని బావించారు. కానీ పోలీసులు ఎంట్రీ ఇచ్చిన తర్వాత సీన్ మారిపోయింది. సీసీటీవీ ఫుటేజ్ లో కొన్ని సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇది సిలిండర్ పేలుడు కాదని.. పక్కా పథకం ప్రకారం జరిగిన బాంబ్ బ్లాస్టింగ్ అనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా సీఎం సిద్దరామయ్య వెల్లడించారు. ప్రస్తుతం ఈ పేలుడు వ్యవహారంపై ఎన్ఐఏ దర్యాప్తు మొదలు పెట్టింది. తాజాగా ఈ ఘటనపై రామేశ్వరం కేఫ్ యజమానురాలు కీలక విషయాలు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే..

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రామేశ్వరం కేఫ్ బాంబ్ బ్లాస్ కు సంబంధించి మరో కీలక అప్ డేట్ ముందుకు వచ్చింది. అనుమానితుడు ఓ బ్యాగ్ ని రెస్టారెంట్ లో ఉంచేముందు ఒక రవ్వ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చి తీసుకోవడం చూశానని కేఫ్ యజమాని దివ్య రాఘవేంద్రరావు మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘పేలుడు జరిగినపుడు నా మొబైల్ ఫోన్ నా దగ్గర లేదు.. నా మొబైల్ తీసుకున్న తర్వాత అందులో చాలా మిస్ కాల్స్ వచ్చాయి.. సిబ్బంది కేఫ్ లో బాంబ్ బ్లాస్ట్ జరిగినట్లు తెలిపారు. మొదట కిచెన్ లో గ్యాస్ సిలిండర్ పేలి ఉంటుందని అనుకున్నాను.. కానీ వంటగతిలో ఆ ఆనవాళ్లులేవు. దీంతో కస్టమర్లు ఉన్న ప్రాంతంలో పేలుడు సంభవించినట్లు అర్థమైంది. సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించి చూస్తే ఓ వ్యక్తి మాస్క్, మఫ్లర్ ధరించి బిల్లింగ్ కౌంటర్ వద్దకు వచ్చి రవ్వ ఇడ్లీ ఆర్డర్ చేసినట్లు కనిపించింది. ఆర్డర్ చేసిన తర్వాత ఓ మూల కుర్చిలో కూర్చుని ఉన్నాడు. ఇడ్లీ తిన్న తర్వాత రెస్టార్ రెంట్ నుంచి బయటకు వెళ్లే ముందు బ్యాక్ ని ఓ మూలన ఉంచాడు. కొద్ది సమయానికే పేలుడు సంభవించింది’ అని అన్నారు.

రామేశ్వరం కేఫ్.. ఇటీవల నాకు పుట్టిన బిడ్డ రెండూ నా దృష్టిలో ఒకటే.. మా అవుట్ లెట్ లో జరిగిన ఈ దుర్ఘటన తీవ్రంగా బాధిస్తుంది. రామేశ్వరం కేఫ్ త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి తెస్తాం. ఇకపై ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటూ.. ప్రటిష్టమైన భద్రతా వ్యవస్థతో పనిచేస్తాం. కేఫ్ పేలుడు ఘటనలో ఎవరికీ ప్రాణ నష్టం జరగనందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అంటూ కేఫ్ యజమాని దివ్య రాఘవేంద్ర పేర్కొన్నారు.ఈ ఘటనలో దాదాపు పది మంది వరకు గాయపడ్డారు.. వారిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు ఎన్ఐఏ పరిశీలిస్తుంది. ఈ ఘటన మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments